Prema Entha Madhuram September 26th: ఆర్య సహాయంతో ఉట్టిని కొట్టిన అక్కి - అనుని చూసిన ఆర్య!
గుడిలో ఆర్య అనుని చూసేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema entha madhuram september 26th: గుడిలో పిల్లలందరూ కృష్ణుడి పాటలకు డాన్సులు వేస్తూ ఉంటారు.
నీరజ్: అందరూ చాలా బాగా డాన్స్ వేశారు
అక్కి: మరి గిఫ్ట్ ఇస్తారా?
అంజలి: అప్పుడే ఎలా ఇస్తాము. అసలు కృష్ణాష్టమి అంటేనే ఉట్టిని కొట్టడం అని ఉట్టిని ఏర్పాటు చేస్తారు. అక్కి, అభయ్ ఉట్టిని ఎంత కొట్టడానికి ప్రయత్నించినా సరే అంజలి దాన్ని పైకి లాగుతూ ఉంటుంది.
అక్కి: ఇలా కాదు ఆగండి మీ పని చెప్తాను అని వెళ్లి ఆర్య ని తీసుకొస్తుంది.
అక్కి: చూడు ఫ్రెండ్ వీళ్ళు నాకు ఉట్టిని అందకుండా చీటింగ్ చేస్తున్నారు. నువ్వు ఎలాగైనా నాతో ఉట్టిని కొట్టించు అని అనగా ఆర్య అక్కి నీ ఎత్తుకుంటాడు. అప్పుడు అక్కి ఉట్టిను కొడుతుంది. ఈ దృశ్యాన్ని ఒక మూల నుంచి చూసిన అను ఆనందిస్తుంది.
ఆ తర్వాత ఆర్య తన నుదుటిమీద పడిన పేపర్ ముక్కలను తుడుచుకోవడానికి అని అద్దం దగ్గరకు వెళ్తాడు. అప్పుడు అద్దం వెనుక నుంచి అను ముసుగు వేసుకుని ఉండడాన్ని చూస్తాడు.
వెంటనే వెనక్కి తిరిగి అను అనే లోగా అను ఆర్య ని చూసి అక్కడ నుంచి పారిపోతుంది. అప్పుడు ఆర్య అనుకోసం అరుస్తూ వెతుకుతూ ఉంటాడు. అను ఒక మూలన దాక్కుతుంది. ఇంతలో జెండే వాళ్ళు అక్కడికి వస్తారు.
Also Read: సలహా వినకుండా సమస్యలో చిక్కుకున్న సుమన, కౌంటర్ ఇచ్చిన విక్రాంత్!
జెండే: ఏమైంది ఆర్య?
ఆర్య: అనుని చూసాను. గుడి దగ్గరే అద్దం వెనుక నుంచి కనిపించింది కాని వెతికితే దొరకడం లేదు అని అనగా అంజలి, నీరజ్ లు కూడా వెళ్లి గుడంతా వెతుకుతారు కానీ ఎంత వెతికినా అను ఎవరికీ కనిపించదు.
నీరజ్: దాదా గుడంతా వెతికాము వదినమ్మ ఎవరికీ కనిపించలేదు
జెండే: అను గురించి ఆలోచిస్తూ దృష్టింతా అటువైపే పెట్టుకుంటే అను వచ్చినట్టు బ్రమపడినట్టున్నావు ఆర్య
ఆర్య: లేదు నేను భ్రమ పడలేదు. అను కచ్చితంగా ఉన్నది ఆ రిజిస్టర్ బుక్ తీసుకురా అని జెండే తో అనగా జెండే బుక్ ని తెస్తాడు. ఆ రిజిస్టర్లో ఎంత వెతికినా అను అనే పేరు కనిపించదు ఆ రిజిస్టర్ ని గట్టిగా నేలకేసి కొడతాడు.
అంజలి: బాధపడకండి సార్ ఆ దేవుడు మిమ్మల్ని అనుని మళ్లీ ఒకటి చేస్తాడు.
ఆర్య: ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఇన్ని రోజులు ఏమైపోయాడు? దేవుడు లేడు అనుకుని ఉన్న కాలం అంతా నేను సంతోషంగా బ్రతికాను. కానీ అనువచ్చి ఈయన మీద నాకు నమ్మకాన్ని పెంచింది. అప్పటి నుంచి నా జీవితంలో ఉన్న ఆనందమంతా వెళ్ళిపోయింది.
నువ్వు కూడా ఒక తల్లికి పుట్టి ఇంకొక తల్లి దగ్గరే పెరిగావు కదా?వసుదేవుడి బాధ నీకు తెలియదా? ఎందుకు మాతో ఇలా ఆడుకుంటున్నావు? ఇంకెన్ని రోజులు ఆడుకుంటావు.
రాధ దూరమైనప్పుడు నువ్వు ఎంత బాధ పడ్డావో తెలీదు కానీ అనురాధ నాతో లేనప్పుడు మాత్రం నా ప్రాణం నాలో లేనట్టే ఉంటుంది. ఇంకెన్ని రోజులు మాకీ క్షోభ అని ఎదురుగా ఉన్న కృష్ణుడు బొమ్మతో బాధగా చెప్తాడు ఆర్య. దాని తర్వాత కొంతసేపటికి నలుగురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
Also Read: విక్రమ్-జానూ వేషాలు, దివ్య ఫైర్, తులసికి రత్నప్రభ స్వీట్ వార్నింగ్!
ఈ దృశ్యాన్ని అంతటినీ చూస్తున్న అను ఏడుస్తూ ఉంటుంది.
అను: ఇంకా ఎక్కువసేపు ఉంటే ప్రమాదం వెంటనే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా తన కాళ్ల పట్టి గుడిలో పడిపోతుంది. కొంతసేపటి తర్వాత ఆర్య అటువైపు వచ్చి ఆ పట్టీని చూస్తాడు. అద్దంలో అనుని చూసినప్పుడు తనకి ఈ పట్టి ఉండడాన్ని గమనిస్తాడు.
ఆర్య: నువ్వు ఇక్కడ లేవు అని ఎంతమంది నన్ను నమ్మించినా నేను నమ్మను అను. నా కళ్ళు నన్ను మోసం చేయొచ్చు కానీ నా మనసు నన్ను ఎప్పటికీ మోసం చేయదు. నువ్వు ఈ గుడికి వచ్చావు అన్నది నిజం, నాకు కనిపించింది నువ్వే అన్నది కూడా నిజం అని అంటాడు ఆర్య. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది..
Join Us On Telegram: https://t.me/abpdesamofficial