Bigg Boss 8 Telugu: నిఖిల్‌కు స్పెషల్ ఎగ్... హద్దులు దాటి చీప్ గేమ్ ఆడిన కంటెస్టెంట్స్, రెడ్ కార్డ్ ఎవరికి?
తాజాగా బిగ్ బాస్ హౌస్ లఓ నిఖిల్ క్లాన్ శక్తి గెలుచుకున్న రెడ్ ఎగ్ స్పెషల్ పవర్ ఏంటో తెలుసా? అసలు హౌజ్ లఓ రెడ్ కార్డ్ ఎవరికి ఇవ్వాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ప్రభావతి 2.0 టాస్క్ పెట్టిన రచ్చ నడుస్తోంది. హౌస్ మేట్స్ దారుణంగా ఒకరినొకరు కొట్టుకొని మరీ గేమ్ ని గెలవడానికి ట్రై చేశారు. అయితే మొత్తానికి ఆట పూర్తయ్యేసరికి నిఖిల్ టీం విన్ అయింది. మరి ఈ గేమ్ లో చీప్ గేమ్ ఆడింది ఎవరు? ఎవరికి రెడ్ కార్డ్ ఇవ్వాలి? అసలు ఆ రెడ్ ఎగ్ ప్రత్యేకత ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.
రెడ్ కార్డ్ ఎవరికి?
డే 18 ఎపిసోడ్లో చాలామంది నోరు జారారు. ప్రేరణ కంబం, విష్ణు ప్రియ, పృథ్వి, నబిల్ ఆ లిస్ట్ లో ఉన్నారు. ప్రేరణ ఏకంగా "క్యారెక్టర్ లెస్" అని విష్ణు ప్రియని తిడితే, "నువ్వు పతివ్రతవు" అంటూ విష్ణు ప్రియ ఫైర్ అయింది. ఇక పృథ్వి వయోలెంట్ గా గేమ్ ఆడడమే కాకుండా కన్నడ, ఇంగ్లీషులో నోటికొచ్చినట్టుగా తిట్టేశాడు. యష్మి గౌడ, ప్రేరణ కంబం రెచ్చగొట్టి ఆడడమే స్ట్రాటజీగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఎవరినో ఒకర్ని రెచ్చగొడుతూ గేమ్ ఆడారు. యష్మి గౌడ, సోనియా ఇద్దరూ ఫిజికల్ అయ్యారు. ఇక మరోవైపు కాంతారా టీం చీఫ్ ఏకంగా బిగ్ బాస్ పై నోరు జారాడు. బిగ్ బాస్ కిచెన్లో ఒక కొత్త రూల్ పెట్టారు. కిచెన్ లో ఒక్క టైంలో ఒక్క వంట చేయాలని, పైగా దానికి సంబంధించి ముగ్గురే కిచెన్లో ఉండాలని, కూరగాయలు కోయడం కూడా కౌంట్లోకి వస్తుందని రూల్ పెట్టారు. దీంతో "మనిషి పుట్టుకే పుట్టారా అసలు.. ఈ రూల్స్ ఎవడు రాస్తున్నాడురా.. అంత మందికి ముగ్గురే ఎలా వండుతారు రా దిమాక్ లేదా? తినడానికి టాస్క్ లు పెడుతున్నారా ?తినకుండా ఉండడానికి పెడుతున్నారా" అంటూ అభయ్ ఫైర్ అయ్యాడు. అక్కడితో ఆగకుండా "నేను ఇలాగే ఉంటా. హౌస్ లో ఉంచాలంటే ఉంచండి. లేకపోతే పీకేయండి" అంటూ గట్టిగానే స్వరం వినిపిస్తున్నాడు. మరి ఇంత మందిలో ఈ వీక్ నాగార్జున ఎవరికి రెడ్ కార్డ్ ఇస్తారు అనేది చూడాలి.
రెడ్ ఎగ్ ఉపయోగం ఏంటంటే?
ప్రభావతి 2.0 టాస్క్ లో చివరగా గెలిచింది నిఖిల్ క్లాన్ శక్తి టీం. అయితే వీళ్ళకి ఒక స్పెషల్ రెడ్ కలర్ ఎగ్ దొరికింది. నిజానికి అక్కడ గేమ్ మొత్తం అయిపోయాక సైలెంట్ గా వేశారు. దాన్ని ఎవ్వరూ చూడలేదు. ఒక్క నిఖిల్ తప్ప. మొత్తానికి టీంను అడిగి ఆ ఎగ్ ను తీసుకొని, దాచుకున్నాడు నిఖిల్. మరి ఎగ్ స్పెషాలిటీ ఏంటంటే నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ కాకుండా కాపాడే ఛాన్స్ ఉండొచ్చు. లేదంటే స్పెషల్ రేషన్, టాస్క్ లలో ఏమైనా మార్పులు, చేర్పులు వంటి వాటికోసం ఆ స్పెషల్ ఎగ్ పవర్ ని ఉపయోగించుకునే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ వస్తే నిఖిల్ పృథ్వి లేదా అభయ్ లలో ఎవరినో ఒకరిని కాపాడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అభయ్ సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు కాబట్టి అతన్ని కాపాడొచ్చు.