Brahmamudi September 25th: రాజ్ ని ఆకాశానికెత్తేసిన కావ్య- స్వప్న మర్డర్ కి రాహుల్ స్కెచ్, రగిలిపోతున్న రుద్రాణి
కావ్య కాంట్రాక్ట్ పూర్తయ్యేలా చేయడంలో రాజ్ సహాయం చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
చాలా రోజుల తర్వాత స్వప్న కనిపిస్తుంది. రాహుల్ కి అనుమానం రాకుండా ఉండటం కోసం పొట్ట కనిపించేలా బ్యాండ్ వేసుకుంటుంది. చీరలో తను ఎలా ఉన్నానంటూ భర్త రాహుల్ ని అడుగుతుంది. కడుపు పెరిగిందని గుర్తు పట్టాడు ఏమో అనుకుంటుంది. కానీ రాహుల్ మాత్రం బుగ్గన చుక్కన పెట్టి దిష్టి తగలకుండా చేశానని చెప్పాడు. దీన్ని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తుంటే రొమాన్స్ గురించి మాట్లాడుతుందని తిట్టుకుంటాడు.
స్వప్న: ఇక ఇంటికి వెళ్లిపోదామా?
రాహుల్: అదేంటి ఐదు రోజులు ఇక్కడే ఉందామని అన్నావ్ కదా
స్వప్న: అనుకున్నా కానీ ఎందుకో ఇంట్లో అందరూ గుర్తుకు వస్తున్నారు వెళ్లిపోదాం
రాహుల్: సరే నీ ఇష్టం ఇప్పుడు కాదు రేపు వెళ్దాం. మనం ఊటీలో ఉన్నామని అమ్మకి వీడియో కాల్ చేశాను. వెంటనే వెళ్తే డౌట్ వస్తుంది. ఇక్కడే ఉండి ఊటీలో ఉన్నట్టు అబద్ధం చెప్పాల్సి వచ్చింది
స్వప్న: నీతో ప్రైవసీ కోసం బయటకి వెళ్దామని అన్నాను. నీతో ఉన్న ఈ వారం రోజులు చాలా ఎంజాయ్ చేశాను
రాహుల్: రేపు నీకు ఇంకొక సర్ ప్రైజ్ ఉంది అనేసరికి స్వప్న సంతోషపడి హగ్ చేసుకుంటుంది. రేపటితో నీ కథ ముగిసిపోతుందని అనుకుంటాడు. అటు స్వప్న కూడా నీతో కలిసి రొమాన్స్ చేయడానికి ఇక్కడికి రాలేదు కడుపు పెరిగిందని నమ్మించడానికని అనుకుంటుంది.
ఇంటి దగ్గర కొడుకు కోసం అపర్ణ టెన్షన్ గా ఎదురుచూస్తుంది. తను చేసిన పని వల్ల కావ్య ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారని రుద్రాణి సంతోషపడుతుంది. అపర్ణ అటూ ఇటూ తిరుగుతుంటే ఎందుకు అలా చేస్తున్నావని ఇంద్రాదేవి అడుగుతుంది. రుద్రాణి పుల్ల వేసేందుకు చూస్తుంటే అపర్ణ తిరిగి కౌంటర్ ఇస్తుంది. అప్పుడే కావ్య, రాజ్ ఇంటికి వస్తారు. విగ్రహాలు కనిపించక ఏడ్చి వచ్చిందని రుద్రాణి మనసులో సంబరపడుతుంది.
అపర్ణ: నీకు వెళ్లేటప్పుడు చెప్పాను పండగ ఉంది చాలా పనులు ఉంటాయని. నిన్న రాత్రి వస్తానని చెప్పి బారెడు పోద్దేక్కాక వచ్చావ్
రుద్రాణి: అక్కడ ఎన్ని పనులు ఉన్నాయో. అయినా ఏమైనా అయితే చూసుకోవడానికి రాజ్ ఉన్నాడు కదా
కావ్య: మధ్యలో మా ఆయన్ని ఎందుకు లాగుతున్నారు. సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది నేను. అసలు ఏం జరిగిందో చెప్పనివ్వకుండా మీరే స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తే ఎలా. మేం ఆలస్యంగా రావడానికి కారణం ఉంది. మేం తయారు చేసిన విగ్రహాలు అన్నీ దొంగలు ఎత్తుకెళ్లిపోయారు
రుద్రాణి: అయ్యయ్యో పాపం అయితే మీరు అనుకునట్టు అప్పు తీర్చకపోగా మరొక పది లక్షలు ఎక్కువ అప్పు అయ్యిందా?
కావ్య: మీరు నిజంగానే బాధపడుతున్నారా రుద్రాణి?
Also Read: ముకుంద ప్లాన్ సక్సెస్- మరి కృష్ణ ఇచ్చే రివర్స్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది!
శుభాష్: ఇంత జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు
రుద్రాణి: దొంగలు వాటిని అమ్మేయకుండా నాశనం చేయకుండా ఉన్నారు?
