Brahmamudi July 17th: 'బ్రహ్మముడి' సీరియల్: బాత్ రూమ్ దగ్గర కావ్యతో రాజ్ సరసాలు - విషమంగా అన్నపూర్ణ ఆరోగ్యం, ఆందోళనలో కనకం
రాజ్ కి తెలియకుండా కావ్య తన ఆఫీసులోనే పని చేస్తుందటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య డిజైన్స్ వేసి వాటిని శృతికి పంపిస్తుంది. అమ్మానాన్నలకి సాయం చేసే అవకాశం దొరికింది, దీన్ని చేజారిపోనీయకని కావ్య మనసులోనే దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. ఆ డిజైన్ పేపర్స్ కబోర్డులో పెట్టేసి నిద్రపోతుంది. రాజ్ దగ్గర నుంచి ఫైల్ తీసుకురమ్మని ప్రకాశం చెప్తాడు. దీంతో కావ్య గదికి వచ్చి బాత్ రూమ్ లో ఉన్న రాజ్ ని అడుగుతుంది. టవల్ మర్చిపోయాను ఇవ్వమని అడుగుతాడు. టవల్ తీసుకునే క్రమంలో కావ్య చీర కొంగు బాత్ రూమ్ డోర్ లో ఇరుక్కుపోతే రాజ్ పట్టుకున్నాడని సిగ్గుపడుతుంది. తీరా చూస్తే అది డోర్ ఉండేసరికి రాజ్ దొరికింది ఛాన్స్ అనుకుని గంట సేపు స్నానం చేస్తానని ఏడిపిస్తాడు. పంతులు బ్రహ్మముడి వేసినప్పుడు బాత్ రూమ్ అర్జెంట్ అంటే ఏడిపించావ్, ఇప్పుడు నాకు టైమ్ వచ్చిందని ఆడుకుందామని కావ్య చీర కొంగు పట్టుకుని వదలకుండా ఉంటాడు. మరోవైపు ప్రకాశం ఫైల్ కోసమని రూమ్ కి వచ్చేస్తాడు. కావ్య కదలకుండా బాత్ రూమ్ ముందు నిలబడి ఉంటుంది. ఏంటమ్మా కదలకుండా ఉంటున్నావని అంటాడు. చేసేది లేక ఫైల్ తీసుకుని వెళ్ళిపోతాడు.
కనకం అక్క అన్నపూర్ణ దగ్గుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉందని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిందేనని డబ్బులు తీసుకొచ్చారా అని అడుగుతుంది. అన్నపూర్ణ దగ్గుతూ ఉండగా ముక్కు నుంచి రక్తం వస్తుంది. కంగారుగా ఆమెని హాస్పిటల్ కి తీసుకుని వెళతారు. కావ్య శృతికి ఫోన్ చేసి డిజైన్స్ వేసింది తనేనని చెప్పొద్దని అంటుంది. ఫోన్ మాట్లాడుతూ ఉండగా రాజ్ ఆఫీసుకి వస్తాడు. శృతి పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుంటే ఎదురుగా వెళ్ళి నిలబడతాడు. డిజైన్స్ ఎవని అడిగితే చూపిస్తుంది. బాగున్నాయని మెచ్చుకుంటాడు. అవి వేసింది తను కాదని కొత్త వారిని హైర్ చేసుకోమని చెప్పారు అందుకే నా ఫ్రెండ్ మంచి డిజైనర్ తను వేసిందని చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరో ఆఫీసుకి రమ్మని చెప్తాడు. తనకి పెళ్లి అయ్యిందని ఇంట్లో కాస్త కండిషన్స్ ఉన్నాయని ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తుందని చెప్తుంది. ఇంత మంచి టాలెంట్ ఉన్న ఆమెని వంటింటి కుందేలుని చేశాడా అని తిడతాడు. అదంతా కావ్య ఫోన్లో వింటూనే ఉంటుంది. తను ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వమని చెప్తాడు.
Also Read: కొడుకుతో కలిసి భోజనం చేసిన మహేంద్ర - రిషి గురించి నిజం చెప్పిన ఏంజెల్ - షాక్లో జగతి, వసు
అన్నపూర్ణని చెక్ చేసిన డాక్టర్ లంగ్స్ డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తుందని, టీబీ లక్షణాలు కనిపిస్తాయని అనేసరికి కనకం కంగారుపడుతుంది. టెస్టులకి ఎంత అవుతుందని కృష్ణమూర్తి అంటే పదివేలు అవుతుందని అనేసరికి బాధపడతారు. ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు ఎందుకు ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదు. నా కోసం అప్పులు చేయడం ఎందుకని అన్నపూర్ణ అంటుంది. డబ్బు గురించి ఆలోచించొద్దని ధైర్యం చెప్తారు. స్వప్న పెద్ద లిస్ట్ రాసి రాహుల్ కి ఇస్తుంది. రెండు రోజుల్లో షూటింగ్ ఉందని వెంటనే తగ్గాలని.. మూడు కేజీలు తగ్గాలని తను తినాల్సిన ఐటెమ్స్ గురించి పెద్ద లిస్ట్ చెప్తుంది. డైట్ తీసుకోకపోతే బొద్దుగా ఉన్నానని కామెంట్స్ చేస్తారని అంటుంది. కడుపుతో ఉంది ఇవన్నీ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని రాహుల్ వారిస్తాడు. ఎన్ని చెప్పినా కూడా స్వప్న మాత్రం తన మాట వినదు. నీ గొయ్యి నువ్వే తొవ్వుకుంటున్నావని రాహుల్ సంబరపడిపోతాడు.
Also Read: వేద వచ్చి క్షమాపణ చెప్తేనే ఇంటికి వస్తానని కండిషన్ పెట్టిన ఆదిత్య- సంబరపడిపోతున్న మాళవిక