US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ వ్యతిరేక పవనాలు వీస్తు్న్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల్లో రిపబ్లికన్లు వెనుకబడ్డారు.

US Midterm Elections: అమెరికాలో జరుగుతున్న మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు కొన్ని స్థానాల్లో వెనుకబడిపోగా, డెమోక్రాట్లు అత్యధిక స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ బ్యాలెట్ పేపర్‌పై తన పేరు కూడా ఉండివుంటే రిపబ్లికన్లు ఈ విధంగా ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
ఫలితాలు ఇలా!
సౌత్ కరోలినాలో రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత సెనెట్ సీటును రిపబ్లికన్లు కోల్పోయారు. తాజా ఫలితాల్లో ఈ స్థానంలో రిపబ్లికన్ అభ్యర్థి, దివంగత నేత లిండ్సే గ్రాహం సోదరి డార్లిన్ గ్రాహం ఓడిపోయారు. ఆమెపై డెమోక్రటిక్ అభ్యర్థి ఆండ్రూస్ విజయం సాధించారు. సౌత్ కరోలినాలో చివరిగా 1998లో డెమోక్రటిక్ నేత సెనెటర్‌గా గెలిచారు. ఇక, టెక్సాస్‌లో గత 30 ఏళ్లకు పైగా రిపబ్లికన్ల ఆధిపత్యానికి డెమోక్రాట్లు అడ్డుకట్ట వేశారు. తాజా ఫలితాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో గెలుపొందారు. ఒహాయోలోనూ రిపబ్లికన్లకు ఓటమి పాలయ్యారు. ఈ పార్టీ సెనెటర్ అభ్యర్థి జాన్ హ్యూస్టెడ్‌ను డెమోక్రటిక్ నేత షెరాడ్ బ్రౌన్ ఓటమి చెందారు. అయోవాలోనూ రిపబ్లికన్ అభ్యర్థిపై డెమోక్రటిక్ నేత జోష్ టురెక్ విజయా సాధించారు. గత మధ్యంతర ఎన్నికల్లో ఈ స్థానం రిపబ్లికన్లు గెలుచుకున్నారు.
యూఎస్ ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఎగువసభలో మొత్తం 100 స్థానాలుండగా.. ఇందులో 34 మంది డెమోక్రాట్లు, 31 మంది రిపబ్లికన్లు ఉన్నారు. మిగతా 35 స్థానాలకు మిడ్ టర్మ్‌లో ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో డెమోక్రాట్లు విజయం సాధించడంతో సెనెట్‌లో విపక్షాల ఆధిపత్యం పెరిగింది.
Also Read: నెతన్యాహు కోట కూలుతుందా? జ్యోతిష్య సూచనలు!
నేను శపిస్తే ఎవరూ తప్పించుకోలేరు- కేఏ పాల్
ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారులు లేదా రిపబ్లికన్ల ఓటమితో ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని, యుద్ధాలకు కారణమైన నేతలకు ఓటమి తప్పదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే మాజీ స్పీకర్‌గా మారుతావంటూ యూఎస్ స్పీకర్ మైక్ జాన్సన్‌ను తాను హెచ్చరించినట్లు కేఏ పాల్ తెలిపారు. కళ్లు నెత్తికెక్కిన రాజకీయ నేతలకు ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఆయన స్పష్టం చేశారు. తాను త్వరలో భారత్‌కు తిరిగి వస్తానని, మతం పేరుతో గొడవలు పెట్టే వాళ్లను, బైబిల్ పంచిన మహిళలపై దాడి చేసి అరెస్టైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తాను శపిస్తే ఎవరూ తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.
Also Read: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు






















