Brahmamudi Serial Today August 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య, రాజ్ మధ్య చిచ్చు రేపిన అప్పు వివాహం- పెళ్లి ఆపడానికి సిద్ధమైన కల్యాణ్
Brahmamudi Today Episode: కల్యాణ్‌ను ప్రేమించిన అప్పూ పెళ్లి వేరే వారితో అవుతుందా... మరి రాజ్, స్వప్న ఎందుకు సవాల్ చేసుకున్నారు. ఇవాల్టి బ్రహ్మముడి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
Brahmamudi Serial Today Episode: అప్పూ పెళ్లి రాకుండా కల్యాణ్‌ను ఆపేందుకు ధాన్యలక్ష్మి చేసిన ప్రయత్నంతో ఇవాళ్టి ఎపిసోడ్ ప్రారంభమై కల్యామ్ రియలైజేషన్, రాజ్, కావ్య సవాళ్ల వరకు చాలా ఆసక్తిగా సాగుతుంది.
ఇంద్రాణి: తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదరా... దాన్ని సరిదిద్దుకోవడానికే నా ప్రయత్నం, నా మాట వినరా.. కొన్ని రోజులు బెంగళూరు వెళ్లు.
వీళ్ల మాటలను చాటుగా రుద్రాణి చూస్తుంటుంది. .
కల్యాణ్: అమ్మ నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్లమంటున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు భయపడినట్టు ఏదీ జరగదు. వాళ్ల ఇంట్లో వాళ్లు చెప్పినట్టే అప్పూ పెళ్లి చేసుకుంటుంది నేను ఏం అడ్డుపడను. అని తల్లితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
వెనకాలే ఉంటూ అన్నీ గమనిస్తున్న రుద్రాణి... గుడ్డికన్నా మెల్లమేలు అన్నట్టు వీడు ఊరికి వెళ్లకపోయినా పెళ్లి మండపానికి రాను అన్నాడు అది చాలు అంటుంది.
మరోవైపు అప్పూ పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు కావ్య కన్నవారు .
పెళ్లి మండపానికి వచ్చిన అప్పూ తల్లి... రాత్రి మొదలు పెట్టారు ఇంకా పూర్తి కాలేదా అని డెకరేషన్ చేస్తున్న వాళ్లపై చిందులు తొక్కుతుంది. అయిపోతుందని వాళ్లు సమాధానం చెబుతారు అక్కడి పనివాళ్లు. ఇంతలో అక్కడకు వచ్చిన భర్తతో.. పంతులుగారు చెప్పినవన్నీ తెచ్చారా అని లిస్ట్ చదువుతుంటే...అన్నీ తీసుకువచ్చానని భర్త విసుక్కుంటాడు. బంగారం షాపు నుంచి మంగళసూత్రం తెచ్చారా అని ఆరా తీస్తుంది. నేను తెచ్చానని కూతురు కావ్య సమాధానం చెబుతుంది. నువ్వెందుకు వెళ్లావని కంగారుపడుతుంది. వేరే పని చెప్పాను కదా అంటుంది తల్లి.
అన్నీ తాను చూసుకున్నానని... ప్రశాంతంగా ఉండాలని సలహా ఇస్తుంది కావ్య... అప్పూను రెడీ చేస్తానని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మీ ఫ్యామిలీ వస్తుందా అని అత్తారింటి వారి గురించి కావ్య అడుగుతాడు తండ్రి. అంతా వస్తారని చెప్పి వెళ్లిపోతుంది కావ్య.
అప్పూ దగ్గరకు వచ్చి ఇంకా రెడీ చేయలేదా అని హడావిడి చేస్తుంది తల్లి. తనే రెడీ కావడం లేదని తల్లికి చెబుతుంది కూతురు స్వప్న. ఎందుకని తల్లి ప్రశ్నిస్తే.... తనకు ఇలాంటివి ఇష్టం లేదని అంటుంది. పూలు పెట్టుకోవడం నగలు ధరించుకోవడం తనకు నచ్చదని తనలానే ఉంటాని తేల్చి చెప్పేస్తుంది అప్పు. ఏదో ఒకటి చేసుకోండి అని అక్కడి నుంచి అమ్మ వెళ్లిపోతూ... మీ అత్త వస్తుందా అని అడుగుతుంది. శకుని లేని కురుక్షేత్రం ఉంటుందా అని సమాధానం చెబుతుంది.
