Brahmamudi December 2nd Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్య కొంగు పట్టుకుని తిరిగిన రాజ్ - దుగ్గిరాల ఇంటికి బయలుదేరిన కనకం
Brahmamudi Serial Today Episode: కావ్య కొంగుపట్టుకుని రాజ్ ఇల్లంతా తిరగడంతో ఇంట్లో అందరూ ఆశ్యర్చపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Brahmamudi Telugu Serial Today Episode: మీ ఆఫీసులో పనిచేసే శృతికి మీకు ఏంటి సంబంధం అంటూ కావ్య అడగ్గానే రాజ్ కూల్‌గా ‘‘తను ఎంప్లాయి.. నేను బాస్‌ను’’ అనగానే.. ‘‘అంతేనా ఆ పరిచయం, అంతటితోనే ఆగిందా?’’ అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. అడిగేదేదో సూటిగా అడుగు అంటూ కోపంగా చెప్తాడు రాజ్. మీకు శృతికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో నాకు తెలసిపోయింది. అనగానే రాజ్ మరింత సీరియస్‌గా ‘‘ఏం మాట్లాడుతున్నావ్’’ అని అడుగుతాడు.
కావ్య: నిజం మాట్లాడుతున్నాను. మీకు శృతికి మధ్య గ్రంథం నడుస్తుందని నాకు పూర్తిగా అర్థం అయిపోయింది.
రాజ్: షటప్ పిచ్చెక్కిందా? నాకు తనకు మధ్య ఛీ.. మీ అక్క డ్రామాకు ఒక కామా పెడితే నువ్వో కొత్త డ్రామా మొదలుపెడతావా? పిచ్చిపిచ్చిగా ఉందా? తనతో నాకు సంబంధం ఉండటం ఏంటి?
కావ్య: ఉంది.
ఈ మాట అనగానే అయితే ‘‘నీ దగ్గర సాక్ష్యం ఉందా’’ అని రాజ్ అడుగుతాడు. ఇందుకు ఉందని సమాధానం చెబుతూ.. రాజ్, శృతి క్లోజ్‌గా ఉన్న ఫోటోను చూపిస్తుంది కావ్య. ఆ ఫోటో చూసిన రాజ్ ఆఫీసు ఎంప్లాయితో క్లోజ్‌గా ఉంటే సంబంధం ఉన్నట్లా అంటూ మళ్లీ ప్రశ్నిస్తాడు. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందనడానికి ఈ ఫోటోనే ప్రూప్ అంటుంది కావ్య. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే దానికి సాక్ష్యం చూపించమని అడుగుతుంది కావ్య. నా దగ్గర అటువంటి సాక్ష్యం లేదని నమ్మితే నమ్ము లేకపోతే లేదు అంటాడు రాజ్. మరి మా అక్క విషయంలో మాత్రం సాక్ష్యాలు ఎలా అడుగుతారు అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. రాజ్ ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు.
కిచెన్‌లో టీ పెడుతున్న కావ్య దగ్గరకు వచ్చి ధాన్యలక్ష్మీ స్వప్న విషయంలో బాధపడుతుంది. నెల రోజుల టైం ఉన్నా ఆ రుద్రాణి అప్పుడే స్వప్నను టార్చర్ పెడుతుందని ఫీలవుతుంది. ఇంతలో కావ్యకు ఫోన్ వస్తుంది. ఫోన్‌లో వ్యక్తి డాక్టర్ అరుణ్ ఇంటి అడ్రస్ పెట్టానని చెప్తాడు. కావ్య వెంటనే రూంలోకి వెళ్లి..
కావ్య: ఏవండి మనం త్వరగా బయటికి వెళ్లాలి
రాజ్: నాకు ఆఫీసులో పనుంది నేను రాను.
కావ్య: అయ్యో అది కాదండి ఇది చాలా ఇంపార్టెంట్.. ఆ అరుణ్ గాడి అడ్రస్ దొరికిందండి. ఆలస్యం చేస్తే మొన్నటిలా వాడు తప్పించుకోవచ్చు..
రాజ్: నేను రానంటే రాను నాకు ముంబై నుంచి క్లయింట్స్ వచ్చారు.
కావ్య: చూడండి నెల వరకు ఆగితే ప్రతిరోజు మీ అత్తయ్య, రాహుల్ మా అక్కను టార్చర్ పెడుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిద్దామనుకుంటే మీరేమో ఇలా ఉన్నారు. నేను చేసేదంతా మన ఫ్యామిలీ సంతోషం కోసమేగా
అంటూ బయటికి వెళ్లిపోతుంది. కావ్య వెళ్లిపోగానే నిజమే ఈ కళావతి చెప్పినట్లు నెల రోజులు ఆగడం కన్నా ఇప్పుడే వెళ్లడం బెటర్ అనుకుని కిందకు వస్తాడు రాజ్.
హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంతలో రాజ్ కిందకి వచ్చి కావ్య కోసం కిచెన్‌లోకి వెళ్లడం చూసి షాక్ అవుతారు. రాజ్‌ను చూసి చూడనట్లు ఉన్న..
కావ్య: ఏం కావాలండీ..
రాజ్: నువ్వే కావాలి
కావ్య: ఏంటి ఏమన్నారు నిజమా? ఎన్నాళ్లకీ మీలో వీణ తీగలు మీటగలిగాయండి.
అంటూ రొమాంటిక్‌గా కావ్య మాట్లాడుతుంటే రాజ్ సీరియస్‌గా నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. అనగానే కావ్య నేను విననంటే వినను.. అంటూ టీ తీసుకుని హాల్లోకి వస్తుంది. రాజ్ కూడా కావ్య వెనకాలే తిరగుతాడు. రాజ్ పరిస్థితి చూసి అందరూ నవ్వుకుంటారు. కావ్య మళ్లీ కిచెన్‌లోకి వెళ్లగానే ‘‘బయటికి వెళ్దాం అన్నావుగా పద’’ అని కావ్య చేయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు రాజ్. ఇదంతా చూస్తున్న ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోతారు. కనకం, అప్పు ఏవో సర్దుతుంటారు. ఇంతలో మూర్తి అక్కడకు వచ్చి
మూర్తి: అంటే నేను వద్దనా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నావన్నమాట.
కనకం: మీరు కోపంతో కుదరదని తప్పుకోవచ్చు కానీ తల్లిగా నేను చేయాల్సింది చేసి తీరాలి కదయ్య.
మూర్తి: కూతురు తల్లి అవుతుందని నీకు సంబరంగా ఉందేమో..కానీ స్వప్నకు అలాంటివేం ఉండవు తన జీవితమా.. చెల్లెలి జీవితమా అనే మాటొస్తే.. క్షణం కూడా ఆలోచించకుండా కావ్యను బలిపశువును చేసింది. అలాంటిది నిన్నేం చేస్తుందో ఊహించుకో..
అంటూ మూర్తి హెచ్చరించి వెళ్తాడు. కనకం ఆలోచనలో పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply