అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Brahmamudi Serial Today January 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : సూసైడ్ సెల్ఫీ వీడియో తీసుకున్న స్వప్న – అత్తాకొడళ్ల మధ్య చిగురించిన ప్రేమ

Brahmamudi Today Episode: టిఫిన్ విషయంలో కావ్యకు సపోర్టుగా నిలబడుతుంది అపర్ణ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇంట్లో గొడవ పడుతున్న ధాన్యలక్ష్మీ, అపర్ణను గార్డెన్‌లోకి తీసుకొచ్చి క్లాస్‌ తీసుకుంటుంది ఇందిరాదేవి. ఇద్దరికీ తాను ఒక అత్తలా కాకుండా అమ్మలా చెప్తున్నానని మీకు ఇంత వయసు వచ్చింది అర్థం చేసుకోండని చెప్తుంది. దీంతో ఇద్దరూ అర్థం అయ్యింది అంటారు. అయితే ధాన్యలక్ష్మీ వెటకారంగా నాదేం మట్టి బుర్ర కాదని అపర్ణను మాట్లాడటంతో..

ఇందిరాదేవి: అబ్బే మట్టి బుర్ర కాదు. వానలో  తడిస్తే మొలకలు వచ్చే బుర్ర. ఇప్పుడే కదా చెప్పాను అప్పుడే మాటకు మాట ఎదురు  చెప్పాలా? ఇది ఆదిపత్యం కోసం చేసే పోరులా ఉంది.  ఇలా ఉంటే మీరు మీ కోడళ్లకు ఏం సందేశం ఇస్తారు. కలిసి ఉండాలని చెప్పే అర్హత పోగొట్టుకుంటారు.  

  అంటూ ఇందిరాదేవి  జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ధాన్యలక్ష్మీ, అపర్ణకు సారీ చెప్తుంది. ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే నేను ఎందుకు ఇలా మాట్లాడతాను అంటుంది. నేను కూడా ఇప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్లను. నా జోలికి నేనే వెళ్తాను అంటూ అపర్ణ వెల్లిపోతుంది. మరోవైపు స్వప్న రూంలో బుక్ చదవుతూ ఉంటుంది. ఇంతలో రుద్రాణి ఫ్రూట్స్‌ తీసుకుని వస్తుంది.

స్వప్న: టాబ్లెట్స్‌ తెప్పించమన్నాను తెప్పించారా?

రుద్రాణి: తెప్పిచకపోతే నువ్వు ఊరుకుంటావా? రాహుల్‌తో తెప్పించాను.

అనగానే రాహుల్‌ లోపలికి వచ్చి టాబ్లెట్స్‌ స్వప్నకు ఇస్తాడు. టాబ్లెట్స్‌ తీసుకున్న స్వప్న వాటిని వీడియో తీస్తూ.. ఈ టాబ్లెట్స్‌ మా అత్త నా భర్తతో తెప్పించింది. అంటూ నామీద మర్డర్‌ ప్లాన్‌ జరుగుతుంది. వీళ్లకు కఠినశిక్ష పడాలి అంటూ వీడియో రికార్డు చేసుకుని లేచి వెళ్లిపోతుంది.

రుద్రాణి: ఏయ్‌ ఏం జరుగుతుంది.

స్వప్న: నామీద హత్యాప్రయత్నం జరుగుతుంది.

రాహుల్‌: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. నాటకాలాడుతున్నావా?

స్వప్న: మీరు నాటకాలాడుతున్నారా? నన్ను నా కడుపులో ఉన్న బిడ్డను చంపేయడం లేదా?

రుద్రాణి: మేము మర్దర్‌ ప్లాన్‌ చేశామనడానికి ఏంటి? సాక్ష్యం.

స్వప్న: ఇదిగో ఈ టాబ్లెట్‌ సాక్ష్యం

అంటూ ఎక్స్‌పైర్‌ అయిన టాబ్లెట్‌ తీసుకొచ్చి నన్ను, నా కడుపులో బిడ్డను చంపాలని చూస్తున్నారా అంటూ స్వప్న చెప్పడంతో రుద్రాణి, రాహుల్‌ షాక్‌ అవుతారు. మిమ్మల్ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతాను.. మిమ్మల్ని డే అండ్‌ నైట్‌ చూపించండి అంటూ మీడియా మిత్రులను రిక్వెస్ట్‌ చేస్తాను అంటూ వార్నింగ్‌ ఇస్తూ స్వప్న  బయటకు వెల్లబోతుంటే  రుద్రాణి, రాహుల్‌ సారీ చెప్తారు. మరోవైపు అందరూ హాల్‌లో కూర్చుని ఉండగా కావ్య వచ్చి అపర్ణను ఏం టిఫిన్‌ చేయాలని అడుగుతుంది. ఇంతలో ప్రకాష్‌ కల్పించుకుని.. పెసరట్టు విత్‌ అల్లం చెట్నీ చెయ్యమని చెప్తాడు. దీంతో కావ్య మీకు ఏం చేయాలి అత్తయ్య అని అడుగుతుంది. అందరికీ అదే చెయ్యమని అపర్ణ చెబుతుంది. పై నుంచి వచ్చిన ధాన్యలక్ష్మీ  మాకోసం ఎవరూ టిఫిన్‌ చేయ్యోద్దని మాకు మేమే చేసుకుంటామంటుంది. అందరూ షాక్‌ అవుతారు. ప్రకాష్‌ మాత్రం నీ ప్రయోగాలు మా మీద చెయ్యకు అంటాడు. ఇంతలో అపర్ణ ఇంట్లో అందరికీ టిఫిన్‌ కావ్యనే చేస్తుంది అంటూ ఆర్డర్‌ వేసినట్లు చెప్తుంది.

