Brahmamudi Serial Today December 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: సూసైడ్ చేసుకోబోయిన రేణుక – స్వప్ను పూర్తిగా నమ్మించిన రాహుల్
Brahmamudi serial today episode December 10th: కూతురు మీద బెంగతో రేణుక సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజ్, కావ్య పెన్‌డ్రైవ్ శృతికి ఇచ్చామని మాట్లాడుకోవడం విన్న రౌడీలు శృతి ఎక్కడ ఉందో వెతకాలని వెళ్తారు. తబలా వాయించే వాళ్ల దగ్గరకు వెళ్లి శృతి ఉందా అని అడుగుతారు. ఉందని వాళ్లు తబలా వాయించి ఇదే శృతి అని చెప్పగానే.. రౌడీలు కోపంగా వాళ్లను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు అప్పు తను టేకప్ చేసిన కేసు గురించి సీఐ ఇచ్చిన వార్నింగ్ గురించి ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు.
కళ్యాణ్: పొట్టి ఏమైంది..? అసలు నువ్వు ఏం చేస్తున్నావు
అప్పు: అయిపోయింది కూచి అంతా అయిపోయింది. ఇక ఈ కేసు ముందుకు నడవదు.. ఈ కేసును వదిలేయాల్సిందే..
కళ్యాణ్: ఏమంటున్నావు పొట్టి కేసును వదిలేయడం ఏంటి..?
అప్పు: ఏం చేయను కూచి స్వయంగా సీఐ గారే వచ్చి ఈ కేసును వదిలేయమని.. మరో కేసును టేకప్ చేయమని చెబితే ఇక ఏం చేయాలి కూచి.. కేసును వదిలేయాల్సిందే..
కళ్యాణ్: ఏమైనా చేయోచ్చు పొట్టి కానీ ఈ కేసు విషయంలో నువ్వు రోజు రోజుకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నావు. ఆ సంగతి నీకు అర్థం అవుతుందా..?
అప్పు: ఇంత ప్రయత్నం చేశాను. నా హెల్త్ కూడా పక్కన పెట్టి ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనుకున్నాను.. ఆ తల్లికి ఏదోలా మనఃశాంతిని ఇవ్వాలనుకున్నాను. కానీ ఏదీ జరగడం లేదు కూచి..
కళ్యాణ్: దానికి డిప్రెష్ అవ్వాలా..? అంతా చేజారిపోయిందని బాధపడాలా..? గెలుపు అంటే అటక మీద ఉన్న గిన్నె కాదు పొట్టి స్టూలు ఎక్కి అందుకోవడానికి.. అది చెట్టు మీద ఉన్న పండు లాంటిది. ఆ పండు మనకు దక్కాలి అంటే ఆశపడే ఆలోచన ఆ ఆలోచనను సపోర్టు చేసే చేయి.. ఆ చేయికి ఆయుధమైన రాయిని పట్టుకునే మెలుకువ ఆ మెలుకువతో గురిపెట్టిన కన్ను.. ఇన్ని ఒకే సమయంలో ఫోకస్‌గా పని చేస్తేనే ఆ పండును కొట్టగలం.. అంతే కానీ అదంతా మర్చిపోయి ఇలా డీలా పడిపోతే ఎలా పొట్టి
అప్పు: అదే కూచి అదే ప్రయత్నం చేశాను.. అంతే ఎఫర్ట్ పెట్టాను. కానీ ఏ ఒక్క క్లూ దొరకలేదు.. ఏ ఒక్క క్లూ దొరకినా..? నేను ఏంటో నిరూపించుకునే దాన్ని. రేణుక గారు చెప్పిన మాటలు నమ్మడానికి ఏ ఆధారం కనిపించడం లేదు. ఒక్క ఆవిడ బాధ తప్ప.. అందుకే ఇక సీఐ గారు చెప్పినట్టు ఈ కేస్ క్లోజ్ చేయడం తప్పా ఇంక వేరే మార్గం లేదు
కళ్యాణ్: నువ్వు అలా బాధపడకు పొట్టి
అప్పుకు ఫోన్ వస్తుంది. అవతలి నుంచి మహిళ తనను తాను పరిచయం చేసుకుని రేణుక ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని చెప్తుంది. ఆ మాటలకు అప్పు మరింత భయంతో వణికిపోతుంది. తర్వాత రేణుక ఇంటికి వెళ్లి ఓదార్చి బయటకు వచ్చిన అప్పు దగ్గరకు ఒక పాప వచ్చి రేణుక కూతురు అంజలి బతికే ఉందని చెప్తుంది. ఎక్కడ ఉందని అప్పు అడగ్గానే.. మొన్న వాళ్లింటి గేటు దగ్గర అంజలిని చూశాను. నేను బయటకు వచ్చే సరికి అంజలి లేదు రేణుక ఆంటీ ఏడుస్తూ కనిపించింది అని చెప్పగానే.. అప్పు ఇక ఈ కేసును వదిలే ప్రశక్తే లేదని మనసులో అనుకుంటుంది. మరోవైపు పెన్ డ్రైవ్ కోసం రాజ్ రూంలోకి వెళ్తారు రౌడీలు. చీకట్లో వాళ్లను రాజ్ చితక్కొడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















