Brahmamudi Serial Today April 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: కంపెనీ బాధ్యతలు వదులుకుంటానన్న రాజ్ - అతడి స్థానం కోసం స్వప్న, అనామిక మధ్య వైరం
Brahmamudi Today Episode: కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని రాజ్ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: మార్కెట్ కు వెళ్లిన కనకం, మూర్తిలకు కావ్య ఎదురవుతుంది. బాబుకు బొమ్మలు తీసుకుని వెళ్తున్న కావ్యను చూసిన మూర్తి, కనకం షాక్ అవుతారు. నువ్వేంటే ఇలా మారిపోయావు అంటూ నిలదీస్తారు. నువ్వు ఇలాగే ఉంటే నిన్ను ఇంట్లో ఆయాను చేస్తారు అని పద వెళ్దాం ముందు మీడియాకు ఈ విషయం చెప్పి దుగ్గిరాల కుటుంబాన్ని రోడ్డు మీదకు ఈడ్చుదాం.. సంఘంలో పెట్టి న్యాయం అడుగుదాం అంటూ కనకం మాట్లాడుతుండగానే..
కావ్య: ఇంకా నా భర్త మాన మర్యాదలను మంట కలపడానికి ఇవి సరిపోతాయా? ఇంకా ఏమైనా మిగిలిపోయాయా? నిజమేనమ్మా మా ఆయనకి ఇలాంటి శిక్షలు వేయాల్సిందే? ఎందుకంటే ఆయన మీకు చాలా అన్యాయం చేశారు. నువ్వు ఇంటి కాగితాలు పెట్టి అప్పు చేస్తే.. ఆ అప్పు తీర్చినందుకు ఆయన్ను క్షమించకూడదు కదా అమ్మా.. ఆయన పతనం కళ్లారా చూసేదాకా మనం నిద్రపోకూడదు. అంతా బాగున్నప్పుడు అల్లుడు దేవుడు. అటూ ఇటూ అయితే మోసగాడు.
మూర్తి: నిజమేనమ్మా అల్లుడు దేవుడే.. మనకు ఎంతో మేటు చేశాడు. కానీ చివరకు నీకు కీడు చేశాడు కదమ్మా..
కావ్య: నాన్న ఇంట్లో ఆయన ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. ఆయనకిప్పుడు కష్టమొచ్చింది. సుఖంలో తోడుగా ఉన్న నేను కష్టంలో కూడా తొడుంటాను నాన్న.
అంటూ చెప్పి కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లో అందరూ కూర్చుని ఉంటారు.
రుద్రాణి: యుద్దానికి సిద్దంగా ఉన్నారు. కోటలు బీటలు వారే టైం వచ్చింది. సింహాసనం మీద సింహం కూర్చుంటుందో.. శునకం కూర్చుంటుందో. శునకం అంటే నా కొడుకే కదా?
అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇంతలో రాజ్ బాబును తీసుకుని వస్తాడు.
అపర్ణ: నీతో మాట్లాడకూడదని ఒక శాసనం. కానీ మాట్లాడక తప్పని పరిస్థితి.
రాజ్: మాటలే కదా మమ్మీ పోయేదేముంది.
అపర్ణ: పెద్దరికం పోయింది మా మాట పోయింది. ఈ ఇంటి పరువు భుజాన వేసుకుని ఆఫీసు వరకు వెళ్లావు. ఆ బరువు మొయ్యలేనంతగా పెరిగింది.
రాజ్: నేనే కదా మోయాల్సింది.
అపర్ణ: అందుకే ఆ బరువుని దింపుకోమని చెప్పాను.
రాజ్: ఈ బిడ్డను అనాథలా వదిలేసి వెళ్లలేక వెంట తీసుకెళ్లాల్సి వచ్చింది.
అపర్ణ: ఆ అవసరం పది మంది పది రకాలుగా మాట్లాడే అవకాశం ఇస్తుంది. ఇంట్లో వాళ్లంటే నీకు లెక్కలేదా?
రుద్రాణి: నీకింకా అర్థం కాలేదా? వదిన రాజ్ స్పష్టంగా చెప్తున్నాడు. అయినా నువ్వింకా అమాయకంగా ప్రశ్నిస్తావేంటి? ఈ ఇంట్లో ఏ నిర్ణయం కొనసాగుతుంది. వారసత్వం వాకర్‌లో ఇల్లంతా తిరుగుతుంది. ఒకప్పుడు నా కొడుకు అమ్మాయిలతో తిరుగుతాడని ఆఫీసులో అడుగుపెట్టకుండా చేశారు. మరి నీ కొడుకు చేసిందేంటి వదిన. రాహుల్ కు కంపెనీ చూసుకునే అర్హత లేనప్పుడు. రాజ్ కు ఆ అర్హత ఎలా ఉంటుంది.
ప్రకాష్: తప్పొప్పుల గురించి నువ్వు చెప్తున్నావా? రుద్రాణి. పులిలా ఉన్నోడివి ఇలా ఎందుకు మారిపోయావు రాజ్?
అపర్ణ: విన్నావా? ఎవరి మాటకైనా సమాధానం చెప్పే ధైర్యం నీకుందా? రుద్రాణి ఎప్పుడు మాట్లాడినా కండించే నేను ఈరోజు ఆవిడని ఆపలేకపోతున్నాను. మీ బాబాయ్ కూడా నిన్ను సమర్థించలేకపోతున్నాడు. ఈ ఇంట్లో నిన్ను ఎవరూ వెనకేసుకురాలేకపోతున్నారు.
రాజ్: ఏం చేయమంటావో నువ్వే చెప్పు మమ్మీ..
అపర్ణ: పరిష్కారాలు రెండే ఉన్నాయి. ఒకటి పరిహారం చెల్లించక తప్పదు. ఇంకొకటి పశ్చాత్తాపం చెల్లించక తప్పదు. బిడ్డను వదిలేసి రావాలి. లేదంటే నువ్వు కంపెనీ బాధ్యతలు వదిలేసుకోక తప్పదు.
అని అపర్ణ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. సుభాష్ కోపంగా అపర్ణను తిడతాడు. అదంతా సులువు కాదు అంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ కూడా అపర్ణ మాట్లాడింది తప్పేం కాదు అంటుంది.
ధాన్యలక్ష్మీ: ఈ బిడ్డ కావ్యకే పుట్టి ఉంటే ఇంట్లో వారసత్వం ఇచ్చేవాళ్లం. కాబట్టి ఈ బిడ్డనైనా వదిలేసి రావాలి. కంపెనీ బాధ్యతల నుంచైనా తప్పుకోవాలి.
అపర్ణ: చెప్పు రాజ్ ఈ కంపెనీ కావాలా? ఆ బిడ్డే కావాలా? తేల్చుకుని చెప్పు
అనగానే రాజ్ ఇందులో తేల్చుకోవడానికి ఏం లేదు. నేను కంపెనీ చూసుకోవడం మీకు ఇష్టం లేకపోతే సంతోషంగా కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను. అంతే తప్పా ఏ పాపం తెలియని ఈ బిడ్డను మాత్రం అనాథను చేయను అనడంతో అందరూ షాక్ అవుతారు. ఉండనిస్తే ఇంట్లో ఉంటాను. వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాను.. ఆ నిర్ణయం కూడా మీకే వదిలేస్తున్నాను అంటూ బాబును తీసుకుని పైకి వెళ్లిపోతాడు రాజ్. దీంతో ఇవాళ్టీ ఎసిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘జై హనుమాన్’ అప్‌డేట్, ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!