Brahmamudi Serial Today August 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన అప్పు, కళ్యాణ్ – రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన స్వప్న
Brahmamudi Today Episode: వ్రతం జరుగుతున్నంత సేపు ముత్తైదువులతో కలిసి రుద్రాణి, ధాన్యలక్మీ, అప్పును అవమానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: వ్రతం పూర్తి అయిన తర్వాత అతిథులందరికీ అప్పు భోజనం వడ్డిస్తుంటే ధాన్యలక్ష్మీ అక్కడ కూడా అప్పును తిడుతుంది. అతిథులకు భోజనం పెడుతున్నావా? పిండం పెడుతున్నావా? ఇంత చిన్న విషయం కూడా తెలియదా అంటూ మీ అమ్మా నిన్ను ఇలాగే పెంచిందా? అంటూ నానా మాటలు అంటుంది. దీంతో అపర్ణ, ధాన్యలక్ష్మీని తిడుతుంది. ఎందుకు అంతలా తిడుతున్నావని కోప్పడుతుంది. ఇంతలో అతిథులను అవమానించడం తప్పు కాదా? వదిన అంటూ రుద్రాణి మధ్యలో దూరుతుంది. ఇందిరాదేవి.. రుద్రాణి, ధాన్యలక్ష్మిలను తిడుతుంది. ఇంతలో ఒక ముత్తైదువ ఇలా వడ్డిస్తే లేచి వెళ్లిపోతామని అంటుంది.
స్వప్న: మీరు ముత్తైదువులా.. లేక మా అత్త రిక్రూట్ చేసినవాళ్లా..?
కావ్య: అప్పు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చేసింది లేదు. అందరికి ఆకలి వేస్తుంది కదా. హడావిడిగా వడ్డించింది. అంతేకానీ కావాలని చేయలేదు. మీరే పెద్దమనసు చేసుకుని అర్థం చేసుకోండి
అని చెప్తుంది కావ్య. తర్వాత భోజనాలు అయిపోయాక వాయనాలు ఇచ్చే దగ్గర కూడా ధాన్యలక్ష్మీ అప్పును అవమానిస్తుంది. అయినా అప్పు ఏమీ అనదు. ఇక మైత్తైదువలు వెళ్తూ ఒకామె ధాన్యలక్ష్మికి అప్పు మీ ఇంటి కోడలుగా పనికిరాదని చెప్పి వెళ్తుంది. తర్వాత కళ్యాణ్ కూడా మేము వెళ్లిపోతాం అంటాడు.
రాజ్: ఎక్కడికి వెళ్తారు.. ఎందుకు వెళ్తారు..?
కళ్యాణ్: మా ప్రపంచంలోకి మేము వెళ్లిపోతున్నాం. తాతయ్య వాళ్ల గౌరవాన్ని కాపాడేందుకు వచ్చాం. ఇక్కడే ఉండిపోదామని కాదు.
రాజ్: ఎక్కడో ఉండి కష్టపడటం ఎందుకురా
కళ్యాణ్: కష్టమంటే ఏంటీ అన్నయ్య డబ్బు లేకపోవడమా. కాదు సంస్కారం లేని ఇంటికి రావడం, ఇష్టం లేని చోట ఉండటం. మేము ఇక్కడ అడుగడుగునా కష్టపడుతూనే ఉన్నాం అన్నయ్య.
రాజ్: పిన్ని అత్త గురించి తెలిసిందే కదరా
కళ్యాణ్: అందుకే అన్నయ్య మేము రానన్నది. ఇలా జరుగుతుందనే ఇన్నాళ్లు నువ్వు పిలిచినా రాలేదు.
ధాన్యలక్ష్మీ: నీకు ఏం తక్కువ చేశానురా.. ఇలా మాట్లాడుతున్నావు.
కళ్యాణ్: ఏం తక్కువ చేశానని నువ్వు అంటున్నావా? అమ్మా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అవమానించావు.
ఇందిరాదేవి: ధాన్యలక్ష్మీ వాళ్లు నీ ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం వచ్చారా..? నచ్చజెబితే, బతిమిలాడుకుంటే వచ్చారు..? కానీ, నువ్వు ఆ మందరతో చేరి వాళ్ల మనసు కష్టపెట్టావు.
స్వప్న: అమ్మమ్మ.. అపర్ణ అంటీ.. అసలు ఆ ముత్తైదువులను ఎవరు పిలిచారు..?
అపర్ణ: మేమేం పిలువలేదు..
స్వప్న: అంటే వాళ్లను మీరే పిలిచారు. అప్పును అవమానించడానికి ప్లాన్ ప్రకారం వాళ్లను పిలిచారన్నమాట. ఇంతకీ వాళ్లకు ఎంత ఇచ్చారు..? పూజ పేరుతో అవమానించాలని చూశారంటే మీరెంత ప్లాన్ గా ఉన్నారో అర్థమైంది.
కళ్యాణ్: నాకు ముందే అర్థమైంది స్వప్న
స్వప్న: వాళ్లు అలా అంటుంటే మొద్దులా ఉన్నావేంటే. ఎవరైనా ఏమైనా అంటే తల పగలగొట్టేదానివి కదా
కళ్యాణ్: ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నేను ముందే ఊహించాను. అందుకే ఇక్కడికి వచ్చాక ఎవరేమన్నా ఏమీ అనొద్దని నేను అప్పుతో మాట తీసుకున్నాను. అందుకే అప్పు ఇచ్చిన మాట కోసం మౌనంగా ఉండిపోయింది. ఒక్క పూటకే ఇలా ఉంటే ఇక శాశ్వతంగా ఇక్కడే ఉంటే అప్పును బతకనిస్తారా?
అని కళ్యాణ్ బాధపడుతుంటే లేకుంటే నీ భార్య తల పగులగొట్టేదా? అని రుద్రాణి అడుగుతుంది. ఎవరిది కాకున్నా నీతల మాత్రం రెండు ముక్కలయ్యేది అంటుంది స్వప్న. కడుపులో ఇంత కుళ్లు పెట్టుకుని వ్రతానికి ఒప్పుకున్నావా. వాళ్లు ఇంట్లోకి ఇంకోసారి రాకుండా ఉండేందుకే ఇంత కథ నడిపావా. నువ్ అసలు కన్నతల్లివేనా అని అపర్ణ, ధాన్యలక్ష్మీని తిడుతుంది. తర్వాత ఎవరెన్ని చెప్పినా కళ్యాణ్ వినడు. అప్పును తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.