Brahmamudi September 11th: సీతారామయ్య కోరిక విని షాకైన తల్లీకొడుకులు- భర్త ప్రేమకి పొంగిపోయిన కావ్య
పెద్దాయన ఆరోగ్యం కోసం రాజ్ కావ్యతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అప్పు ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్తానని అనేసరికి కనకం కోపంగా తనని గదిలో పెట్టి బంధించేస్తుంది. కృష్ణమూర్తి అలా ఎందుకు చేశావని అంటాడు. అప్పుడు కూడా ఇలాగే వెళ్ళి ఎవడో తల పగలగొట్టింది మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదని తన భయాన్ని చెప్పుకుంటుంది. కావ్యని ఇంద్రాదేవి మెచ్చుకుంటుంది. ఇంటి ముందు ముత్యాల ముగ్గు ఉంటుంది, ధూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయని ఇల్లు కళకలాడుతుందని మెచ్చుకుంటుంది. అంటే అపర్ణ వదిన అలా చేయలేదా? అని పుల్ల పెట్టడానికి రుద్రాణి చూస్తుంది. దీంతో ఇంద్రాదేవి బాగా గడ్డి పెడుతుంది.
కావ్య: ప్రతి దానికి వక్ర భాష్యాలు చెప్పొద్దు. అత్త అండలేని ఏ కోడలు మెట్టినింటిలో మనుగడ సాగించలేదు. సంతోషంగా పూజ చేసుకుంటుంటే ఇలాంటి మాటలు మాట్లాడి మనసు విరిచేయాలని చూడొద్దు
అన్నలు కూడా రుద్రాణిని సైలెంట్ గా ఉండమని చెప్తారు. రాజ్ బాక్స్ పట్టుకుని కిందకి వస్తాడు. అది చూసి ఏంటదని అపర్ణ కొడుకుని అడుగుతుంది. బాక్స్ తెరిచి అందులో ఉన్న నెక్లెస్ చూపిస్తాడు.
Also Read: జాహ్నవి ఎంట్రీతో దివ్యకి కష్టాలు, తులసిని సైడ్ చేసేందుకు రత్నప్రభ స్కెచ్
రాజ్: మన కంపెనీకి మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయే డిజైన్స్ కావాలని కాంట్రాక్ట్ వచ్చింది. దాన్ని నేను రిజెక్ట్ చేసే టైమ్ లో ఈ కళావతి తక్కువ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయే డిజైన్స్ వేసి ఇచ్చింది. ఆ కాంట్రాక్ట్ ఒకే అయ్యింది. ఇప్పుడు వాళ్ళు శాంపిల్స్ చేసి పంపించారు. అందుకే ఫస్ట్ జ్యూయలరీ తనకే గిఫ్ట్ ఇస్తున్నాను మమ్మీ అనేసరికి అపర్ణ షాక్ అవుతుంది. ఇంట్లో అందరూ సంతోషిస్తారు.
సీతారామయ్య: నీ చేత్తోనే కావ్య మెడలో వెయ్
దీంతో రాజ్ ఆ నెక్లెస్ ని కావ్య మెడలో వేస్తాడు. భర్త చూపించిన ప్రేమకి కావ్య పొంగిపోతుంది. రుద్రాణి కళ్ళతోనే అపర్ణని రెచ్చగొడుతుంది.
సీతారామయ్య: కావ్యకి నెక్లెస్ బహుమతి ఇచ్చావ్ సంతోషం. నేను అడిగిన బహుమతి కూడా ఇవ్వు. మూడు నెలల్లో కావ్య తల్లి కాబోతుందని విశేషం వినాలని ఉంది
ఇంద్రాదేవి: మీ తాతయ్య ముని మనవడిని ఎత్తుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి మాట ఇస్తున్నావా
రాజ్: రాని నవ్వుని తెచ్చుకుని అలాగే తాతయ్య అంటాడు. దీంతో అపర్ణ బిత్తరపోతుంది. కావ్య సంతోషంగా వెళ్ళిపోతుంది.
కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తాడు. తను ఆడుకునే గ్రౌండ్ ని ఎవరో కబ్జా చేశారని వెంటనే వెళ్ళి ఆపాలని కళ్యాణ్ కి చెప్పి ఇంట్లో నుంచి జారుకుంటుంది. కావ్య పెళ్లి అయినప్పటి నుంచి జరిగివన్నీ తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఇంద్రాదేవి వచ్చి ఏమైందని అడుగుతుంది. వాళ్ళ మాటలు అటు అపర్ణ, ఇటు రాజ్ వింటారు.
