Brahmamudi Serial Today December 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్ డిజైన్స్ కొట్టేయాలనుకున్న రాహుల్ - రాహుల్‌ను నమ్మొద్దన్న సుభాష్
Brahmamudi serial today episode December 1st: రాజ్, కావ్య కొత్త డిజైన్స్ వేస్తుంటే వాటిని ఎలాగైనా కాపీ కొట్టాలని రాహుల్ ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్‌కు అనుమానం రాకుండా మేనేజర్ సతీష్ రిజైన్, జాయినింగ్ విషయం రాహుల్ ముందే చెప్తాడు. సతీస్ స్వరాజ్ కంపెనీలో జాబ్ మానేసిన విషయం తనకు తెలియదు అంటాడు రాహుల్. దీంతో సుభాష్ కోప్పడతాడు.
సుభాష్: రాజ్‌కు చెప్పకుండా రిజైన్ చేశాడని నీకు తెలిసినప్పుడు రాజ్‌ను అడిగి రాజ్‌కు విషయం చెప్పి కదా వాణ్ని అపాయింట్ చేసుకోవాలి
ప్రకాష్: అవును అలా ఎలా పెట్టుకుంటావురా నువ్వు
రాహుల్: మామయ్య నేను..
సుభాష్: నీకు అలా చేయడం తప్పు అనిపించలేదా..?
రాజ్: ఇట్స్ ఓకే డాడ్ ఇప్పుడు ఏమైంది..?
సుభాష్: ఏమైంది అంటావేంటిరా..?
రాజ్: డాడ్ రాహుల్ ది న్యూ కంపెనీ జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశాడు. రాహుల్‌కు ఎక్స్‌ఫీరియన్స్ తక్కువ. కంపెనీలో ఎక్స్‌ఫీరియన్స్ మేనేజర్ ఉండటం కలిసి వస్తుంది. వదిలేయండి.. నేను వేరే మేనేజర్‌ను అపాయింట్ చేసుకుంటాను
సుభాష్: రాజ్ నీకు అర్థం అవుతుందా..? ఇలా ప్రతి దాన్ని అలా ఈజీగా తీసుకుంటే ఎలా..?
రుద్రాణి: అన్నయ్య.. ఇప్పుడు ఏమైందని రాహుల్ ఏదో తప్పు చేసినట్టు పదే పదే పాయింట్ అవుట్ చేస్తున్నారు వాడెవడో అక్కడ రిజైన్ చేశాక రాహుల్ దగ్గరకు వచ్చాక పెట్టుకున్నాడు కదా..? దీనికి ఎందుకు అంత రాదాంతం చేస్తున్నారు.
సుభాష్: నీకు ఏం అర్థం అయిందో నాకు తెలియదు రుద్రాని.. కానీ నీ కొడుకు తప్పు చేశాడు. ఇలాంటి పద్దతి మంచిది కాదు.. ఇలాంటివి అన్ని నువ్వు ఈజీగా తీసుకోవడం వల్లనే.. ఈ మధ్య కాలంలో మన అపోనెంట్స్ అందరూ బిజినెస్‌లో ఎంతో వెనకాల ఉన్నవాళ్లు ఇప్పుడు మనకు చేరువలో ఉన్నారు..
ప్రకాష్: నెంబర్‌వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ మనమే అలాంటిది మన సేల్స్ వీక్ అయిపోతూ మిగతా వాళ్లందరూ మన దగ్గరకు వచ్చేస్తున్నారు తెలుసా..? నీకు
సుభాష్: లాస్ట్ ఇయర్ కాస్తైతే నెంబర్ వన్ ప్లేస్‌ను కోల్పోయేవాళ్లం
రాజ్: ఈ సారి అలా జరగదు డాడీ నేను కళావతి దాని గురించే ఆలోచిస్తున్నాము
కావ్య: అందుకే మామయ్య చాలా కొత్త డిజైన్స్ వేస్తున్నాము ఓల్డ్ స్టాక్ అంతా ఇక ఏమీ ఉండదు.. అంతా రీప్లేస్ చేస్తున్నాము..
రాజ్: ఈ న్యూఇయర్‌కు ఒకేసారి వంద న్యూ డిజైన్స్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలనేది మా టార్గెట్ డాడీ
రాహుల్: ఇంత తక్కువ టైంలో అన్ని న్యూ డిజైన్స్ ఎలా రాజ్.. సాధ్యం అవుతుందా..? అసలు టైం సరిపోతుందా..?
రాజ్: కష్టపడాలి.. గోల్ రీచ్ కావాలి
రాహుల్: గ్రేట్ నేను కూడా నిన్ను ఫాలో అవుతాను.. అసలు రెస్ట్ అనేది తీసుకోను
అపర్ణ: ఓరేయ్ భోజనం చేయండి. తిండి దగ్గర కూడా బిజినెస్ ఏంట్రా
అనగానే అందరూ భోజనం చేస్తారు. తర్వాత రాజ్, కావ్య వేయబోయే కొత్ డిజైన్స్ కొట్టేయాలని రాహుల్ అనుకుంటాడు. అందుకోసం రూంలో డిజైన్స్ వేస్తున్న రాజ్, కావ్యల దగ్గరకు వెళ్తాడు. రాజ్, రాహుల్‌ను రూంలోంచి వెళ్లపోమ్మని పేకాట పేకాటే.. బామ్మర్ది బామ్మర్దే అంటాడు. రాహుల్ వెళ్లిపోతాడు. అప్పుకు స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేసి స్టేషన్‌కు రమ్మని చెప్తాడు. ఇంట్లో వాళ్లకు గుడికి వెళ్తున్నామని చెప్పి కళ్యాణ్, అప్పు స్టేషన్‌కు వెళ్లిపోతారు. రాజ్, కావ్య తాము వేసిన కొత్త డిజైన్స్ తీసుకుని గుడికి వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