అపర్ణ: అందరికీ నువ్వు పెసరట్టు చేయ్‌ ఇష్టం లేని వాళ్లు తినరు

కావ్య: సరే అత్తయ్య

అంటూ కిచెన్‌లోకి వెళ్తుంది. పైపుంచి ఇదంతా గమనిస్తున్న రాజ్‌, కళ్యాణ్‌తో

రాజ్‌: ఇంకా నయం పిన్ని కోపం మన మీద పడలేదురా?

కళ్యాణ్‌: అమ్మ ఏది చేసినా నేను మాత్రం వదిన చేసిందే తింటాను అన్నయ్య.

రాజ్‌: మరి పిన్నికి ఏం చెప్తావురా..?

కళ్యాణ్‌: పెద్దమ్మ ఉందిగా ఆవిడ మీద తోసేయడమే

రాజ్‌: రెండు పులులు కొట్టుకుంటే మధ్యలో నక్క లాభపడ్డట్టు.. వాళ్ల గొడవని అడ్వాంటేజ్‌ గా తీసుకుంటున్నావన్నమట.

  అనగానే కళ్యాణ్‌ ఆలోచించి అన్నయ్య  నువ్వు  చెప్పింది నిజమే వావ్‌ భలే మంచి ఐడియా ఇచ్చావన్నయ్య అంటూ అక్కడి నుంచి  కిచెన్‌లోకి వెళ్లి.. కావ్యను తన కాపురం నిలబెట్టుకోవడం కోసం ఆఫీసుకు వెళ్లడానికి మార్గం దొరికిందని చెప్తాడు. దీంతో కావ్య షాక్‌ అవుతుంది. దీంతో కళ్యాణ్‌, కావ్యను కన్వీన్స్‌ చేసి మా అమ్మ మీద  పెద్దమ్మకున్న కోపాన్ని మనం క్యాష్‌ చేసుకునే టైం వచ్చింది.. అంటూ తన ప్లాన్‌ మొత్తం కావ్యకు చెప్తాడు. ధాన్యలక్ష్మీ బయట డోర్‌ దగ్గర ఫోన్‌ మాట్లాడుతుంది. అది గమనించిన కళ్యాణ్‌, కావ్యను డోర్‌ పక్కకి తీసుకెళ్లి..

 కళ్యాణ్‌: ఇప్పుడు చెప్పండి వదిన ఇక్కడ ఎవ్వరూ లేరు.

అని ధాన్యలక్ష్మీ వినేటట్టు అంటాడు. దీంతో వాళ్లను గమనించిన ధాన్యలక్ష్మీ కొంచెం చాటుగా జరిగి వాళ్ల మాటలు వింటుంది.

కళ్యాణ్‌: అంటే ఎంటి మీ నిర్ణయం మార్చుకోరా? దీనివల్ల వచ్చే పర్యవసానాలు, ప్రతిస్పందనలు తెలిసే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారా?

కావ్య: అవును కవిగారు

  అంటూ కావ్య ఏవేవో కవితలు చెప్తుంది. దీంతో కళ్యాణ్‌ అయితే మీరు ఈరోజు నుంచి ఆఫీసుకు వెళ్తారా? అంటూ ఇద్దరూ కలిసి ధాన్యలక్ష్మిని రెచ్చగొడతారు. దీంతో  ధాన్యలక్ష్మీ ఏంటే నా కొడుకును అసమర్తుడిని చేసి వాణ్ణి ఇంట్లో ఉంచి నువ్వు రాజ్యాలేలడానికి వెళ్తావా? అంటూ మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ధాన్యలక్ష్మీ వెళ్లడంతో కావ్య, కళ్యాణ్‌ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు అప్పుకు డెలివరీ బాయ్‌ జాబ్‌ ఇప్పించిన మధుకు థాంక్స్‌ చెప్తుంది. దీంతో మధు కళ్యాణ్‌ గురించి మాట్లాడగానే అప్పు సీరియస్‌గా చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget