Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం తెలుసుకున్న కనకం – ఎమోషనల్ అయిన రాజ్
Brahmamudi serial today episode August 13th: కనకానికి స్వప్న కాల్ చేయడంతో నిజం తెలుసుకుని ఇంటికి వచ్చి కావ్యను నిలదీస్తుంది కనకం. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రుద్రాణితో ఓ ఆటాడుకోవడానికి అప్పు ఫిక్స్ అవుతుంది. అందుకోసం కావ్యకు సైగ చేస్తుంది. దీంతో మామిడి కాయలు తియ్యగా ఉన్నాయని చెప్తారు ఇద్దరు కలిసి. అటుగా వెళ్తున్న ఇందిరాదేవిని పిలుస్తుంది రుద్రాణి.
ఇందిరాదేవి: ఏంటి రుద్రాణి
అప్పు: మీరే చెప్పండి అమ్మమ్మ గారు నేను అక్క కోసం అని ఈ మామిడి కాయలు తీసుకొస్తే.. ఈ రుద్రాణి గారు ఇవి పుల్లగా ఉన్నాయని ఇలాంటి పుల్లటి మామిడి కాయలు కడుపుతో ఉన్న వాళ్లు మాత్రమే తింటారని ఏదేదో అంటున్నారు..
రుద్రాణి: అనడం కాదు అవి నిజంగానే పుల్లగా ఉన్నాయి. కావాలంటే ఒకసారి మా అమ్మను కూడా తిని చూడమను
ఇందిరాదేవి: ఏది ఇటివండి
రుద్రాణి: పుల్లగా ఉన్నాయి కదా అమ్మా
ఇందిరాదేవి: నీ ముఖం ఇంత తియ్యగా ఉంటే పుల్లగా ఉన్నాయంటావేంటి..?
రుద్రాణి: మరి రియాక్షన్ ఏంటి అలా పెట్టావు
ఇందిరాదేవి: నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని
కావ్య: కావాలంటే ఇంకొకటి తిని చూడండి రుద్రాణి గారు
ఇంకొకటి తీసుకుని తింటుంది
రుద్రాణి: అసలు మీ అందరికీ ఏమైంది ఇంత పుల్లగా ఉంటే తియ్యగా ఉన్నాయంటారేంటి..? మీ వల్ల నోరంతా పాడై పోయింది. అర్జెంట్‌గా మౌత్ వాష్ చేసుకోవాలి.
అని రుద్రాణి వెళ్లిపోతుంది. రుద్రాణి వెళ్లిపోయాక కావ్య, అప్పు.. ఇందిరాదేవికి థాంక్స్ చెప్తుంది. థాంక్స్ ఏమీ వద్దు కానీ రుద్రాణితో జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతుంది ఇందిరాదేవి. తర్వాత స్వప్న కనకానికి కాల్ చేసి అప్పు నెల తప్పిందని అలాగే రాజ్ ప్రపోజ్ చేస్తే కావ్య రిజెక్ట్ చేసిన విషయం చెప్తుంది. దీంతో కనకం కోపంగా రేపే వస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. మరసటి రోజు ధాన్యలక్ష్మీ, అప్పును పిలుస్తుంది.
అప్పు: ఏంటి అత్తయ్యా పిలిచారు..?
ధాన్యం: అవును అప్పు ఇలా రా ఇక్కడ కూర్చో..ఏవండి అవి తీసుకురండి..
అని చెప్పగానే ప్రకాష్ కొన్ని బాక్సులు తీసుకొచ్చి ధాన్యలక్ష్మీకి ఇస్తాడు.
ధాన్యం: ఇవన్నీ నా ఏడు వారాల నగలు ఇక నువ్వే ఉంచుకో
రుద్రాణి: ఏంటి ధాన్యలక్ష్మీ సడెన్‌గా నువ్వేంటి ఇంత చేంజ్ అయ్యావు
ఇందిరాదేవి: చేంజ్ అవ్వక అందరూ నీలా ఉంటారు అనుకుంటున్నావా..? ఏంటి రుద్రాణి.
అపర్ణ: మా ధాన్యానికి తన కోడలి మీద ప్రేమ పుట్టింది నగలు ఇస్తుంది. తప్పేం ఉంది. అప్పు నువ్వు నగలు తీసుకో..?
ప్రకాష్: వదిన అది అప్పు మీద ప్రేమతో ఇవ్వడం లేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఇస్తుంది. ఏం ధాన్యం అంతేనా..?
సుభాష్: ఎవరి మీద ప్రేమతో ఇస్తే ఏంటి ప్రకాషం. మొత్తానికి ధాన్యలక్ష్మీ అప్పును కోడలిగా యాక్సెప్ట్ చేసింది అది చాలు
కనకం: చేయకుండా ఎలా ఉంటుంది అన్నయ్యగారు.. ఇప్పుడు తన కడుపులో వారసుడు పెరుగుతున్నాడు కదా..?
అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది కనకం. కనకాన్ని చూసిన అప్పు ఎమోషనల్ అవుతుంది. కనకం మాత్రం అప్పు యోగక్షేమాలు అడిగి కావ్యను తిడుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు.
రాజ్: అదీ అలా అడగండి ఆంటీ.. చెప్పండి కళావతి గారు మీ అమ్మగారు అడుగుతున్నారు కదా చెప్పండి..? ఎందుకు నాతో పెళ్లి వద్దన్నారో దానికి కారణం చెప్పండి
కావ్య: ఏంటండి చెప్పేది మీతో పెళ్లికి ఒప్పుకోవడం.. ఒప్పుకోకపోవడం అనేది నా పర్సనల్ విషయం. మీ అందరికీ నేనెందుకు చెప్పాలి.
కనకం: అందుకే తల్లిగా నేను అడుగుతున్నాను కారణం ఏంటో నాకు చెప్పు
కావ్య: అమ్మ నువ్వు ఇప్పుడు అప్పును చూడటానికి వచ్చావా..? ఇలా అందరి ముందు తిట్టి దోషిని చేయడానికి వచ్చావా..?
కనకం: ఏం చేయాలో నాకు తెలుసు..? కానీ నువ్వు అల్లుడు గారితో పెళ్లి ఎందుకు వద్దంటున్నావో నాకు తెలియాల్సిందే..?
అపర్ణ: కనకం తర్వాత చెప్తా అంటుంది కదా..? చెప్తుందిలే..
కావ్య: అమ్మా నీకు కారణమే కావాలంటే.. ఇంకోసారి ఇక్కడకు రావొద్దు
అంటూ కావ్య వెళ్లిపోతుంది. కనకం బాధపడుతుంది. ఇందిరాదేవి, అపర్ణ, కనకానికి నిజం చెప్తారు. కనకం ఎమోషనల్ అవుతూ కావ్య దగ్గరకు వెళ్లి బాధపడతుంది. కిందకు వచ్చి రాజ్‌కు అంతా నీ చేతుల్లోనే ఉందని వెళ్లిపోతుంది కనకం. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















