Brahmamudi Serial Today Fabruary 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కనకాన్ని బెదరించిన అప్పు – కోమాలోంచి బయటకు వచ్చిన సీతారామయ్య
Brahmamudi Today Episode: స్వప్నకు ఆడపిల్ల పుట్టిందని రుద్రాణి తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఆఫీసులో పని చేసుకుంటున్న కావ్యకు అపర్ణ ఫోన్ చేసి నువ్వు పిన్నివి అయ్యావని స్వప్నుక అమ్మాయి పుట్టిందని చెప్తుంది. కావ్య హ్యాపీగా ఫీలవుతూ రాజ్‌కు విషయం చెప్తుంది. వెంటనే ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అప్పుడే హాస్పిటల్ నుంచి స్వప్నను తీసుకుని అందరూ వస్తారు. స్వప్నకు దిష్టి తీస్తుంది కావ్య. అందరూ హాల్లో కూర్చుని ఉంటారు.
ఇందిర: ఈ తరం నుంచి ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి బిడ్డ సాక్ష్యాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుందిరా..?
ధాన్యలక్ష్మీ: పోనీలేండి కనీసం ఈ లక్ష్మీదేవి ఇంటికి రావడంతోనైనా మన సమస్యలు అన్ని తీరిపోయి ఎవరి ఆస్థి వాళ్లకు వస్తే చాలా సంతోషం
ప్రకాష్: ఇలాంటి సమయంలో కూడా నీ ఆస్థి గొడవలు ఏంటే..? కాస్త ఆపుతావా..?
ధాన్యలక్ష్మీ: తప్పేముంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కాకపోతే మన ఆస్థి మనకు ఇస్తే ఇంకా బాగుండని కోరుకుంటున్నాను
అపర్ణ: చాల్లే ఆపు ఎప్పుడు చూసినా ఆస్థి ఆస్థి అనడమేనా..?
రుద్రాణి: మనిషి బతకాలంటే ఆయుష్షు ఎంత ముఖ్యమో ఆస్థి కూడా అంతే ముఖ్యం కదా వదిన
సుభాష్: ఇలా రెచ్చగొట్టే ధాన్యలక్ష్మీని పూర్తిగా మార్చేశావు
ధాన్యలక్ష్మీ: నేనేం చిన్నపిల్లను కాదు బావగారు ఒకరు నేర్పిస్తే నేర్చుకోవడానికి
అని అందరూ మాట్లాడుకుంటుండగా.. రాజ్‌కు హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోన్ చేసి మీ తాతయ్య స్పృహలోకి వచ్చాడు అని చెప్తాడు. ఆ న్యూస్ విన్న ఇంట్లో వాళ్లందరూ హ్యాపీగా ఫీలవుతారు. అందరూ కలిసి హాస్పిటల్‌కు వెళ్తారు.
ఇందిర: నన్ను వదిలి వెళ్లిపోవాలనుకున్నావా బావా
సీతారామయ్య: నీ నుంచి నన్ను దూరం చేయడానికి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా.. అందుకే చివరి నిమిషంలో మనసు మార్చుకుని తిరిగి నీ దగ్గరకే పంపాడు. నీ పూజలు వ్రతాలే నన్ను కాపాడాయి.
ఇందిర: లేదు బావ నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడింది. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం చేశావు అదే నిన్ను ఇవాళ రక్షించింది.
సీతారామయ్య: తిడితే తిట్టించుకుంటావు. మంచి చేశావు అని చెప్తే మాత్రం తీసుకోవు ఎందుకు
కావ్య: మీ తాళి చాలా గట్టిది అమ్మమ్మ గారు.. మిమ్మల్ని వదిలి తాతయ్యగారు ఎక్కడికి పోరు
ఇందిర: ఆ నమ్మకంతోనే ఎదురుచూస్తున్నాను కావ్య. నేను సుమంగళిగా ఆయన ఒడిలో తల పెట్టుకుని కన్నుమూయడమే నా కోరిక
అనగానే రాజ్ ఏంటి నాన్నమ్మ ఆ మాటలు.. మీరిద్దరూ నిండూ నూరేళ్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారని చెప్తాడు. మరోవైపు కనకం ఇంటికి పోలీస్ డ్రెస్ లో వెళ్లిన అప్పు.. రివాల్వర్ తీసి వెనక నుంచి కనకాన్ని హాండ్సప్ అంటుంది. కనకం నిజంగా పోలీసే అనుకుని నేనేం చేయలేదు మేడం అంటూ భయపడుతుంది. ఇంతలో మూర్తి వచ్చి అప్పును చూసి నవ్వుతాడు.
మూర్తి: ఏంటే కన్నకూతురిని కూడా గుర్తుపట్టలేకపోయావా..? నీకు ఈ మధ్య చూపు బాగా మందగించింది
కనకం: కన్నకూతురా..?
కళ్యాణ్: అవును అత్తయ్యా మీ ఎదురుగా ఉన్నది మీ కూతురు అప్పునే
అని కళ్యాణ్ చెప్పగానే అప్పును తేరిపార చూసి లోపలి వెళ్లి చీపురు తీసుకొచ్చి కన్నతల్లినే బెదిరిస్తావా అంటూ కొట్టబోతుంది. అప్పు తప్పించుకుంటూ అమ్మా పోలీసును కొడితే పెద్ద కేసు అవుతుంది అంటూ నవ్వుతుంది. ఈ విషయం మీ ఇంట్లో వాళ్లకు చెప్పారా… అని మూర్తి అడుగుతాడు. లేదని కళ్యాణ్ చెప్పగానే.. ముందు మీరు వెళ్లి మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోండని అప్పు, కళ్యాణ్‌లను పంపిస్తారు. మరోవైపు పాపను ఒడిలో పడుకోబెట్టుకుని ఇది రాగానే మా బావను స్పృహలోకి తీసుకొచ్చింది. దీనికి మాటలు రాగానే ఏమి అడిగినా ఇచ్చేస్తాను అంటుంది. దీంతో రుద్రాణి ఏమీ వద్దులే అమ్మా మా ఆస్థి మాకు ఇచ్చేస్తే సరి అంటుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని తిడుతూ పాపకు రేపే బారసాల చేయాలని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