కావ్య: కొంచెం అయితే అదే జరిగేది మా ఆయన వెళ్ళి తీసుకొచ్చారు అనేసరికి ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఆ మాటకి రుద్రాణి తీసుకొచ్చేశాడా? అని షాక్ అవుతుంది. మేం విగ్రహాలు పోయాయని ఏడుస్తుంటే ఆయన ఒక్కరే విగ్రహాలు ఎలా పోయాయో ఆలోచించారని జరిగినది మొత్తం చెప్తుంది. రాజ్ మంచి పని చేశాడని మెచ్చుకుంటుంటే అపర్ణ కోప్పడుతుంది.
అపర్ణ; ఈ గొడవలు ఎందుకు నీకు? ఏదైనా జరిగి ఉంటే
కావ్య: మీ అబ్బాయి అక్కడ ఒక్కొక్కరిని చితకబాదారు. అలాంటిది ఆయన్ని ఎవరు ఏం చేస్తారు?
అపర్ణ: ఇదంతా నీ వల్లే జరిగినది. నువ్వు మావాడి జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి
రాజ్: మమ్మీ తప్పు నాది. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగనివ్వనని మాట ఇస్తున్నా. తనని ఏమి అనకు
ఇంద్రాదేవి: మీ అత్తయ్య మాటలు పట్టించుకోకు
కావ్య: అత్తయ్య బాధలో తప్పు లేదు కొడుక్కి ఏదైన జరుగుతుందని బాధపడుతున్నారు. నాదొక చిన్న రిక్వెస్ట్. కాంట్రాక్ట్ తిరిగి వచ్చింది. విగ్రహాలు కాపాడింది మీరే కాబట్టి వినాయక చవితి రోజు మీ చేతుల మీదుగా ఇంటి పేపర్స్ ఇవ్వాలని ఆశపడుతున్నా
రాజ్: కుదరవు నాకు అలాంటివి నచ్చవు
శుభాష్: ఇప్పుడు ఇలానే అంటున్నాడు. కావ్య బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి అడగ్గానే ఒప్పేసుకుంటున్నాడు
సీతారామయ్య చెప్పేసరికి కావ్య అడిగిన దానికి సరే అంటాడు. రుద్రాణి రాహుల్ కి ఫోన్ చేస్తుంది. ఫుల్ హ్యాపీగా ఉన్నావా అని తెగ ఆరాటంగా అడుగుతాడు. షటప్ అని గట్టిగా అరుస్తుంది.
రుద్రాణి: నిన్ను నమ్ముకోవడం కంటే బయట వాళ్ళు నయం. నువ్వు పంపించిన వాళ్ళు దొరికిపోయారు.
రాహుల్: అదేంటి నిమజ్జనం చేస్తున్నామని అన్నారు
రుద్రాణి: నువ్వు పంపిన ఇడియట్స్ ని రాజ్ కనిపెట్టి వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి విగ్రహాలు తీసుకుని వచ్చాడు
రాహుల్: ఇక్కడ మాత్రం నేను ఫెయిల్ అవ్వను. స్వప్న విషయంలో అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను
రుద్రాణి: ఇక్కడ ఫెయిల్ అయింది మళ్ళీ అక్కడ ఫెయిల్ అయితే ఇంట్లోకి కూడ రానివ్వను
స్వప్నని పెళ్ళిలో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్న మైఖేల్ కి రాహుల్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. స్వప్నని కిడ్నాప్ చేసి చంపేయాలని అంటాడు. కావ్య కూర్చుని ముసిముసిగా నవ్వుకుంటుంటే రాజ్ ఏమైందని అడుగుతాడు. మీ వల్లేనని పొగుడుతుంది.
Also Read: కొనసాగుతున్న టామ్ అండ్ జెర్రీ వార్, శైలేంద్రకి జగతి రివర్స్ పంచ్!
కావ్య: మా ఫ్యామిలీ కోసం మీరు చేసిన పనికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేను
రాజ్: నేను ఆ పని చేసింది..
కావ్య: సాటి మనిషిగా అంటే చంపేస్తాను
రాజ్; తమరు నాకు తెలియకుండా డిజైన్స్ వేశారు కదా అందుకే ఆ సాయానికి ఇది తిరిగి సాయం. అయినా నాకు ఇలాంటివి చిటికెలో పనులని డప్పు కొట్టుకుంటాడు. అప్పుడే పక్కన బొద్దింక ఉండటం చూసి అంతెత్తున ఎగిరి పడి బెడ్ ఎక్కేస్తాడు. ఏమైందని కావ్య అంటుంది. రాజ్ బొద్దింకని చూసి వణికిపోతాడు. కావ్య మాత్రం దాన్ని చేత్తో పట్టుకుని భయమా అంటుంది. టైమ్ దొరికిందని ఆడేసుకుంటుంది.