అన్వేషించండి

Brahmamudi December 13th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : శ్వేత ప్రేమలో మునిగిపోయిన రాజ్ - కొత్త నాటకానికి తెరలేపిన సుబ్బు

Brahmamudi Serial Today Episode: తన అల్లుడు బంగారం అంటూ రాజ్ ను కనకం పొగుడుతుండగానే మరోవైపు రాజ్, శ్వేత కోసం పార్కుకు వెళ్లడంతో బ్మహ్మముడి సీరియల్లో బిగ్ ట్విస్ట్ మొదలైంది.

Brahmamudi Telugu Serial Today Episode: పెళ్లి కార్డు సగం కాలిపోవడంతో అనామిక వాళ్ల అమ్మ శైలజ కావ్యను నిందిస్తుంది. దీంతో రాజ్‌, కావ్యను వెనకేసుకొస్తాడు. కావ్య ఎలాంటిదో ఇంట్లో వాళ్లందరికీ తెలుసని ధాన్యలక్ష్మీ బాధపడేది పెళ్లి ఇష్టం లేక కాదని మీరంతా కావ్యను తప్పు పడుతున్నందుకు అని రాజ్‌ చెప్తాడు. పెళ్ళయ్యాక మీ అమ్మాయిని ఇంట్లో ఎవరూ ఏమీ అనరని చెప్తాడు. ఇప్పుడు ఆలోచించాల్సింది పెళ్లి పనులు ఎలా చేయాలోనని అంతే కానీ ఎవ్వరూ బాధపడవద్దని చెప్పి ఫోన్‌ రావడంతో రాజ్‌ వెళ్లిపోతాడు.

రుద్రాణి: సగం పత్రిక కాల్చావ్‌ సరిపోదా ఇంకా పట్టుకుని చూస్తున్నావ్‌.. ఇటువ్వు.. వెళ్లు వెళ్లి అందరికీ టీ అంట ఇవ్వు..

కావ్య: మీరేమి అనుకోనంటే నేను ఒకటి అడగనా రుద్రాణి గారు.

రుద్రాణి: ఎంటీ?

కావ్య: మీకెప్పుడూ చెడువైపే నిలబడాలని ఎలా అనిపిస్తుంది. అలా ఎలా కుదురుతుంది మీకు ముందు మీ జాతకంలోనే ఏదో ప్రాబ్లమ్‌ ఉన్నట్లుంది. ఒకసారి చూసుకోండి.

రాహుల్‌: చాలా అద్బుతంగా ప్లాన్‌ చేశావ్‌ మామ్‌ కానీ రాజ్‌ మొత్తం తుస్సుమనిపించాడు.

రుద్రాణి: నన్ను రెచ్చగొడితే ఏం జరుగుతుందో చూపిస్తాను. ఈ పెళ్లి కావ్య వల్లే ఆగిపోయేలా చేస్తాను చూడు.

కిచెన్‌లో వంట చేస్తున్న కావ్యతో వాళ్ల అమ్మ కనకం మాట్లాడుతుంది.

కనకం: ఎంత పని జరిగింది.

కావ్య: ఏమైందమ్మా?

కనకం: అనుకున్నదొక్కటి అయ్యిందొకటి

కావ్య: ఏమనుకున్నావ్‌.. ఏమైంది?

కనకం: అంతా సవ్యంగా జరుగుతుందనుకున్నాను. ఈలోగా కార్డు కాలిపోయింది.

కావ్య: అయితే

కనకం: నీవల్ల పెళ్లి ఆగిపోతే చెడ్డపేరు వచ్చేది.

కావ్య: ఎవరికి నీకా? నాకా?

కనకం: ఇటు మీ అత్త అటు స్వప్నవాళ్ల అత్త అనటం మొదలు పెడితే.. అనటం మానేస్తారా? మొత్తం కుటుంబాన్ని, సపరివారాన్ని కలిపి మడత పెడతారు కదా? అందరికీ చెడ్డపేరు వచ్చేది.

కావ్య: మా ఆయన ఊరుకునే రకం కాదని అర్థం అయింది కదా

అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటారు. కనకం తన అల్లుడు శ్రీరామచంద్రుడు అంటూ పొగుడుతుంది.

కట్‌ చేస్తే రాజ్‌ ఒక గార్డెన్‌లో కారు ఆపి శ్వేత కోసం చూస్తుంటాడు ఇంతలో శ్వేత వెనక నుంచి వచ్చి రాజ్‌ కళ్లు మూస్తుంది.

రాజ్‌: ఎలా ఉన్నావ్‌ శ్వేతా?

శ్వేత: నేను అలాగే ఉన్నాను. నా మనసు అలాగే ఉంది. నా ప్రేమ అలాగే ఉంది.

