Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: బంటి రూంలో కళ్యాణ్ కాపురం – పిజ్జా డెలివరీ జాబ్ కు అప్పు
Brahmamudi Today Episode: కళ్యాణ్ దగ్గరకు వచ్చిన రాజ్ తిరిగి ఒక్కడే ఇంటికి రావడం చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: అప్పు కళ్యాన్ తమ కాపురాన్ని బంటి రూమ్‌కు షిప్ట్ చేస్తారు. రుద్రాణి సలహాతో ధాన్యలక్ష్మీ కళ్యాణ్ ఇంటికి రావడం కోసం అప్పును కోడలుగా అంగీకరిస్తున్నట్లు నటిస్తుంది. దీంతో రాజ్ సంతోషంగా కళ్యాణ్‌ను నేను ఇంటికి తీసుకొస్తానని చెప్తాడు. అయితే ధాన్యలక్ష్మీ సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకోవడంలో ఏదో అంతర్యం ఉందని కావ్య అనుమానిస్తుంది. అయితే రాజ్ తనతో పాటు కళ్యాణ్, అప్పులను తీసుకురావడానికి కావ్యను రావాలని కోరడంతో కావ్య తాను రానంటుంది.
కావ్య: అప్పు తిరిగి ఇంట్లో అడుగుపెడితే తర్వాత ఏ సమస్య వచ్చినా నేనే ఇంట్లోకి తీసుకొచ్చానని అందరూ నన్నే తప్పుబడతారు.
స్వప్న: రాజ్ నీవెంట రావడానికి కావ్య ఇష్టం లేదంటుంది కదా ఎందుకు బలవంతం చేస్తావు.
రాజ్: కళ్యాణ్‌తో పాటు అప్పు కష్టాలు పడుతోంది. వాళ్లు ఇంటికి వస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు.
ధాన్యలక్ష్మీ: తాళి చేతికి ఇచ్చి కళ్యాణ్‌ను ఏ ధైర్యంతో కట్టమన్నావో అదే ధైర్యంతో అతడిని ఇంటికి తీసుకురా.. అంతేకానీ రానన్న వాళ్లను ఎందుకు బతిమిలాడుతావు.
అయితే కావ్య తన వెంట రావాల్సిందేనని రాజ్ పట్టుబట్టడంతో అపర్ణ, రాజ్ ను తిడుతుంది. నువ్వు ఒక్కడివే వెళ్లాలని మీ పిన్ని నీకు చెప్పిందని క్లాస్ ఇస్తుంది అపర్ణ. మరోవైపు బంటి రూమ్ ఏ మాత్రం క్లీన్ గా లేకపోవడంతో బంటిని ఏడిపిస్తుంది అప్పు. తర్వాత అప్పు, కళ్యాణ్ ఇద్దరూ కలిసి రూం క్లీన్ చేసుకుంటారు. మరోవైపు కిచెన్‌లో పాలు పొంగిపోతున్న పట్టించుకోకుండా దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోతుంది అపర్ణ. ఇందిరాదేవి పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకుంటుంది.
అపర్ణ: కళ్యాణ్ విషయంలో కావ్య ప్రవర్తన అంతుపట్టడం లేదు అత్తయ్య. అప్పును పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్‌ను ఎందుకు దూరం పెడుతుందో అర్థం కావడం లేదు.
ఇందిరాదేవి: కావ్య ఏం చేస్తుందో అర్థం కానప్పుడు ఆమెకు ఎలా సపోర్టు చేశావు. నీ కొడుకును ఎందుకు ఎదురించావు.
అపర్ణ: కావ్య ఏం చేసిన ఇంటి మంచి కోసమే చేస్తుందని సమర్థించాను. కావ్య అకారణంగా ఎవరిని ద్వేషించదు. కావ్య ప్రవర్తన వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అత్తయ్య.
ఇందిరాదేవి: కోడలికి నువ్వు అండగా నిలవడం బాగుంది.
అంటూ ఇందిరాదేవి అపర్ణను మెచ్చుకుంటుంది. మరోవైపు అప్పు తాను మళ్లీ పిజ్జా డెలివరీ ఉద్యోగానికి వెళతానని కళ్యాణ్ తో చెప్తుంది. కానీ కళ్యాణ్ వద్దని.. తానే జాబ్ చేసి అప్పును పోషిస్తానని అంటాడు. అప్పుడే అప్పు ఫ్రెండ్స్ ఇంటికి కావాల్సిన సరుకులను తీసుకొని వస్తారు. ఫ్రెండ్స్ చేసిన సాయానికి అప్పు, కళ్యాణ్ ఎమోషనల్ గా ఫీలవుతారు. ఇంతలో రాజ్ వస్తాడు.
రాజ్: ఓరేయ్ కళ్యాణ్ మీరిక ఈ కష్టాలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి తిరిగి రావడానికి పిన్ని ఒప్పుకుంది. ఇప్పుడే వెళ్దాం పదండి.
కళ్యాణ్: నేను రాలేను అన్నయ్యా.. మా అమ్మ నా మీద ప్రేమతో నా కోసం అప్పు ఇంటికి రావడానికి ఒప్పుకొని ఉంటుంది. ముందు నన్నొక్కడినే తీసుకురమ్మని చెప్పి ఉంటుంది. మీరంతా వారించే సరికి ఇద్దరిని తీసుకురమ్మని చెప్పి ఉంటుంది. మా అమ్మ అప్పును ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోదు.
రాజ్: ఓరేయ్ కళ్యాణ్ ఇవన్నీ తాత్కాలికంరా..
కళ్యాణ్: అయినా ఇష్టం లేని కోడలు ఇంట్లో అడుగుపెడితే ఎలాంటి మర్యాదలు ఉంటాయో నేను కళ్లారా చూశాను అన్నయ్య.
అని కళ్యాణ్ కరాకండిగా చెప్పేసరికి రాజ్ ఆలోచనలో పడిపోతాడు. ఇవన్నీ నీ మాటలు కాదు...ఆ కళావతి నిన్ను ఇలా మార్చేసిందని కావ్యను తిడతాడు రాజ్. దీంతో కళ్యాణ్ వదిన తప్పేం లేదని వదిన వల్లే ప్రపంచం అంటే ఏంటో తెలిసిందని చెప్తాడు. అయితే రాజ్ అప్పు్ను కన్వీన్స్ చేద్దామని చూస్తే అప్పు కూడా వినదు. దీంతో రాజ్ తిరిగి వెళ్లిపోతాడు. అయితే రాజ్ ఒంటరిగా రావడం చూసి ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. అయితే నువ్వు కేవలం కళ్యాణ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నావని అందుకే రాలేదని రాజ్, ధాన్యలక్ష్మీకి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.