కావ్య: ఈ ఇంటి కోడలిగా నాకు గుర్తింపు వచ్చింది. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అందరూ మీ మనవడి చేత నా బాధ్యత తీసుకోమని చీర సారె ఇవ్వమని చెప్పారు కానీ మీ మనవడు దాన్ని వదిలేశాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను ఎలా బాధ్యత తీసుకుంటానని వెళ్లిపోయారు. అప్పుడు అనిపించింది. జీవితాంతం ఇలాంటి మనిషితో కాపురం చేయాలా? మా మధ్య బ్రహ్మముడి ఎందుకు వేశావని నాలో నేను బాధపడ్డాను. కానీ ఈరోజు నాకు నమ్మకం వచ్చింది
రుద్రాణి: ఇచ్చింది చిన్న నెక్లెస్ అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు వేసుకునేది దానికి ఇంత ఎమోషనల్ అవసరమా
కావ్య: మీరు నెక్లెస్ ఖరీదు చూస్తున్నారు కానీ నేను ఆయన తీసుకున్న బాధ్యత చూస్తున్నా. ఆయనలోని ప్రేమని నేను ఈరోజు చూశాను. ఇంతమందితో నేను కలిసి ఉన్నా నేను బయట దాన్ని అని గుర్తు చేస్తూ వచ్చారు. ఇప్పుడు నమ్మకం వచ్చింది నేను ఇంటి కోడలిని అని. ఇది నా ఇల్లు
Also Read: తల్లికి నిజం చెప్పేసిన రాజ్, కనకానికి దొరికిపోయిన రాహుల్ - స్వప్నను చంపించే కుట్రలో రుద్రాణి!
ఇంద్రాదేవి: గొడవలు జరిగినంత మాత్రాన ఇంటి కోడలివి కాకుండా పోతావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి సంతోషంగా కాపురం చేయండి. తాతయ్య చెప్పినట్టు తొమ్మిది నెలల్లో చిన్ని కృష్ణయ్య తిరగాలి.
అపర్ణ కోపంగా రాజ్ ని గదికి లాక్కుని వెళ్తుంది.
అపర్ణ: కావ్యని నువ్వు భార్యగా ఒప్పుకుంటున్నావా? అంటే మౌనంగా ఉంటాడు. వరలక్ష్మీ వ్రతం జరిగిన రోజు రాత్రి నుంచి కావ్య పట్ల నువ్వు ప్రవర్తించే తీరులో మార్పు వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నావ్. ఎందుకు నీలో అంత మార్పు వచ్చింది
రాజ్: తాతయ్యకి ఇచ్చిన మాట కోసమని చెప్పలేనని మనసులో అనుకుంటాడు.
అపర్ణ: ఎందుకు ఇదంతా చేస్తున్నావ్
రాజ్: చెప్పలేను మమ్మీ
అపర్ణ: చెప్పలేవా నాతో చెప్పడం ఇష్టం లేదా?
రాజ్: నిన్ను కాదని నేను ఏమి చేయను. కానీ ఒకటి మాత్రం చెప్తాను ఆ కళావతిని నేను భార్యగా ఎప్పటికీ అంగీకరించను
అపర్ణ: మరీ నీ భార్య అంటే ఎందుకు ఇష్టం ఉన్నట్టు ఉంటున్నావ్
రాజ్: నా కారణాలు నాకు ఉన్నాయ్
అపర్ణ: కారణం ఉందని నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే కావ్య అదే నిజమని నమ్ముతుంది. నీమీద ఆశలు పెంచుకుంటుంది. ఏదో ఒకరోజు నిజం తెలిస్తే తనకి అప్పుడు ఏం సమాధానం చెప్తావ్. ఒక ఆడపిల్ల మనసు బాధపెట్టిన వాడికి అవుతావు
రాజ్: అది నేను చూసుకుంటాను. కానీ నువ్వు చూసి చూడనట్టు ఉండు
అపర్ణ: ఇంతకముందు ఇలాగే చెప్పావ్ మళ్ళీ ఇలాగే చేస్తున్నావ్
రాజ్: అర్థం చేసుకో మమ్మీ ఇంతకంటే నేనేమీ చెప్పలేను అనేసి వెళ్ళిపోతాడు. రాజ్ తెలియకుండానే పెద్ద తప్పు చేస్తున్నాడు ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని అపర్ణ కంగారుపడుతుంది. అప్పు తన గ్యాంగ్ ని వేసుకుని గ్రౌండ్ కి వస్తుంది. వెనుకాలే కళ్యాణ్ కూడా వచ్చి తనని ఆపుతాడు. ఇప్పుడు గొడవలు అవసరమా అని నచ్చజెప్పడానికి చూస్తాడు. లీగల్ గా చూసుకుంటాను కోర్టుకి వెళ్దామని అనేసరికి నవ్వుతారు. కళ్యాణ్ ఎంత చెప్పిన వినకుండా వాళ్ళతో గోడవకి దిగి వాళ్ళని కొడుతుంది. మధ్యలో కళ్యాణ్ కల్పించుకుంటే పక్కకి తోసేస్తుంది.
తరువాయి భాగంలో..
రాజ్ కి ఫోన్ వస్తుంటే తను బాత్ రూమ్ లో ఉన్నాడని కావ్య లిఫ్ట్ చేయబోతుంటే వచ్చి లాగేసుకుంటాడు. తన ఫోన్ చెక్ చేస్తున్నావంటూ కావ్య మీద అరుస్తాడు. దీంతో తను వెళ్ళిపోతుంది. మూడు నెలలు నటించాలని అనుకుంటే ఒరిజనల్ క్యారెక్టర్ ఇలా బయట పడుతుంది ఏంటి వెంటనే తనని కూల్ చేయాలని అనేసి కావ్య వెనుకే వెళతాడు. హాల్లోకి వెళ్తున్న కావ్య చీర కొంగు పట్టుకుంటాడు. అందరూ హాల్లోనే ఉండటంతో అది చూసి షాక్ అవుతారు.