అన్వేషించండి

KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం

KTR Helps Kodangal Woman: మస్కట్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళకు KTR సాయం చేశారు. తల్లిని నెలరోజుల్లోనే  ఇంటికి తెప్పిస్తానని ఆమె కొడుకుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 

KTR Helps a Woman: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన ఓ మహిళకు కేటీఆర్ అండగా నిలిచారు. ఉపాధి పేరుతో మోసపోయి మస్కట్‌లో చిక్కుకున్న ఆమె తన సొంత ఇంటికి చేరుకోవడానికి పూర్తి సాయం అందించారు.  ఇంటికి తిరిగొచ్చిన ఆమె.. BRS భవన్‌లో కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. 

ఉపాధి కల్పిస్తామని ఓ ఏజెంట్ నమ్మించి మోసం చేయడంతో మస్కట్‌లో చిక్కుకుపోయిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మాట నిలబెట్టుకున్నారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రాజుకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఆ కుటుంబంలో ఆనందం నింపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫసల్వాడ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి, భర్త వెంకటప్ప ఉపాధి కోసం ఫిబ్రవరి 27న మస్కట్‌కు వెళ్లారు. కానీ తీరా అక్కడకు వెళ్లిన తర్వాతే ఆమెకు తాను మోసపోయానని అర్థం అయింది. ఆమెకు చెప్పిన పనికి.. అక్కడ జరుగుతున్నదానికి సంబంధమే లేదు. అంతేకాకుండా అక్కడి యజమాని ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని  లక్ష్మీ స్వదేశానికి తిరిగిరాకుండా అడ్డుకున్నాడు. 

తనను అక్కడక పంపించిన ఏజెంట్ సాయం చేయాల్సింది పోయి.. తనను తిరిగి రప్పించడానికి 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని లక్ష్మీ ఇంటికి చేరవేసిన తర్వాత ఆమె సిమ్ కార్డులు, వైఫై కూడా యజమానులు నిలిపేశారు.  చివరకు పక్కింటి వారి ఇంటర్నెట్ సహాయంతో తన కుమారుడు రాజును సంప్రదించి అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. తల్లి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన కుమారుడు రాజు సెప్టెంబర్ 29న కేటీఆర్‌ను కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్ నెల రోజుల్లోనే పాస్‌పోర్టు సమస్యను పరిష్కరించి, తల్లిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తానని రాజుకు భరోసా ఇచ్చారు.


KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం

మాట నిలబెట్టుకున్న కేటీఆర్

ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో లక్ష్మి సురక్షితంగా భారత్‌కు తిరిగి చేరుకున్నారు. స్వదేశానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్న అనంతరం లక్ష్మి  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. “నా కొడుకుకు కేటీఆర్ గారు నెల రోజుల్లోనే నిన్ను ఇంటికి తీసుకొస్తానని మాట ఇచ్చారు. అన్న ఇచ్చిన మాట ప్రకారం నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. నేను, నా కుటుంబం ఎదుర్కొంటున్న కష్టకాలంలో కేటీఆర్ అన్న మాకు అండగా నిలిచారు. ఆయన చేసిన సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. కేటీఆర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని లక్ష్మి తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
‌Fake Currency Racket: హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
Congress Dissidence: కాంగ్రెస్‌లో నిధుల మంటలు, పదవుల రగడ - సీఎం రేవంత్‌కు సొంత పార్టీ అసంతృప్తుల సవాల్.. నిర్లక్ష్యం చేస్తే ముప్పేనా?
కాంగ్రెస్‌లో నిధుల మంటలు, పదవుల రగడ - సీఎం రేవంత్‌కు సొంత పార్టీ అసంతృప్తుల సవాల్.. నిర్లక్ష్యం చేస్తే ముప్పేనా?
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Embed widget