Anupama - Tillu Square: అనుపమా ఇలా చేస్తావనుకోలేదు - సావిత్రి, సౌందర్యలతో పోల్చుతూ అభిమాని ఆవేదన
Anupama - Tillu Square: అనుపమ పరమేశ్వరన్.. యూత్ లో ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం ఎంత కష్టమొచ్చిందో ఈ అభిమానికి.
![Anupama - Tillu Square: అనుపమా ఇలా చేస్తావనుకోలేదు - సావిత్రి, సౌందర్యలతో పోల్చుతూ అభిమాని ఆవేదన Anupama Parameswaran fan about bold Scenes in Tillu Square Movie Video Viral Anupama - Tillu Square: అనుపమా ఇలా చేస్తావనుకోలేదు - సావిత్రి, సౌందర్యలతో పోల్చుతూ అభిమాని ఆవేదన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/20/43427178d49387e25e2e222396fe74e91708404808694932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anupama Fan About Tillu Square Movie : అనుపమ పరమేశ్వరన్.. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. అబ్బాయిలు అనుపమ కోసం పడిచస్తుంటారు. ఆమె కర్లీ హెయిర్, కట్టు, బొట్టు చూసి ఆమెను అభిమానిస్తుంటారు. మళయాళి నటి అనుపమ పరమేశ్వరన్ 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 'శతమానం భవతి' లాంటి సినిమాలు చేసింది. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలు అన్నింటిలో దాదాపు ట్రెడిషనల్ గానే నటించింది అనుపమ. అయితే, ఇప్పుడు ఆమె చేసిన టిల్లూ స్క్వేర్ లో మాత్రం కొంచెం డోస్ పెంచింది ఈ భామ. ఈ మధ్య రిలీజైన ట్రైలర్ లో సీన్లతో రెచ్చిపోయింది. దీంతో ఆ ట్రైలర్ చూసిన ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమాని అయితే.. ఏకంగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇలాంటి సినిమాలు చేయడం నచ్చట్లేదండి
"యాండి అనుపమ గారు.. నా ఆటోలో మీ ఫొటో ఎందుకు ఏశానో తెలుసా? ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి అండి. 'అఆ'.. సినిమాలో మిమ్మల్ని చూసి ఇష్టపడని వాళ్లు ఉంటారా? 'శతమానం భవతి' సినిమాలో మరదలు అంటే మీలా ఉండాలి అనేలా చేశారు. 'అఆ' సినిమా, 'శతమానం భవతి', 'ఉన్నది ఒక్కటే జిందగీ', 'హలో గురు ప్రేమ కోసమే' ఎలాంటి సినిమాలు తీశారండి. 'హలో గురు ప్రేమ కోసమే'లో కాఫీ సీన్ మీరా, కాదా? అని మేమే టెన్షన్ పడ్డాం. అలాంటిది మీరు ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారండి? 'రౌడీ బాయ్స్', 'టిల్లు - 2' ఎందుకండి ఇలాంటి సినిమాలు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారిని ఎంతలా గౌరవించాం. మిమ్మల్ని కూడా అలానే అనుకున్నాం. దయచేసి ఎలాంటి సినిమాలు తీయకండి. మంచి క్యారెక్టర్లు చేయండి'' అంటూ ఒక అనుపమ అభిమాని, ఆటో డ్రైవర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. దాన్ని మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
#TilluSquare ట్రైలర్ చూసి గుండె పగిలిన @anupamahere అభిమాని, తన బాధ చెప్పుకున్నాడు. pic.twitter.com/Wnc4yRB1oA
— Actual India (@ActualIndia) February 18, 2024
గ్లామర్ డోస్ పెంచిన అనుపమా..
‘టిల్లు స్క్వేర్’ లో లిల్లీ పాత్రలో నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్. ‘టిల్లు స్క్వేర్’లో హాట్ హాట్ సీన్లలో అలా ఒదిగిపోయింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో అనుపమ మాటలు, చేతలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. లిప్ లాక్ సీన్లతో అరాచకం సృష్టించింది ఈ భామ. సిద్ధుతో కలిసి కిస్సింగ్ సీన్లను అవలీలగా చేసేసింది. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అయిన ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో కూడా అనుపమ లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయింది. అభిమానులు ఈ సినిమాలో ఆమెను అలా చూసి అవాక్కయ్యారు. ఇక ఇప్పుడు డోస్ పెంచింది అనుపమా. సిద్ధూ, అనుపమా రొమాన్స్ చూసిన ఆడియెన్స్ ఇప్పుడు మరింత షాకయ్యారు. అనుపమ ఒక్కసారిగా ఇలా మారిపోయింది ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇప్పుడు ఆ అభిమాని ఆవేదన చూస్తే.. పాపం ఎంత కష్టమొచ్చిందో అనుపమా అభిమానులకు అనిపిస్తోంది.
Also Read: 'యానిమల్'కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు - ఆ ముగ్గురికి అంకితమిచ్చిన రణబీర్, సందీప్‌పై ప్రశంసలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)