అన్వేషించండి

Brahmamudi Serial Today July 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి ప్లాన్ సక్సెస్ - దుగ్గిరాల ఫ్యామిలిలో మొదలైన మరో గొడవ

Brahmamudi Today Episode: అంతా సద్దుమనిగింది అనుకున్న తరుణంలో రుద్రాణి ఒక్క మాటతో దుగ్గిరాల కుటుంబంలో మరో గొడవ మొదలవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రూంలోకి వెళ్లిన కళ్యాణ్‌కు అనామిక చేసిన మోసం గుర్తుకు వస్తుంది. దీంతో బాధపడుతూ పెళ్లి ఆల్బమ్‌ తీసుకుని బయటకు తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటిస్తాడు. అది చూసిన కావ్య కూడా చాలా మంచి పని చేశావని లేదంటే నీకెప్పుడూ ఆ అనామిక గుర్తుకు వచ్చి బాధపడేవాడివి అంటూ భోజనం చేద్దాం రా అని లోపలికి తీసుకెళ్తుంది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర అందరూ కళ్యాణ్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో కళ్యాణ్‌, కావ్య వస్తారు.

రాజ్‌: రారా కూర్చో... కళావతి వాడికి వడ్డించు..

ధాన్యలక్ష్మీ: తినరా

అపర్ణ: జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని ప్రపంచానికి తెలిసింది కదరా? ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అదొక పీడకలలా మర్చిపో..

ఇందిరాదేవి: నిజానికి మన కుటుంబంలో విడాకులు అనేవి మొదటిసారి జరిగాయి. అయినా ఎవ్వరం బాధపడటం లేదు. నిన్ను అర్థం చేసుకోని ఆ అమ్మాయి నీ జీవితంలోంచి వెళ్లిపోవడమే మంచిది అనుకున్నాం.

స్వప్న: ఎంతైనా  ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా ఆ బాధ ఉంటుంది లేండి.

రాజ్: మనం ఇక జరిగిన దాన్ని వాడి ముందు గుర్తు చేయకపోవడమే మంచిది.

ధాన్యలక్ష్మి: అవును అంతా మర్చిపోయి ఇక నుంచి ప్రశాంతంగా ఉండరా? ఈ ఇంట్లో ఇక నుంచి ఆ అనామిక పేరే తీసుకురాము. సరేనా..

ప్రకాష్‌: తినకుండా ఎంతసేపు అలా కూర్చుంటావురా తిను. అనామికను పూర్తిగా మర్చిపో..

 రుద్రాణి: అయ్యో చిన్న అన్నయ్యా ఇక్కడ సమస్య అది కాదు. విడాకులు మంజూరై అనామిక దూరం అయిందన్న బాధ వాడిలో అసలు లేదు. అనామిక మూలంగా అప్పుకు దారుణమైన నష్టం జరిగిందన్న బాధ వాణ్ని ఎక్కువ కుంగదీస్తుంది.

ALSO READ: బోనం చేసేప్పుడు తప్పులు అస్సలు చేయకూడదు.. ఇలా చేసి అమ్మవారికి సమర్పించాలి

స్వప్న: ప్లేట్‌ లో ఉన్నది అన్నమేగా మీరు కడుపుకు అదేగా తింటున్నారు.

   అనగానే కావ్య కూడా రుద్రాణిని తిడుతుంది. రాహుల్‌ అడ్డుపడతాడు. దీంతో రాహుల్‌ను రాజ్‌ తిడతాడు. దీంతో డైనింగ్‌ టేబుల్‌ దగ్గర పెద్ద గొడవే జరుగుతుంది. అనామిక వెళ్లిపోయింది అప్పు వల్ల కాదని నీవల్లే వెళ్లిపోయిందని కళ్యాణ్‌ ధాన్యలక్ష్మిని తిడతాడు. దీంతో ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతుంది. కళ్యాణ్‌ భోజనం చేయకుండా వెళ్లిపోతాడు.  ధాన్యలక్ష్మీ కావ్యను తిడుతుంది. అపర్ణ, ధాన్యలక్ష్మీని తిడుతుంది. దీంతో ఎవ్వరూ భోజనం చేయకుండా వెళ్లిపోతారు. రుద్రాణిని స్వప్న తిట్టి వెళ్లిపోతుంది. కళ్యాణ్‌ ఓంటరిగా కూర్చుని బాధపడుతుంటాడు. కావ్య వెళ్లి ఓదారుస్తుంది.

కావ్య: కూల్‌గా ఉండండి కవిగారు. అసలు ఎందుకు మీకింత ఆవేశం.

కళ్యాణ్‌: ఇది కూడా ఒక ఆవేశమేనా వదినా అసలు జరిగిందంతా గుర్తు చేసుకుంటుంటే.. నాగుండె ఎంత మండిపోతుందో తెలుసా?

కావ్య: తెలుసు.. కానీ చెడ్డ వాడికి ఆవేశం వస్తే పక్కవాళ్లకు నష్టం జరుగుతుంది. కానీ మంచి వాళ్లకు ఆవేశం వస్తే వాళ్ల మనసే రగిలిపోతుంది. మీ మనసును మీరే నష్టపెట్టుకోవడం అవసరమా కవిగారు.

కళ్యాణ్‌: మా అమ్మా ఎలా మాట్లాడిందో విన్నారుగా వదిన ఇంకా ఇంకా నాదే తప్పు అంటుంది.

కావ్య: మీరు ఎదిగినంత ఎత్తుగా అందరూ ఎదగాలంటే.. అది అందరికీ ఎలా సాధ్యం అవుతుంది.

కళ్యాణ్‌: అసలు ఇంత జరిగింది ఇందులో ఎక్కడైనా అప్పు తప్పుందా? ఎందుకు పదే పదే అప్పును లాక్కొస్తారు. మా అమ్మా సపోర్టు చేయకుండా ఉంటే ఈరోజు అనామిక వల్ల అప్పుకు ఇంత చెడ్డపేరు వచ్చేదే కాదు.

అంటూ కళ్యాణ్‌ బాధపడుతుంటే కావ్య ఓదారుస్తుంది. ఇద్దరూ నిర్దోషులని కోర్టులో నిరూపణ అయ్యింది కదా? చివరికి అనామికకు ఎలాంటి శిక్ష పడిందో తెలుసు కదా? అంటుంది. అయినా కళ్యాణ్‌ బాధపడతాడు. ఇవన్నీ మర్చిపోయి కొత్త పుస్తకం రాయమని సజెషన్‌ ఇచ్చి వెళ్తుంది కావ్య. తర్వాత కావ్య, రాజ్‌ ఇద్దరూ కలిసి కళ్యాణ్‌ను గురించి ఆలోచిస్తుంటారు. కళ్యాణ్‌ బాధను ఎలా తగ్గించాలని ప్లాన్‌ చేస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Janasena: 'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
Viral News: చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
Viral News: ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
Embed widget