ఎల్‌నీనో పరిస్థితుల కారణంగా భూగర్భ జల మట్టాలు పడిపోకుండా, జల వనరులను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2027 జులై చివరి వరకు అమల్లో ఉంటాయి.
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
Borewell NOC Rules: తెలంగాణలో ఎన్‌నీనో పరిస్థితుల కారణంగా బోర్‌వెల్స్ తవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. తాగునీటికి తప్ప ఇతర పనులకు శుద్ధి చేసిన మురుగు నీటిని వాడాలని ఆదేశించింది.

- భూగర్భ జలాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
- కొత్త బోర్లు తవ్వకాలకు NOC, శుద్ధి చేసిన నీటినే వాడాలి.
- బోర్లను నమోదు చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
- వాన నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలి.
Borewell NOC Rules: ఎల్‌నీనో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జల మట్టాలు పడిపోకుండా చూడటం, లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జల వనరులను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాలు తప్ప ఇతర పనులకు శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 2027 జులై చివరి వరకు అమల్లో ఉండేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో 259 ద్వారా ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
జీవో 259లోని ముఖ్యమైన నిబంధనలు
- అపార్ట్‌మెంట్‌లు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు, వాణిజ్య-పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లు, బల్క్ వాటర్ సప్లైయిర్లు భూగర్భ జలాల వినియోగ నిబంధనలు-2023 ప్రకారం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందిన తర్వాతే కొత్త బోర్లు తవ్వాల్సి ఉంటుంది.
- అనుమతులతో బోర్‌వెల్ తవ్వకం పూర్తి చేసిన 15 రోజుల్లోగా రిగ్ ఆపరేటర్ నిర్ణీత అధికారికి ‘వెల్ కంప్లీషన్ రిపోర్ట్’ను సబ్మిట్ చేయాలి. ఆ బోర్‌వెల్‌ను సంబంధిత తహసీల్దార్ వద్ద తప్పనిసరిగా నమోదు చేయించాలి.
- నిర్మాణ ప్రాజెక్టులు, తోటల పెంపకం, ల్యాండ్‌స్కేపింగ్, రోడ్ల శుభ్రత వంటి అవసరాలకు భూగర్భ జలాలను వాడకూడదు. జలమండలి అందుబాటులోకి తెచ్చిన శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వినియోగించాలి.
- భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీసినా లేదా దుర్వినియోగం చేసినా 'వాల్టా' (WALTA) చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
- ప్రతిఒక్కరూ వాననీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
Also read: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
వివిధ శాఖలకు బాధ్యతలు
- భూగర్భజల శాఖ: నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలి.
- మున్సిపల్ కార్పొరేషన్లు: భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను తప్పనిసరిగా అమలు చేయించాలి.
- హైడ్రా : చెరువులు, కుంటలు, నీటి రీఛార్జ్ ప్రాంతాలను ఆక్రమణలు, వ్యర్థాల డంపింగ్, కాలుష్యం నుంచి కాపాడాలి.
మంచి నీటి సరఫరా పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో లీకేజీలు, వృథాను అరికట్టడంతో పాటు కంటింజెన్సీ మానిటరింగ్ కమిటీకి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక అందించాలి.
Also read: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Frequently Asked Questions
తెలంగాణ ప్రభుత్వం కొత్త బోరుబావుల నిబంధనలను ఎందుకు జారీ చేసింది?
కొత్త బోరుబావులు తవ్వడానికి ఎవరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందాలి?
అపార్ట్‌మెంట్‌లు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు, వాణిజ్య-పారిశ్రామిక ప్రాజెక్టులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లు, బల్క్ వాటర్ సప్లైయిర్లు NOC పొందాలి.
ఏ అవసరాలకు భూగర్భ జలాలను ఉపయోగించకూడదు?
నిర్మాణ ప్రాజెక్టులు, తోటల పెంపకం, ల్యాండ్‌స్కేపింగ్, రోడ్ల శుభ్రత వంటి పనులకు భూగర్భ జలాలను వాడకూడదు. జలమండలి అందించే శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వినియోగించాలి.
భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీసినా లేదా దుర్వినియోగం చేసినా 'వాల్టా' (WALTA) చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
ట్రెండింగ్ వార్తలు





















