Brahmamudi December 1st Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్‌ను మోసం చేయాలనుకున్న రాహుల్ - డీఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధమైన స్వప్న, రుద్రాణి
Brahmamudi Serial Today Episode: తనపై వచ్చిన నిందలు తొలగిపోవాలంటే డీఎన్‌ఏ టెస్ట్ చేయించాల్సిందేనని స్వప్న అడుగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ జరిగింది.
Brahmamudi Telugu Serial Today Episode: స్వప్నను రుద్రాణి ఇంట్లోంచి గెంటివేయబోతుంటే స్వప్న నిజం నిరూపించి నన్ను గెంటివేయండి అంటుంది. ఇంతలో కావ్య కలుగజేసుకుని ఆడదాన్ని శీలపరీక్ష చేయడం ఈ కుటుంబ విధానమా అంటూ ప్రశ్నిస్తుంది. దుగ్గిరాల వంశ గొప్పదనం ఇదేనా అంటుంది. ఇంకా ఎన్నాళ్లు ఆడది అగ్ని పునీత అని నిరూపించుకోవాలి. ఆడదానికి వ్యక్తిత్వం ఉండదా? గౌరవం ఉండదా? ఆత్మగౌరవం ఉండదా? అంటూ నిలదీస్తుంది. స్వప్నకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించడానికి నేను ఒప్పుకోను అంటూ కావ్య కరాకండిగా చెప్పేసరికి..
రుద్రాణి: కానీ నేను ఒప్పుకుంటున్నాను. ఎస్ నీ ఉపాన్యాసాలు, నీ ఉపోద్ఘాతాలు, స్త్రీ జన ఉద్దరణ కోసం నువ్వు మొదలు పెట్టిన అభ్యుదయాలు ఈ పనికి రాని మాటలు మీ అక్క తప్పును ఒప్పుగా మార్చలేవు. ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి తప్పుడు పని చేసిన ఆడదానికి శీల పరీక్ష జరిగి తీరాల్సిందే! అది జరగాలంటే డీఎన్‌ఏ టెస్ట్ జరగాల్సిందే. నువ్వేందుకు డీఎన్‌ఏ టెస్టు వద్దంటున్నావో నాకు తెలుసు.. ఎక్కడ మీ అక్క నిజం ఒప్పుకుంటుందోనని నువ్వు ముందే టెస్ట్ వద్దంటున్నావు.
స్వప్న: అత్తయ్య గారు ఆ భయం నా చెల్లికి ఉండొచ్చేమో కానీ నాకు ఏ భయం లేదు. మీరు తెలివిగానో తెలివి తక్కువగానో నా దారిలోకే వచ్చారు. ఎస్.. డీఎన్‌ఏ పరీక్షకి నేను మొదటి నుంచి సిద్దంగానే ఉన్నాను.
అంటూ నేను తప్పు చేయలేదని రుజువైతే మీరు ఎం చేస్తారని స్వప్న ప్రశ్నిస్తుంది. నువ్వు తప్పు చేయలేదని తెలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటానని.. ఒకవేళ తప్పు చేసినట్లు రుజువైతే నువ్వేం చేస్తావు అంటూ రుద్రాణి, స్వప్నను అడుగుతుంది. అదే నిజమైతే నేనే విడాకులు తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతానంటుంది స్వప్న. కావ్య బాధగా ఈ ఇంట్లో మీరున్నా కూడా ఇలాంటివి ఎందుకని జరగనిస్తున్నారని బామ్మను అడుగుతుంది. వాళ్లకు వాళ్లు బేరసారాలు ఆడుకున్నాక మనం ప్రేక్షకపాత్ర వహించక తప్పదని కావ్యకు చెప్తుంది బామ్మ. దీంతో రుద్రాణి, రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
రాహుల్: మామ్ ఏంటి నువ్వ చేసిన పని అందరి ముందు ఎందుకలా ఒప్పుకున్నావ్
రుద్రాణి: నాకు మరోదారి కనిపించలేదు.
రాహుల్: దారి లేదని కన్నకొడుకుని అని కూడా చూడకుండా..నన్నే బలిపశువును చేస్తావా?
రుద్రాణి: ఇందులో నీకు వచ్చి ప్రాబ్లెమ్ ఏంటి?
