Brahmamudi Appu: ఛాన్సులిచ్చి కమిట్మెంట్ అడిగేవారు, రక్తం అమ్ముకుని ఆకలి తీర్చుకున్నా: ‘బ్రహ్మముడి’ నటి నైనిషా రాయ్
Brahmamudi Serial Actress Nainisha Rai: నైనిషా రాయ్.. బుల్లితెర ఫేమస్ నటి ఈమె. ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించింది ఈ బెంగాళీ భామ. ఈమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Brahmamudi Serial Actress Nainisha Rai: 'బ్రహ్మముడి', 'శ్రీమంతుడు', 'ఇంటి గుట్టు', 'భాగ్యరేఖ', 'వంటలక్క' లాంటి సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నైనిషా రాయ్. తన అభినయంతో అభిమానులను కూడా బాగానే సంపాదించింది. అయితే, నైనిషా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ య్యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
బుల్లితెరలో కాస్టింగ్ కౌచ్..
కాస్టింగ్ కౌచ్.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్‌లో దీని గురించి వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, బుల్లితెరలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయట నైనిషాకి. ఈ విషయాలపై ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. "ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను. చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చాలా ఇబ్బందులు పడ్డాను. ఛాన్సులు కోసం చాలా ప్రయత్నాలు చేశాను. చాలామంది ఛాన్స్ ఇస్తే నాకేంటి అనేవాళ్లు. కొంతమంది ఛాన్స్ ఇచ్చిన తర్వాత కమిట్మెంట్ అడిగేవారు. అలా షూటింగ్ స్టార్ట్ చేశాక బలవంతం పెడితే.. పారిపోయి వచ్చేశాను. ఇక తినేందుకు తిండి లేదు. చేతిలో డబ్బులు లేవు. అప్పుడే రక్తం ఇస్తే డబ్బులు ఇస్తారని తెలిసి బ్లడ్ అమ్ముకుని అన్నం తిన్నాను" అని తన కష్టాల గురించి చెప్పారు నైనిషా.
నాన్న లెక్చరర్..
"బెంగాల్‌కు చెందిన నేను ఇంటర్ లోనే ఇంటి నుంచి వచ్చేశాను. నాన్న లెక్చరర్. ఇంట్లో వాళ్లకి సినిమా ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ లేదు. అందుకే, ఇంత జరిగిన ఇంటికి వెళ్లలేదు. వెళ్లలేను కూడా. ఎందుకంటే రానివ్వరు. వాళ్లకు ఇష్టం లేకుండా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. అమ్మ నాన్న ఇప్పటికీ మాట్లాడరు. ఒక్కోసారి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవాలి అనిపించేది. కానీ, అలాంటి టైంలోనే ఒక వ్యక్తి బాగా సపోర్ట్ చేశారు. "ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను నాకు చెప్పు" అన్నారు. నేను ఆయన్ను 'మామయ్య' అని పిలుస్తాను. ఆయనే వర్ధన్నపెట ఎమ్మెల్యే నాగార్జున. ఇప్పటికీ చాలా సపోర్ట్ గా ఉంటారు. అలా ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఈ ఛాన్సులు దక్కించుకున్నాను. ఇప్పుడు సెటిల్ అయ్యాను" అని జర్నీ గురించి చెప్పింది నైనిషా రాయ్.
'బ్రహ్మముడి' సీరియల్ లో అప్పుగా అందరికీ పరిచయం నైనిషా. 'శ్రీమంతుడు' సీరియల్ లో కూడా ఆమె లీడ్ రోల్ ప్లే చేశారు. 'కలిసుంటే కలదు సుఖం', 'వంటలక్క', 'భాగ్య రేఖ', 'ఇంటి గుట్టు', 'హంసగీతం' తదితర ప్రాజెక్టుల్లో చేశారు ఆమె. వాటితో పాటు మూడు సినిమాల్లో నటించానని చెప్పారు నైనిషా.
Also Read: అనుపమా ఇలా చేస్తావనుకోలేదు - సావిత్రి, సౌందర్యలతో పోల్చుతూ అభిమాని ఆవేదన