Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Diwali Special Ladoo : దీపావళి సమయంలో ఇంట్లో తినేందుకు, బంధు మిత్రులకు పంచేందుకు స్వీట్స్ తయారు చేయాలనుకుంటే బేసిన్ లడ్డూలు బేస్ట్ ఆప్షన్. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

- శనగపిండిని నెయ్యితో కలిపి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- మిశ్రమం చల్లారాక, పంచదార, యాలకులు, డ్రైఫ్రూట్స్ కలపాలి.
- ఆ మిశ్రమాన్ని చిన్న, గుండ్రని లడ్డూలుగా గట్టిగా చుట్టాలి.
- పూర్తిగా చల్లారిన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.
Besan Ladoo Recipe : దీపావళి పండుగ వచ్చిందంటే ఇంట్లో స్వీట్లు కచ్చితంగా తయారు చేసుకుంటారు. కంపెనీలు కూడా ఉద్యోగుల కోసం పలు రకాల స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ దివాళి గిఫ్ట్‌గా ఇస్తారు. ఈ సమయంలో శనగపిండి లడ్డూలకు ప్రత్యేక స్థానం ఉంది. నెయ్యి సువాసనతో, వేయించిన శనగపిండి రుచితో, యాలకుల పరిమళంతో నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఈ లడ్డూలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో.. వాటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
శనగపిండి లడ్డూలకు కావాల్సిన పదార్థాలు
శనగపిండి - 2 కప్పులు
పొడి పంచదార - 1 కప్పు
నెయ్యి - అర కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
బాదం - 2 టేబుల్ స్పూన్లు
పిస్తా - 2 టేబుల్ స్పూన్లు
బొంబాయి రవ్వ - 1 టేబుల్ స్పూన్
Also Read : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
శనగపిండి లడ్డూల తయారీ విధానం
ముందుగా శనగపిండిని సిద్ధం చేసుకోవాలి. దీనికోసం శనగపిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. లడ్డూలకు కొద్దిగా గరుకైన ఆకృతి కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కూడా కలుపుకోవచ్చు. మందపాటి బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో శనగపిండిని వేసి తక్కువ మంటపై ఉంచి నిరంతరం కలుపుతూ వేయించాలి. పిండి ముద్దలు కట్టకుండా జాగ్రత్త పడాలి. శనగపిండి రంగు క్రమంగా మారి లేత బంగారు రంగులోకి వచ్చి, మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఈ ప్రక్రియకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. మంట ఎక్కువగా పెడితే పిండి బయట మాడిపోయి లోపల సరిగ్గా వేగకపోవచ్చు.
Also Read : టేస్టీ స్వీట్ హల్వా రెసిపీ.. పాలతో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
పిండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని మరో వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. శనగపిండి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు పొడి పంచదార, యాలకుల పొడి, సన్నగా తరిగిన బాదం, పిస్తా వేసి బాగా కలపాలి. మిశ్రమం మరీ వేడిగా ఉన్నప్పుడు పంచదార కలపకూడదు. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని గట్టిగా ఒత్తుతూ గుండ్రంగా లడ్డూలుగా తయారు చేసుకోవాలి. మిశ్రమం పొడిగా ఉండి లడ్డూలు చుట్టుకోవడం కష్టంగా అనిపిస్తే కొద్దిగా కరిగించిన నెయ్యి కలుపుకోవాలి.
ఇలా తయారుచేసిన లడ్డూలను ఒక ప్లేట్‌లో పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన శనగపిండి లడ్డూలు రెడీ. లడ్డూలు మరింత రుచిగా రావాలంటే.. శనగపిండిని ఎప్పుడూ తక్కువ మంట మీదే వేయించాలి. అప్పుడే పచ్చి వాసన పోయి మంచి రుచి వస్తుంది. పంచదారను మెత్తని పొడిలా చేసుకోవాలి. నెయ్యిని ఒకేసారి వేయకుండా అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా కలపాలి. లడ్డూలు చుట్టిన వెంటనే డబ్బాలో పెట్టకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాతే నిల్వ చేయాలి.
Also Read : దసరా, దీపావళి ఫెస్టివల్ స్పెషల్ రెసిపీ ఖర్జూర హల్వా.. సింపుల్‌గా చేసుకోగలిగే స్వీట్ ఇది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























