Brahmamudi Serial Today May June 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: యామినికి షాక్ ఇచ్చిన కావ్య – ఫ్యామిలీతో పెళ్లికి వెళ్లిన కావ్య
Brahmamudi Today Episode: దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం యామిని, రాజ్ ల పెళ్లికి వెళ్లడంతో ఇవాళ్లీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: యామిని పెళ్లి చెడగొట్టేందుకు ఇందిరాదేవి ప్లాన్ చేస్తుంది. అయితే రుద్రాణి తమతో పాటు వస్తే తమ ప్లాన్ ఫెయిల్ అవుతుందని రుద్రాణి రాకుండా చూడాలని చెప్తుంది. దీంతో రాహుల్, రుద్రాణి పెళ్లికి రాకుండా అపే బాధ్యత నాది అంటుంది స్వప్న.
అపర్ణ: అయితే నువ్వు పెళ్లికి రావడం లేదా స్వప్న
స్వప్న: మీ స్వప్నం నెరవేరాలంటే ఈ స్వప్న పెళ్లికి రాకూడదు ఆంటీ మీరు వెళ్లండి
ఇందిరాదేవి: అందరూ వచ్చారు సుభాష్ ఏడీ కనిపించడం లేదు
అపర్ణ: ఆయనకు ఆఫీసులో ఏదో అర్జెంట్ పని ఉందంటే వెళ్లారు
ఇందిరాదేవి: మరి నా మనవరాలు ఎక్కడ ఉంది..?
కావ్య రెడీ అయి వస్తుంది. కావ్యను చూసి అందరూ షాక్ అవుతారు.
కావ్య: ఏంటి అందరూ అలా చూస్తున్నారు.. అమ్మమ్మ గారు నా చీర ఎలా ఉంది..?
ఇందిరాదేవి: చీర బాగానే ఉంది. కానీ నీ పద్దతే అస్సలు బాగాలేదు
కావ్య: నేనేం చేశాను అమ్మమ్మగారు
అపర్ణ: చేయాల్సిందంతా చేస్తావు మళ్లీ నేనేం చేశాననని అమాయకంగా అడుగుతావు మనం ఏమైనా షాపింగ్‌కు వెళ్తున్నామా..? లేకపోతే పక్కింటి వాళ్ల ఫంక్షన్‌కు వెళ్తున్నామా..? నీ మొగుడి పెళ్లికి వెళ్తున్నామే.. ఆ చీర ఏంటి..? ఆ ఆనందం ఏంటి..? కొంచెం కూడా బాధగా లేదా..? నీకు
కావ్య: చెప్పాను కదా అత్తయ్యా ఆ దేవుడే మా ఇద్దరికి బ్రహ్మముడి వేశాడని
ఇందిరాదేవి: అమ్మా తల్లి నీ బ్రహ్మపురాణం అపేయ్ అవతల పెళ్లికి టైం అవుతుంది వెళ్దాం పదండి
అని అందరూ బయలుదేరుతారు. మరోవైపు రూంలో రాహుల్‌ను త్వరగా రెడీ కమ్మని అరుస్తుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి డోర్ క్లోజ్ చేసి బయట నుంచి లాక్ చేస్తుంది. రుద్రాణి స్వప్నకు కాల్ చేస్తుంది. స్వప్న కస్టమర్ కేర్ లో మాట్లాడినట్టు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. రుద్రాణి టెన్షన్ పడుతుంది. మరోవైపు యామిని పట్టు చీర కట్టుకుని వస్తుంది.
వైదేహి: ఇప్పుడు పట్టుచీర ఎందుకు కట్టుకున్నావు బేబీ మళ్లీ పసుపు చీర కట్టుకోవాలి కదా
వైదేహి భర్త: పర్వాలేదులే వైదేహి ఈ పట్టు చీరలో నా కూతురు లక్ష్మీదేవిలా ఉంది. ఈ పెళ్లి తంతు అయిపోయాక మళ్లీ ఈ చీరలో చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఏంటో ఉండని
వైదేహి: అవును చాలా బాగుంది
రాజ్: వీళ్లేమో పెళ్లి పనులు అన్ని చేసేస్తున్నారు. ఇక్కడేమో కళావతి గారు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇక లాభం లేదు. నేరుగా కళావతి గారి ఇంటికి వెళ్లి విషయం చెప్పాలి.
మనసులో అనుకుని వెళ్లబోతుంటే యామిని ఆపేస్తుంది.
యామిని: బావ ఇంకా పట్టు బట్టలు కట్టుకోలేదు.. ఇంకొక గంటలో నలుగు మొదలవుతుంది
రాజ్: కొంచెం పనుంది బయటకు వెళ్తున్నాను
యామిని: ఆదిగో కళావతి గారు వచ్చేశారు
రాజ్: వీళ్లెందుకు వచ్చారు..?
వైదేహి: మేమే పిలిచాము కాబట్టే వచ్చారు
రాజ్: మీరు ఎప్పుడు పిలిచారు
వైదేహి: మేము నిన్న వెళ్లి ఇన్వైట్ చేశాము అందుకే వచ్చారు
రాజ్: అంటే కళావతి గారికి పెళ్లి గురించి ముందే తెలుసు అన్నమాట. అందుకే రాత్రి నాతో సరిగ్గా మాట్లాడలేదు. (మనసులో అనుకుంటాడు.)
యామిని: థాంక్యూ కళావతి గారు పదండి లోపలికి మీ చేతుల మీదుగా పెళ్లి తంతు ప్రారంభించండి
అని యామిని చెప్పగానే అందరూ లోపలికి వెళ్తుంటారు. అపర్ణ, ఇందిరాదేవి.. రాజ్‌ను పక్కకు తీసుకెళ్తారు. ఎందుకు ఇలా చేశావని నిలదీస్తారు. యామిని సూసైడ్ అటెంప్ట్ చేసిందని అందుకే పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో కళ్యాణ్ అప్పు వచ్చి పెళ్లి పెటాకులు చేయడానికి తాము చేసిన ప్లాన్ చెప్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!




















