Brahmamudi Serial February 1st Promo: ‘బ్రహ్మముడి’ సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేత భర్త - సైకోలకే సైకోలా ఉన్న కొత్త క్యారెక్టర్
Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని మలుపులు చోటు చేసుకోనున్నాయి.
Brahmamudi Serial Today Episode: తెలుగు సీరియల్స్ లో టాప్ రేటింగ్‌లో దసూకుపోతూ.. ఆసక్తికరమైన కథ, కథనాలతో బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది బ్రహ్మముడి సీరియల్. ఇప్పటికే ఉన్న క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న నాటకీయత కూడా రోజురోజుకు ఈ సీరియల్‌పై ఆసక్తిని రేపుతుంది. అయితే తాజాగా ఈ సీరియల్ లోకి మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. సైకోలకే సైకోలా ఉన్న ఆ పాత్ర శ్వేత భర్త అరవింద్‌గా పరిచయం చేశారు. శ్వేతను కొడుతూ.. హింసిస్తూ అరవింద్ పాత్ర తెరముందుకు రావడం చూస్తుంటే ముందు ముందు ఎపిసోడ్లు మరింత ఆసక్తిగా మారబోతున్నట్లు కనిపిస్తుంది. అలాగే శ్వేత, రాజ్‌ల మధ్య అక్రమ సంబంధం అంటగట్టడుతూ వారితో వల్గర్‌గా మాట్లాడటం చూస్తుంటే.. మరో మెయిన్ క్యారెక్టర్‌గా అరవింద్ రాబోతున్నట్లు.. అలాగే మరింత వైలెంట్‌గా ఈ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే శ్వేతను చంపేందుకే అరవింద్ క్యారెక్టర్ రంగంలోకి దిగిందా? అన్నట్లుగా అరవింద్ ఇంట్రడక్షన్ ఉంది. ఒకవేళ అరవింద్, శ్వేతను చంపి ఆ నేరం రాజ్ మీదకు తోసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదంటే అరవింద్ నుంచి శ్వేతను సేవ్ చేసే ప్రయత్నంలో రాజ్ కూడా అరవింద్ చేతిలో హత్య చేయబడతాడా? అనేది సస్పెన్స్‌గా మారింది.
రోజురోజుకు ఆసక్తికరమైన ట్విస్టులతో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ మరో మలుపు తీసుకుంది. ఇప్పటికే రాజ్ మీద అనుమానంతో ఆఫీసులోకి ఉద్యోగిగా కావ్య ఎంట్రీ ఇచ్చింది. రాజ్, శ్వేతల మధ్య ఉన్న రిలేషన్ ఎంటో కనిపెట్టేందుకే కళ్యాణ్ చొరవతో కావ్య డిజైనర్‌గా రాజ్ కంపెనీలో జాయిన్ అయింది. అయితే కావ్య డిజైనర్‌గా జాయిన్ అయిన రోజే రాజ్, శ్వేత సన్నిహితంగా ఉండటాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తన అనుమానమే నిజమైంది అనుకుని కావ్య భాదపడుతుంది.
అయితే ఇక్కడే శ్వేత భర్త అరవింద్ ఎంట్రీ ఇచ్చాడు. శ్వేతను కొడుతూ.. ఆస్థి తన పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా శ్వేతను టార్చర్ చేస్తుంటాడు. క్రూరంగా శ్వేతను హింసిస్తుంటాడు. అయితే అరవింద్ క్యారెక్టర్ ఆస్థి కోసం భార్యను వేధించే విధంగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఇన్ని రోజులు రాజ్, శ్వేత కలిసి డైవర్స్ కోసం లాయర్ దగ్గరకు పోవడాన్ని అంతా రాజ్, కావ్యకు డైవర్స్ ఇస్తాడేమో అనుకున్నారు. కానీ శ్వేత డైవర్స్ కోసం ఇన్నాళ్లు లాయర్ దగ్గరకు తిరిగారని.. ఇప్పుడు క్లియర్‌గా తెలిసిపోయింది. ఒకవేళ శ్వేత, అరవింద్‌తో డైవర్స్ తీసుకుంటే రాజ్‌తో పెళ్లికి ప్రపోజల్ పెడుతుందేమో.. అప్పుడు కావ్య పరిస్థితి ఏంటి? రాజ్ కూడా కావ్యకు విడాకులు ఇస్తాడా? శ్వేతను పెళ్లి చేసుకుంటాడా? అనేది ముందు ముందు ఎపిసోడ్లలో తెలుస్తుంది.
మరోవైపు రేపటి ఏపిసోడ్ మరింత ఆసక్తిగా మారినట్లు ఇవాళ ఇచ్చిన ప్రోమోలో తెలిసిపోయింది. రాజ్‌ను శ్వేత గురించి కావ్య నిలదీయడంతో రాజ్ షాక్ అవుతాడు. తనకు శ్వేత గురించి ఎలా తెలిసిందని మనసులో అనుకుంటాడు. అయితే ఏదో సర్ధిచెప్పబోతుంటే.. కావ్య తాను అంతా చూశానని.. ఇక డొంక తిరుగుడు మాటలు చెప్పొద్దని వారిస్తుంది. దీంతో రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా జరగనున్నట్లు ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. అయితే పాత క్యారెక్టర్లతోనే ఇన్ని రోజుల ఎంతో ఆసక్తికరంగా జరిగిన బ్రహ్మముడి సీరియల్ మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో మరింత మలుపులతో సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
ALSO READ: ఆ స్టార్ హీరోతో వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి - నిజమెంత?