Brahmamudi Serial Today April 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కంపెనీ బాధ్యతలు కావ్యకు ఇస్తానంటాడు సుభాష్ - అన్ని అర్హతలు కళ్యాణ్ కు మాత్రమే ఉన్నాయన్న కావ్య
Brahmamudi Today Episode: కంపెనీ బాధ్యతల కోసం అనామిక, స్వప్న ల మధ్య రగడ జరుగుతుంటే సుభాష్ వచ్చి కావ్యకే బాధ్యతలు అప్పజెప్తాననడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కొడుకు కొడుకే బిజినెస్ చూసుకోవాలని ఉందా? కూతురు కొడుకు చూసుకోకూడదని ఎక్కడైనా ఉందా? ఏమంటారు నాన్న అంటూ రుద్రాణి అడగడంతో ధాన్యలక్ష్మీ కోపంగా రుద్రాణి నీ కొడుక్కి అమ్మాయిలతో తిరగడం తప్పా బిజినెస్ గురించి ఏం తెలుసు అంటుంది. దీంతో నీ కొడుకేమన్నా తక్కువా పెళ్లి అయినా ఆ అప్పుతో తిరగడం లేదా? అంటుంది. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఇంతలో అనామిక నువ్వాగు రుద్రాణి అంటీ.. లీగల్‌గా కళ్యాణే వారసుడు. రాహుల్ ఎలా వారసుడు అవుతాడు. అని అడుగుతుంది. స్వప్న కూడా అడ్డుపడుతుంది. రాహుల్ ఇంతముందులా కాదు ఇప్పుడు ఎంతో మారిపోయాడు కంపెనీ బాధ్యతలు చూసుకోగలడు అంటుంది స్వప్న. ఇంతలో కళ్యాణ్ వస్తాడు.
కళ్యాణ్: నువ్వు అన్న దాంట్లో నిజం ఉంది కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు. అది ముందే చెప్పాను. ఇవాళ అన్నయ్య ఒక సమస్య తెచ్చాడని ఆ బాధ్యత నుంచి తప్పుకోమనడమే నాకు నచ్చడం లేదు. మళ్లీ నేను వెళ్లి ఆ స్థానంలో కూర్చోవడం ఎంటి?
స్వప్న: వినావా? ఎం చెప్పాను నేను అనామిక. ఇదే నేను చెప్పింది. ఇప్పుడు కళ్యాణే వద్దనుకుంటున్నాడు కాబట్టి ఇంకెవరూ లేరు కాబట్టి ఆ ప్లేస్ లో రాహులే కరెక్టు.
రుద్రాణి: ఇది వదలదు ఎవ్వరినీ గెలవనివ్వదు. ఈ పదవి నీదేరా పండగ చేసుకో..
అనామిక: కళ్యాణ్ ఇంతకుముందు పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు కాబట్టి నువ్వే బిజినెస్ పగ్గాలు పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు కాదు కూడదు అంటే నేను ఒప్పుకోను
సుభాష్: అంతా విన్నాను. మీ తరం వాదించుకోవడం ఆపితే మా తరానికి మాట్లాడే అవకాశం వస్తుంది. రాజ్ ఇంకా ఆ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోలేదు. ఇంకా ఆలోచించుకునే చాన్స్ ఇచ్చాను. దానికి హక్కు మాత్రమే కాదు అర్హతలు కూడా ఉండాలి. నాకు తెలిసి ఈ ఇంట్లో రాజ్ స్థానంలో కూర్చోవడానికి ఒక్కరికి మాత్రమే అర్హత ఉంది. ఆ ఒక్కరు ఎవరో కాదు. నా కోడలు కావ్య.
అనగానే అందరూ షాక్ అవుతారు. నీకున్న లీడర్‌షిప్ లక్షణాలు చూసే నీకు ఈ స్థానాన్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అనగానే రుద్రాణి అపోజ్ చేస్తుంది. స్వప్న, రాహుల్, ప్రకాష్ ముగ్గురూ మనఃస్పూర్తిగా సుభాష్ నిర్ణయాన్ని సమర్థిస్తారు. కానీ కావ్య ఒప్పుకోదు. దీంతో ఇందిరాదేవి కావ్యను కన్వీన్స్ చేస్తుంది. అయినా కావ్య ఒప్పుకోదు. నా భర్త స్థానంలో నన్ను కూర్చోబెడితే నేను ఎలా హ్యాపీగా ఉండగలను అంటూ మీతో కలసి నేను నా భర్తను కించపరిచినట్లే అవుతుంది. ఆయన భార్యగా నా స్థానమే ప్రశ్నార్థకంగా ఉంది అంటూ కావ్య అనడంతో..
స్వప్న: ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదానా?
కావ్య: అక్కా నీ సపోర్టు నాకుంది అది చాలు. ఎలా చూసినా కవిగారు మాత్రమే ఆ స్థానంలో ఉండటానికి అర్హత ఉన్నవారు. కాబట్టి కవిగారికే ఆ బాధ్యతలు అప్పజెప్పాలి.
కళ్యాణ్: ఇది నేను ఒప్పుకోను. భర్తను బాధ్యత నుంచి తప్పించి భార్యను ఆ స్థానంలో కూర్చోబెడతానంటే వదిన ఎలా ఒప్పుకోలేదో.. అన్నయ్యకు అది అవమానం అని ఎలా భావించిందో.. నేను అలాగే భావిస్తాను. కంపెనీ ప్రాబ్లమ్ లో ఉంది కాబట్టి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటాను.
అనడంతో అందరూ షాక్ అవుతారు. ధాన్యలక్ష్మీ, అనామిక హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత కావ్య కోపంగా రాజ్‌ను తిడుతుంది. మీ తమ్ముడు మిమ్మల్ని రాముడితో పోల్చాడు. మీరు కూడా రాముడిగా ప్రవర్తిస్తే బాగుంటుంది అంటూ ఈ బిడ్డకు తల్లి ఎవరో చెప్పండి అంటుంది. నేను చెప్పను అంటాడు రాజ్. దీంతో మీరు చెప్పకపోతే నలుగురి ముందు పెట్టి రచ్చరచ్చ చేస్తాను అంటుంది. దీంతో రాజ్ కోపంగా ఈ బిడ్డను కన్న తల్లి వెన్నెల అంటాడు. వెన్నెల ఎక్కడుంది అని కావ్య అడగ్గానే ఇక చెప్పను అంటాడు రాజ్. దీంతో కావ్య బయటకు వెళ్లిపోతుంది. తర్వాత కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కంగ్రాచ్యులేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు. అనగానే కళ్యాణ్ బాధపడతాడు. మీకు ఇష్టమైన పనిని మీకు దగ్గర చేయడానికే ఇలా చేశానని కావ్య చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'ఫ్యామిలీ స్టార్' సెన్సార్ రిపోర్ట్ - ఆ నాలుగు డైలాగులూ మ్యూట్!