Brahmamudi Serial Today August 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: గతం గుర్తు చేసుకున్న రాజ్ - పిచ్చిపట్టిన యామిని
Brahmamudi serial today episode August 29th: రాజ్‌కు గతం గుర్తుకు రావడంతో యామినికి పిచ్చి పడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: హాస్పిటల్ లో ఉన్న అపర్ణ బాధపడుతుంది. రాజ్‌కు ఈ పరిస్థితి తన వల్లే వచ్చిందని ఎమోషనల్ అవుతుంది. కావ్యకు సారీ చెప్తుంది.
అపర్ణ: అమ్మా కావ్య నన్ను క్షమించవే నువ్వు ఇలాంటివి జరగకూడదని మా అందరికీ ఎంత నచ్చజెప్తున్నా నేను వినకుండా క్షణికావేశంలో నేను చేసిన తప్పు ఈరోజు వాడిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది కావ్య
కావ్య: అత్తయ్యా మీరు నన్ను క్షమాపణలు కోరడం ఏంటి..? నేను ఆయనకు భార్య అవ్వక ముందే మీరు ఆయనకు తల్లి అయ్యారు అత్తయ్యా నవమాసాలు మోసి ఆయనకు జన్మనిచ్చారు అలాంటిది మీరు ఆయన విషయంలో తప్పు చేయాలని ఎందుకు అనుకుంటారు
అపర్ణ: నా బాధ కూడా అదే కావ్య. ప్రాణం పోసిన నేనే ఈరోజు వాడి ప్రాణం మీదకు తీసుకొచ్చాను. వాడి తల్లిని అని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు కావ్య
యామిని: వావ్ చాలా బాగుంది. మీ అందరి నటన అద్బుతంగా ఉంది. నీది తప్పు లేదు అంటే నీది తప్పు లేదు అనుకుంటూ చేతులు దులిపేసుకుంటున్నారా..? ఏంటి అందరూ అలా చూస్తున్నారు. నేను చేసిన సహాయానికి మీరందరూ నా కాళ్లు కడిగి ఆ నీళ్లు మీ నెత్తి మీద చల్లుకోవాలి. రాజ్ గతం మర్చిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే నేను తోడుగా నిలబడ్డాను. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకొక కొత్త జీవితాన్ని ఇచ్చాను. గతం తెలిస్తే తనకు ప్రమాదం అని డాక్టర్లు చెబితే తనకు ఒక రక్షణ కవచంలా మారి తనను రక్షించుకుంటూ వచ్చాను. కానీ మీరేం చేశారు. పదే పదే గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించారు. తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారు. మీరు ఆ పెద్దావిడ ప్లాన్స్ వేసుకుని మరీ ఇంటికి పిలిపించుకుంటారు. ఇక ఈ కావ్య సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. తోక లాగా ఎప్పుడు వెనకే తిరుగుతుంది. గతాన్ని గుర్తు చేయాలని ట్రై చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా జరగకపోతే ఎలా జరుగుతుంది. అసలు మీ అందరికీ రాజ్ మీద బాధ్యతే లేదు.. నాకు తప్ప.. మీ అందరికీ చెప్తున్నాను. రాజ్‌కు ఏమైనా జరగాలి మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను.
అనగానే కావ్య, యామిని చెంప పగులగొడుతుంది.
యామిని: తప్పు చేసిందే కాక నన్నే కొడతావా..?
కావ్య: ఏయ్ నువ్వేంటో నీ బతుకేంటో ఇక్కడున్న అందరికీ తెలుసు. అలాంటి నువ్వు నా కుటుంబం మీద వేలెత్తి చూపించడానికి వచ్చావా..? సిగ్గు లేకుండా నా మొగుడిని నీ మొగుణ్ని చేసుకోవడానికి పెళ్లికి రెడీ అయిపోయిన నువ్వు నాకు నీతులు చెప్తున్నావా..? అసలు దీనంతటికి కారణం ఎవరు నువ్వే కదా..?
యామిని: అది..
కావ్య: ఏయ్ ఇంక ఆపు ఇంత జరిగినా కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నావా..? ఇంకోక్క క్షణం నా ముందు ఉన్నావంటే చంపేస్తాను.. వెళ్లు ..
రుద్రాణి: కావ్య ఆగు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అయింది. కానీ ఆ విషయం దీనికే అర్థం కావడం లేదు కావ్య.. అది అర్థం అయ్యేలా నేను చెప్తాను కదా.. నువ్వు రాజ్ సంగతి చూడు
అని యామినిని బయటకు తీసుకెళ్తుంది రుద్రాణి. కావ్య పక్కకు వెళ్లి ఏడుస్తుంటే.. ఇందిరాదేవి వచ్చి ఓదారుస్తుంది. కావ్య దేవుడి దగ్గరకు వెళ్లి మొక్కుతుంది. ఇంతలో ఐసీయూలోంచి బయటకు వచ్చిన డాక్టర్ రాజ్ అవుటాప్ డేంజర్ అని చెప్తాడు. మీరు వెళ్లి చూడండి అని చెప్తాడు. అందరూ లోపలికి వెళ్లగానే రాజ్, కావ్యను అడుగుతాడు. గతం గుర్తుకు వచ్చి యాక్సిడెంట్ విషయం చెప్తాడు. డోర్‌లోంచి అంతా చూస్తున్న యామిని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో కావ్య వచ్చి రాజ్‌ను చూస్తుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన యామిని ఇంట్లో పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ వస్తువులన్నీ పగులగొడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