మరోవైపు కనకం రాజ్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంది. తన అల్లుడు నిజంగానే మారిపోయాడని కావ్యతో చెప్తుంది.

కావ్య: నిజమే అమ్మా ఆయన మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. అద్దంలాగా కనబడతారు.

శ్వేత: నువ్వొస్తావో రావో అనుకున్నాను రాజ్‌

రాజ్‌: నువ్వు పిలిచాకా రాకుండా ఎలా ఉంటాను శ్వేత.

శ్వేత: నాకిప్పుడు చాలా రిలీఫ్‌గా ఉంది.

కనకం: నిజంగా ఆస్థి ఐశ్వర్యం ఉన్న అబ్బాయిలకు జీవితంలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి

అంటూ కనకం వెళ్లిపోతుంది. ఈ శ్రీరామచంద్రుడు అర్జెంటుగా ఎక్కడికి వెళ్లిపోయాడో అని మనసులో అనుకుంటుంది కావ్య. మరోవైపు శ్వేత, రాజ్‌ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తారు. 

హాల్లో ఆలోచిస్తూ కూర్చున్న  కళ్యాణ్‌ దగ్గరకు జ్యూస్‌ తీసుకుని వస్తుంది కావ్య.

కావ్య: కవిగారు జూస్‌ తీసుకొండి

కళ్యాణ్‌: నేనేం అడగలేదు కదా వదిన

కావ్య: మీరెంత నీరసంగా ఉన్నారో చూస్తేనే తెలిసిపోతుంది. పైగా టెన్షన్‌గా కూడా కనబడుతున్నారు. తాగండి.

కళ్యాణ్‌: భయమేస్తుంది వదిన

కావ్య: అదేంటి ఎందుకు?

కళ్యాణ్‌: ఈ పెళ్లి ఆగిపోతుందేమోనని భయంగా ఉంది.

అలాంటి భయాలేం పెట్టుకోవద్దని కావ్య భరోసా ఇస్తుంది. ఇంతలో అక్కడకి రాజ్‌, ధాన్యలక్ష్మీ, అపర్ణ, వాళ్ల అత్తయ్య వస్తారు. అందరూ కలిసి రేపు గుడికి వెళ్దాం అని నిర్ణయించుకుంటారు. అనామిక వాళ్ల ఇంట్లో టెన్షన్‌ పడుతూ అటూ ఇటూ తిరిగుతూ..

అనామిక: అంతా బాగానే జరుగుతుందనుకుంటున్న టైంలో ఇలా పెళ్లి పత్రిక కాలిపోవడం ఎంటో నాకు అర్థం కావడం లేదు డాడ్‌

సుబ్బు: ఎందుకు బేబీ టెన్షన్‌ పడతావు. ఈ పెళ్లి జరుగుతుందని రాజ్‌ మాటిచ్చాడు కదా

శైలజ: మాటిచ్చాడు కానీ ఇలాంటిది మళ్లీ ఏదో ఒకటి జరుగుతే

సుబ్బు: అలా జరుగుతుందని ఎందుకు అనుకుంటావు.

అని మాట్లాడుకుంటుండగా అనామికకు కళ్యాణ్‌ ఫోన్‌ చేస్తాడు.

అనామిక: చెప్పు కళ్యాణ్‌

కళ్యాణ్‌: ఏంటి ఇంకా అదే మూడ్‌లో ఉన్నావా?

అంటే అవునని అనామిక చెప్పడంతో ఇక నువ్వేం టెన్షన్‌ పడకు అంటూ ఇంట్లో వాళ్లు గుడికి వెళ్దామనుకున్న విషయం కళ్యాణ్‌, అనామికకు చెప్తాడు. అనామికను కూడా ఉపవాసం ఉన్నట్లు నాటకం ఆడి వాళ్లు వెళ్తున్న గుడికే వెళ్లి దీపం వెలిగించమని సుబ్బు సలహా ఇస్తాడు. సరేనని అనామిక అంటుంది. మరోవైపు అప్పు బాధపడుతూ కళ్యాణ్‌ ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కనకం కూడా అప్పు చేత ఉపవాసం చేయించి కళ్యాణ్‌తో పెళ్లి జరిగేలా ఆ శివయ్యను ప్రార్థించాలి అనుకుంటుంది. అప్పుకు ఫోన్‌ చేసి రేపు ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వచ్చి కోనేటిలో దీపం వదలాలని చెప్తుంది. మొదట అప్పు ఒప్పుకోకపోయినా బలవంతంగా  కనకం అప్పూను ఉపవాసం ఉండటానికి ఒప్పిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అంజు దెబ్బకి షాకైన ప్రిన్సిపల్, ఒంటరిగా ఉన్న అరుంధతి ఘోర చేతికి చిక్కుతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget