అన్వేషించండి

Brahmamudi Serial Today December 28th :  ‘బ్రహ్మముడి’ సీరియల్:  ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన రాజ్‌ -  ఇందిరాదేవిని ఓదార్చిన కావ్య

Brahmamudi Today Episode: చెక్కులు, క్రెడిట్‌ కార్డ్స్‌ ట్రాన్సిక్షన్‌ ఆగిపోవడానికి రాహుల్‌ చేసిన నిర్వాకమే కారణం అంటూ రాజ్‌ అబద్దం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: ఇంట్లో కావ్య పెత్తనం భరించలేమని ఈ విషయంపై మీ అన్నయ్యను అడగమని ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌ను రెచ్చగొట్టి బలవంతంగా హాల్లోకి తీసుకొస్తుంది. పని చేసుకుంటున్న సుభాష్‌ దగ్గరకు ప్రకాష్‌ వెళ్లి కావ్య పెట్టిన కండిషన్స్‌ వల్ల ఇంట్లో అందరూ సపర్‌ అవుతున్నారని చెప్తాడు ప్రకాష్‌. ఎవరు సపర్‌ అవుతున్నారు. నీ భార్య ఆమెకు సపోర్టుగా ఉన్న మందరే కదా సపర్‌ అయ్యేది అంటాడు సుభాష్‌. ఇంతలో హాస్పిటల్‌ నుంచి ఫోన్‌ చేసి ఇంకా బిల్లు కట్టలేదని చెక్‌ ఇచ్చారు కానీ అది బౌన్స్‌ అయిందని చెప్తారు. దీంతో సుభాష్‌, కావ్యను పిలుస్తాడు.  

సుభాష్‌: అమ్మా  కావ్య హాస్పిటల్‌ బిల్‌ ఇంకా క్లియర్‌ కాలేదంట చెక్‌ ఎందుకు హోల్డ్‌ లో పెట్టారు.

రుద్రాణి:  మనకు మంచి మసాలా దొరికిందిరా.. ( అని రాహుల్‌కు చెప్తూ..) లోక కళ్యాణం కోసం.. ప్రపంచ శాంతి కోసం.. దుగ్గిరాల వంశ ప్రతిష్టను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం కోసం అంతేనా కావ్య

ధాన్యలక్ష్మీ:  ఎవరిని ఉద్దరించడానికి అంత చిన్న అమౌంట్‌ ఆపాల్సి వచ్చింది. అయినా హాస్పిటల్ బిల్లు ఈవిడ ఆపాల్సిన అవసరం ఏమోచింది. మా మామయ్య హాస్పిటల్‌ బిల్లు కూడా ఎందుకు ఆపావు..

రాజ్‌ : అసలు విషయం బయటపడేలా ఉంది ఏదో ఒకటి చేసి మేనేజ్‌ చేయాలి (అని మనసులో అనుకుని కిందకు వస్తూ..) నేను చెప్తాను.  

రుద్రాణి:  మేము దేని గురించి అడుగుతున్నామో ఆ విషయం నీకు తెలుసా..?

రాజ్‌: ఇంతకీ నీ బాధ ఏంటి అత్తయ్యా…

రుద్రాణి: రాజ్‌  తాతయ్య ఉన్న హాస్పిటల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది ఇంత వరకు బిల్లు కట్టలేదంట

అపర్ణ:  హాస్పిటల్ బిల్లు ఎందుకు క్లియర్‌ చేయలేదు కావ్య.

ఇందిరాదేవి: ఐదు లక్షలు కూడా మన దగ్గర లేవా..? మనకా స్థాయి లేదా..?

కావ్య: అదేం లేదు అమ్మమ్మగారు.. అసలేం జరిగింది అంటే..

రాజ్‌: కళావతి నువ్వు ఆగు.. ఇదంతా నా వల్లే జరిగింది.. అంతా నేనే చెప్తాను.

కావ్య: చెప్పండి మీరే చెప్పండి.. అందరూ నన్ను దోషిగా నిలబెట్టినా మౌనంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని అంటుంటే ఆగలేక నేనే చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు మీరే చెప్పండి

సుభాష్‌: రాజ్‌ ఏం జరుగుతుందిరా… ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు

అపర్ణ: చేయడం కాదు ఇద్దరూ కలిసి ఏదో దాస్తున్నారు. పెద్ద విషయమే జరిగింది.

రాజ్‌: దాచడానికేం లేదు మమ్మీ ఇది రహస్యంగా జరిగేది ఏం కాదు.. ఆఫీసులో ఆడిటింగ్‌ జరుగుతుంది అందుకే ట్రాన్సిక్షన్స్‌ అన్ని ఆగిపోయాయి

ప్రకాష్‌: ఇప్పుడు ఆడిటింగ్‌ ఏంట్రా మార్చిలో కదా జరగాల్సింది.

రుద్రాణి: శభాష్‌ చిన్నన్నయ్యా అన్ని మర్చిపోయిన నువ్వు ఈ విషయం మాత్రం బాగానే గుర్తు పెట్టుకున్నావు అవును రాజ్‌ ఆడిటింగ్‌ ఇప్పుడు జరగటం ఏంటి..?

రాజ్‌:  దానికి నీ కొడుకే కారణం అత్తా.. ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకుంది. మధ్యలో వెళ్లి సీఈవో సీట్లో కూర్చున్నాడు కదా..? లెక్కలు లేవు.. ఏమీ లేవు.. అంత అస్తవ్యస్తం చేశాడు. అడిటింగ్‌ పూర్తి కాగానే అంతా మామూలు అవుతుందనుకున్నాను. కానీ నా లెక్క కూడా తప్పింది.

అంటూ విషయం డైవర్ట్‌ చేస్తాడు రాజ్‌. ఎవరినైనా ఏదైనా అడిగే ముందు క్లారిటీగా తెలుసుకోవాలని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత ఇందిరాదేవి దగ్గరకు వెళ్లిన కావ్య ఓదారుస్తుంది. దీంతో ఇంటిని ముక్కలు కాకుండా నువ్వు రాజ్‌ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు అంటుంది ఇందిరాదేవి. తర్వాత రాజ్‌ దగ్గరకు వెళ్లిన సుభాష్‌ ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతాడు ఎం లేవని ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా డాడీ అంటాడు రాజ్‌.  దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
Gundeninda Gudigantalu Oct 14: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
గుండెనిండా గుడిగంటలు: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
Meghasandesam Serial Today October 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: వంశీని కొట్టిన ఇందు – ఆకాష్‌ను పట్టించిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: వంశీని కొట్టిన ఇందు – ఆకాష్‌ను పట్టించిన అపూర్వ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget