Brahmamudi Serial Today July 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: జూనియర్‌ను అనుమానించిన రుద్రాణి – డైవర్ట్ చేసిన కావ్య, రాజ్
Brahmamudi serial today episode July 30th: అపర్ణ ఇంటికి తీసుకొచ్చిన జూనియర్ రాజ్‌ను చూసి రుద్రాణి అనుమానిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చని స్వరాజ్ ఇల్లంతా కలియ తిరుగుతూ చూసి అపర్ణ దగ్గరకు వస్తాడు. మీ ఇల్లు బయట నుంచే కాదు లోపల కూడా చాలా చాలా బాగుంది అంటాడు. జూనియర్ స్వరాజ్‌ను చూస్తున్న అందరూ ఆశ్చర్యపోతుంటారు.
రాహుల్: ఆ పిల్లాడు ఎవరు మమ్మీ
రుద్రాణి: నాకు అదే అర్థం కావడం లేదురా..? కొంపదీసి గతంలో అన్నయ్య ట్విస్ట్ ఇచ్చినట్టు వదిన కూడా ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా ఏంటి..?
రాహుల్: నువ్వు ఊరుకో మమ్మీ పెద్దత్తయ్యా అలాంటిది కాదు.
సుభాష్: అపర్ణ ఎవరీ పిల్లాడు..?
అపర్ణ: మొన్న మీకు చెప్పాను కదండి నేను కారు డోరు తీస్తుంటే ఒక పిల్లాడు కిందపడిపోయాడు. వాడు నాకు చాలా బాగా నచ్చాడు అని వాడే వీడు
రుద్రాణి: నచ్చితే ఓ చాక్లెటో..బిస్కెట్టో కొనిస్తే సరిపోతుంది కదా వదిన ఇలా ఇంటి దాకా తీసుకురావడం ఏంటి
అపర్ణ: ఏం తీసుకొస్తే ఏమైంది రుద్రాణి వీడికి నా మనసులోనే స్థానం ఇచ్చాను.. ఇక ఇంటిలో స్థానం ఇవ్వలేనా..?
ధాన్యలక్ష్మీ: ఇంతకీ ఈ బాబు ఎవరి పిల్లాడు అక్కా
అపర్ణ: అది తెలియకే ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది ధాన్యం
ప్రకాష్: అదేంటి వదిన పిల్లాడి పేరెంట్స్ తెలియకపోతే ఇంటికి తీసుకురావడం ఏంటి..?
అపర్ణ: వీడు ఇందాక గుడిలో తప్పిపోయి అటూ ఇటూ తిరుగుతుంటే నేనే ఇంటికి తీసుకొచ్చాను ప్రకాషం
ప్రకాష్: తప్పిపోయాడా..?
స్వప్న: ఈ బాబును ఎక్కడో చూసినట్టు ఉంది
అప్పు: అవును అక్కా నాక్కూడా ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది
అపర్ణ: వీడు ఎవరి కొడుకో నీకు తెలుసా..? స్వప్న
స్వప్న: తెలుసు ఆంటీ..
కావ్య: అక్కా.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు. వీడు మన అత్తయ్య ఫ్రెండ్
చెప్పొద్దంటూ కావ్య సైగ చేస్తుంది. అప్పు, స్వప్న సరే అన్నట్టు తల ఊపుతారు. రాజ్: అవును పైగా అమ్మ వెళ్లిన గుడిలోనే పాపం తప్పిపోయాడు. వాళ్ల అమ్మ కోసం టెన్షన్ పడుతుంటే. చూసి తట్టుకోలేకపోయింది మా అమ్మ. మా అమ్మకు వీడు ఇది వరకే పరిచయం కాబట్టి ఇంటికి తీసుకొచ్చింది.
కావ్య: అవును అక్కా మీరు చూసిన అబ్బాయి వేరు ఈ అబ్బాయి వేరు.. కావాలంటే ఒకసారి బాగా చూడండి
స్వప్న: ఆ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది కావ్య
అప్పు: అనిపించడం ఏంటి అక్కా హండ్రెడ్ పర్సెంట్ వీడు వేరు వాడు వేరు
రుద్రాణి: వీళ్లేంటి..? ఏదో ప్రిపేర్ చేసి పెట్టిన ఆర్టిస్టుల్లా..ఇప్పుడే తెలుసు అని చెప్పి అప్పుడే మాట మారుస్తున్నారు ఇంతలో ఏం జరిగి ఉంటుంది. ( మనసులో అనుకుంటుంది)
రాజ్: హలో అప్పు పోలీస్
అప్పు: బావగారు నన్ను అప్పు అని పిలవండి లేకపోతే పోలీస్ అని పిలవండి అంతేకానీ అలా రెండు కలిపి పిలిస్తే నేను ఏదో అప్పు చేసిన పోలీస్ లా అనిపిస్తుంది
రాజ్: సరే అయితే కానీ నువ్వు ఈరోజంతా బాగా ఆలోచించి వీడి పేరెంట్స్ ఎవరో కనుక్కో రేపు పొద్దున వీడిని వాళ్ల పేరెంట్స్‌కు అప్పగిద్దాం
అని చెప్పగానే అప్పు సరే అంటుంది. ఇందిరాదేవి వచ్చి రేవతి కొడుకును చూసి ఎమోషనల్ అవుతుంది. లోపలికి వెళ్లి సీతారామయ్యను తీసుకొస్తుంది. ఇద్దరూ అపర్ణను ఎవరీ పిల్లాడు అని అడుగుతారు. అపర్ణ జరిగిన విషయం చెప్తుంది. తర్వాత అపర్ణ స్వరాజ్‌కు భోజనం పెడుతుంది. రాజ్ వెళ్లి వీడి మీద నీకసలు ప్రేమే లేదమ్మా అంటాడు. అంత ప్రేమే ఉంటే ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపించాలి అంటాడు. తర్వాత అపర్ణ, సుభాష్ ఇద్దరూ కలిసి స్వరాజ్‌ను తమ మీద కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తారు. కావ్య, రేవతికి వీడియో కాల్ చేసి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన రేవతి, జగదీష్ ఎమోషనల్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