రాహుల్: ఏంటి అని అడుగుతావు మామ్. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఆ స్వప్నను కాపాడటానికి కావ్యకి నువ్వే ఒక అవకాశం ఇచ్చావు. ఇక ఆ కావ్య నిజం బయట పెట్టి తిరిగి ఆ స్వప్నను నా నెత్తిన కూర్చోబెట్టేవరకు వదలదు.
అంటూ రాహుల్ టెన్షన్ పడుతుంటే కావ్య ఎంత ప్రయత్నించినా స్వప్నను కాపాడకుండా చేసే బాధ్యత నాది అంటూ రుద్రాణి భరోసా ఇస్తుంది రాహుల్‌కి. కనకం ఎవరి కోసమే ఎదురుచూస్తుంది. వాళ్ల అక్క లోపలి నుంచి వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావని అడుగుతుంది. స్వప్న దగ్గరకు ఎలా వెళ్లాలో ఆలోచిస్తున్నాను. వెళ్లాక ఆయన ఏమంటారోనని అంటుండగానే మూర్తి వస్తారు. కనకం మూర్తికి స్వప్న కడుపుతో ఉందని అందుకే ఆ ఇంటికి వెళ్దామనుకుంటున్నట్లు చెప్తుంది. కానీ వెళ్లొద్దని మూర్తి చెప్తాడు. దీంతో కనకం బాధపడుతుంది. స్వప్న ప్రూట్స్ తింటూ ఉంటే కావ్య వచ్చి..
కావ్య: అక్క నువ్వు చేసిన పని ఏం బాగాలేదు.
స్వప్న: అంటే నువ్వు కూడా నేను తప్పు చేశాననే అనుకుంటున్నావా?
కావ్య: కాదు ఏ తప్పు చేయలేదనే అంటున్నాను. తప్పు చేయనప్పుడు నువ్వెందుకు డీఎన్‌ఏ టెస్టుకు ఒప్పుకున్నావు అంటున్నాను.
స్వప్న: ఏం చేయాలి మరి ఇంకో దారి లేదు కదా?
అంటుండగానే దారి ఉంది. అది కనుక్కోవడానికే నేను మా ఆయన తిరుగుతున్నాం. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తుంది కావ్య. రాజ్ హాల్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే.. రాహుల్ కిందకు వస్తూ.. నేను నా పెళ్లాన్ని వదులుకుంటే నువ్వు నీ పెళ్లాన్ని వదులుకునేటట్లు చేస్తాను అని మనసులో అనుకుని వచ్చి రాజ్ పక్కన మౌనంగా కూర్చుంటాడు.
రాజ్: ఎంట్రా మౌనంగా కూర్చున్నావు..
రాహుల్: ఏం చెప్పమంటావు చచ్చిపోవాలనుందంటే నమ్ముతావా? ఏ మగవాడికి ఇలాంటి పరిస్థితి రాకూడదు రాజ్. నా భార్యకు పట్టుబోయే బిడ్డ నా బిడ్డ కాదని తెలిస్తే ఎంత నరకంగా ఉందో తెలుసా?
రాజ్: అవునో కాదో తెలియకుండా ముందే ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు రాహుల్. అయినా ఇంట్లో తాతయ్య ఆరోగ్యం బాగాలేదు కదా తాతయ్య కోసమైనా ఒక్క నెలరోజులు ఓపిక పట్టు
అంటూ రాహుల్‌కు చెప్తాడు రాజ్. ఇద్దరూ మాట్లాడుకోవడం పైనుంచి చూసిన కావ్య మౌనంగా బెడ్ రూంలోకి వెళ్తుంది. రాజ్ బెడ్‌రూంలోకి వస్తుంటే కావ్య కోపంగా చూస్తుంది. ఎందుకలా కోపంగా చూస్తున్నావ్ అంటూ రాజ్ అడుగుతాడు. మేకవన్నె పులిని చూస్తున్నాను అంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ రాజ్ గద్దిస్తాడు. అవును మీ గురించి నిజం తెలిసిపోయింది. ఇంకా ఎంతకాలం నన్ను మోసం చేస్తారు. ఇంకా ఎంత కాలం నా కళ్లుగప్పి ఈ తప్పుడు పని చేస్తుంటారు అంటూ నిలదీస్తుంది. మీ ఆఫీసులో పనిచేసే శృతికి మీకు ఏంటి సంబంధం అంటూ కావ్య అడగ్గానే రాజ్ కూల్‌గా తను ఎంప్లాయి.. నేను బాస్‌ను అంటూ సమాధానం ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply