Brahmamudi Serial Today June 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : స్పృహలోకి వచ్చిన మాయ - ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరిపిస్తానన్న అపర్ణ
Brahmamudi Today Episode: ఇక పెళ్లి ఆపేందుకు ఎటువంటి మార్గం లేదని తెలిసి కావ్య బాధపడుతుంటే అప్పు ఫోన్ చేసి మాయకు స్పృహ వచ్చిందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి, పరంధామయ్య ఇద్దరూ కలిసి ఆలోచిస్తూ కూర్చుని ఉంటారు. ఇంతలో అపర్ణ వచ్చి మీరింకా రెడీ కాలేదేంటి? అని అడుగుతుంది. అక్కడ చిరంజీవి సౌభాగ్యవతి లేదు. చిరంజీవి లేడు ఇక మేమొచ్చి ఏం చేయగలం చెప్పు అని ఇందిరాదేవి అడుగుతుంది. దీంతో అపర్ణ నేనెప్పటికి తప్పు చేయనని చెప్తుంది. దీంతో మనం ఈ పెళ్లికి పెద్దలుగా నిలబడితే మన పెద్దరికం ఏమౌతుంది చిట్టి అని పరంధామయ్య అడుగుతాడు. తర్వాత ఇద్దరం కలిసే వస్తామని.. వచ్చి మౌనంగా నిలబడతామని ఇందిరాదేవి చెప్పగానే అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు హాస్పిటల్‌లో నిజమైన మాయకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వచ్చి 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుందని అప్పుకు చెప్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో పెళ్లి పనులు జరగుతుంటాయి. మాయ పెళ్లిపీటల మీద కూర్చుని ఉంటుంది.
పంతులు: అమ్మా అందరూ పెళ్లికూతురు మీద అక్షితలు వేసి ఆశీర్వదించండి.
అపర్ణ: ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక పసిబిడ్డకు న్యాయం చేయడం కోసం ఈ పెళ్లి జరిపించే తీరాలి.
స్వప్న: అదేంటి అలాగే నిలబడిపోయావు. వచ్చి అక్షింతలు వేయ్. ఇంకొద్ది గంటల్లో నీ మొగుడు ఈ పిల్ల తల్లి మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఈ మాయలాడి మీ ఆయన చిటికనవేలు పట్టుకుని మీ బెడ్ రూంలో అడుగుపెడుతుంది. సిగ్గు లేని వాళ్లందరూ కూడా అక్షితలు వేసి దీవిస్తున్నారు.
అపర్ణ: స్వప్న పెళ్లిలో గొడవలు వద్దు ఇది దుగ్గిరాల ఇంట్లో జరిగే పెళ్లి.. మీ ఏరియాలో జరిగే పెళ్లి కాదు.
స్వప్న: ఆయ్యో మా ఏరియాలో జరిగే పెళ్లి అయితే పంపు దగ్గర ఉన్న అమ్మలక్కలు అందరూ వచ్చి బిందెలతో దీని బుర్ర బద్దలు కొట్టేవారు.
అంటూ దీని నెత్తిన నేను అక్షితలు వేయమన్నా వేయను ఓ బండరాయి తీసుకొచ్చి మా కావ్య చెబితే ఇప్పుడే వేస్తాను. అనగానే ఎవ్వరూ ఏమనుకున్నా ఈ పెళ్లి జరిగే తీరుతుంది అంటూ మాయ అపర్ణ దగ్గరకు వెళ్లి మీరు నన్ను మనఃస్పూర్తిగా ఆశీర్వదించండి అని అడుగుతుంది. తర్వాత గార్డెన్‌లో ఇందిరాదేవితో కావ్య ఏడుస్తుంది. మొదటిసారి ఓడిపోతానేమోనని భయంగా ఉందని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి నువ్వు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు నేను ఎలాగైనా పెళ్లి ఆపేస్తానని చెప్తుంది. నేను మాట తప్పలేనని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు హాస్పిటల్‌లో నిజమైన మాయ కదులుతుంది. డాక్టర్ వచ్చి మాయను పరిశీలస్తుంది. మరోవైపు సుభాష్, కావ్య దగ్గరకు వెళ్లి ఈ పెళ్లి ఆపేస్తానన్నావు కానీ పెళ్లి జరిగిపోతుంది ఎలా అంటూ అడుగుతాడు. ఇంతలో రాజ్ వస్తాడు.
రాజ్: నిన్ను నమ్మి పీటల మీద కూర్చుంటున్నాను ఇక భారం అంతా నీదే..
సుభాష్: ఎంటమ్మా నువ్వేం సమాధానం చెప్పవేంటి?
కళ్యాణ్: వదిన అన్నయ్య గురించి మీ కాపురం గురించి ఎక్కువ ఆలోచిస్తానన్నావ్ ఇప్పుడు ఈ పెళ్లి, పీటల దాకా వచ్చింది. ఏదైనా చేయబోతున్నావా? అసలు ఇంకేం చేయవా?
సుభాష్: మాట్లాడు అమ్మా నేను కేవలం నా కొడుకును దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు.
స్వప్న: నేను దాన్ని రాజ్ పక్కన చూడలేకపోతున్నాను. ఏదైనా తెచ్చి దాని తల పగులగొడతాను. కావాలంటే ఎవరినైనా నా మీద కేసు పెట్టుకోమని..
ఇందిరాదేవి: కావ్య నువ్వు ఏదైనా చేసి ఈ పెళ్లి ఆపేస్తావన్న నమ్మకంతో ఇంతసేపు ఓపిక పట్టాను. ఇప్పుడు పెళ్లి జరగబోతుంది. ఏం చేయాలనుకుంటున్నావో చెప్పమ్మా..
అని అందరూ కావ్యను అడుగుతుండగానే అప్పు, కావ్యకు ఫోన్ చేసి నిజమైన మాయ స్పృహలోకి వచ్చిందని చెప్పగానే మీరందరూ నాకోసం ఈ పెళ్లిని కొద్దిసేపు ఆపండి అని చెప్పి హాస్పిటల్‌కు వెళ్తుంది. కావ్య మాయను నిజం చెప్పమని అడుగుతుండగానే మాయ మళ్లీ స్పృహ కోల్పోతుంది. కావ్య షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.