ఇక్కడ అప్పూ పెళ్లికి అత్తారింటి వాళ్లూ రెడీ అవుతుంటారు. ధాన్యలక్ష్మీతో ఏదో ప్లాన్ చేసిన రుద్రాణీ దానిపై మాట్లాడుకుంటారు. కచ్చితంగా కోరుకుంటున్నట్టు జరుగుతుందని పెళ్లికి వెళ్తున్నాంటుంది.
రాజ్ పెళ్లిని గుర్తు చేస్తుంది రుద్రాణి మొదట అంతా స్వప్న పెళ్లికూతురు అనుకున్నారని తర్వాత ఇంటికి వచ్చింది కావ్య అని చెబుతుంది. అందుకే దగ్గరుండి ఈ పెళ్లి చూడటానికి వెళ్తున్నామని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంతలో ఇంట్లో వాళ్లూ వచ్చి అయిందా మీ ఇద్దరు గూడుపుఠాణి అంటూ సెటైర్లు వేస్తారు. కాదని బుకాయిస్తుంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నార ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసని అంటారు. దుసురు మాటలు, వెక్కిరింతలు అక్కడ వద్దని వారిస్తారు. ఉన్నంతలో పెళ్లి చేస్తున్నారని వచ్చామా వెళ్లామా అన్నట్టు ఉండాలని ఎవర్నీ బాధపెట్టొద్దని రుద్రాణి, ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తారు.
అప్పుడే రాజ్, కల్యాణ్ మెట్లు దిగుతూ వస్తుంటే ధాన్యలక్ష్మి కంగారు పడుతుంది. పెళ్లికి వస్తున్నావా అని కల్యాణ్‌ను ప్రశ్నిస్తుంది... కంగారు పడొద్దు తాను పెళ్లికి రావడం లేదని చెబుతాడు.
అందరూ వెళ్లిపోయాక.... కల్యామ్‌తో రాజ్ మాట్లాడుతూ ఈ పెళ్లి ఆగిపోవాలని కోరుకుంటున్నానని అంటారు. అప్పును ప్రేమను బయటకు రప్పించాను కానీ కల్యాణ్ కావాలనే చెప్పేలా చేయలేకపోయానని రాజ్ అంటాడు. మీ ఇద్దరు అంగీకారం లేనిదే పెళ్లి జరగదని అంటారు... దాని కోసమే వెయిట్ చేస్తన్నట్టు చెబుతారు.
ఆ సీన్ తర్వాత దుగ్గిరాల ప్యామిలీ మొత్తం పెళ్లిమండపానికి వస్తారు. వచ్చీరాగానే రుద్రాణి తన వెటకారంతో అప్పూ ఫ్యామిలీని కించపరుస్తుంది. ఆమెను మొదట స్వప్న గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అత్త కూడా నీకు ఆమె కరెక్ట్ మొగుడని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇంతలో తండ్రి మాత్రం పెళ్లికి వచ్చిన అతిథులను అలా అనొద్దని వారిస్తాడు.
రూమ్‌లో ఒంటరిగా కూర్చున్న అప్పు మొబైల్‌లో కల్యాణ్ ఫొటోలు డిలీట్ చేస్తుంది. అది చూసిన స్వప్న క్లాస్ పీకుకుంది. నీ మనసులో ఉన్న మాట చెప్పాలని రిక్వస్ట్ చేస్తుంది. ఒకసారి పెళ్లి చేసుకుంటే మళ్లీ సరిదిద్దుకోలేవని ఇష్టం లేని కాపురం చేయాల్సి ఉంటుందని హితబోధ చేస్తుంది. ఇంటి పరువు గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దని... కల్యాణ్‌ను పెళ్లి చేసుకునే ధైర్యం లేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోమ్మని సలహా ఇస్తుంది.
అక్కడ కల్యాణ్ కూడా రిలైజ్ అవుతాడు. అప్పూను బాధపెట్టడం దేనికని తన మనసులో మాట చెప్పి పెళ్లి ఆపాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో రాజ్ పెళ్లి కచ్చితంగా ఆపుతానంటూ భార్యతో సవాల్ చేస్తారు. మీమ్మల్ని నేను ఆపుతానంటూ కావ్య ప్రతి సవాల్ చేస్తుంది.