Trinayani September 26th: సలహా వినకుండా సమస్యలో చిక్కుకున్న సుమన, కౌంటర్ ఇచ్చిన విక్రాంత్!
విశాలాక్షి ఎంత చెబుతున్నా వినకుండా బయటికి బయలుదేరిన సుమనకి తగిన శాస్తి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Trinayani September 26th Written Update: త్రినాధుడే నా వాడు. నాకు తెలియనిది ఏమైనా ఉందా? అని విశాలాక్షి అంటుంది.
నయని: అయితే ఇప్పుడు సుమనకి ప్రమాదం ఉన్నదా?
తిలోత్తమ: సుమనకి ప్రమాదం ఉందంటే నేను నమ్మను. ఎందుకంటే బొట్టు పెట్టుకోకుండా వెళ్తే తన భర్త అయిన విక్రాంత్ కు ప్రమాదం ఉంటుంది కానీ సుమనకి ఎందుకు ఉంటుంది?
హాసిని: అసలు చిట్టి బొట్టు ఎందుకు పెట్టుకోలేదో కనుక్కోండి ముందు
సుమన: కావాలనే పెట్టుకోలేదు
దురంధర: కుంకుమ బొట్టు సౌభాగ్యమే. దాన్ని వదులుకోవాలనుకుంటున్నావా?
సుమన: చెక్ డిపాజిట్ చేస్తే నేను కోటీశ్వరులు అవుతాను మరి సౌభాగ్యం ఎందుకు దూరమవుతుంది?
నయని: డబ్బుతో సౌభాగ్యం వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా చెల్లి
తిలోత్తమ: ఇవన్నీ కాదు సుమన, నేను పాపను చూసుకుంటాను నువ్వు ముందు బ్యాంకుకు బయలుదేరు
విశాలాక్షి: తల్లి ఎక్కడ ఉంటే పిల్ల కూడా అక్కడే ఉండాలి నుదుటిన కుంకుమ పెట్టుకుని ఉలూచిని తీసుకుని వెళ్తే మంచిది
సుమన: ఇప్పుడు ఉలూచి నీ తీసుకొని వెళ్లడం ఎందుకు? తనకోసం పాలు డబ్బాలన్నీ పట్టుకోవాలి ఇప్పుడు
నయని: తల్లిపాలు ఇవ్వు
సుమన: మానేసాను
హాసిని: అదేంటి చిట్టి పుండరీనాదం పుట్టి సంవత్సరమైనా సరే నేను ఇంకా తల్లిపాలు పెడుతున్నాను. పాప పుట్టి పక్షం కూడా కాలేదు అప్పుడే పాలు ఇవ్వడం మానేశావా?
దురంధర: చూశారా నేను ముందే చెప్పాను ఈ పాప వస్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది అని ఇప్పుడు అదే గొడవ జరుగుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఉలూచి ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో సుమన - ప్రాణాలకు ప్రమాదం?
తిలోత్తమ: నువ్వు వెళ్ళు సుమన పాపను నేను చూసుకుంటాను
విశాలాక్షి: ఎలా చూసుకుంటావో? చూసుకోవాలంటే నువ్వు మోయగలగాలి కదా ఇంకొక్క నిమిషం ఆ పాపను నీ ఒళ్ళు మోయడానికి ప్రయత్నించు
వల్లభ: మా అమ్మ వెయిట్ లిఫ్టర్ 80 కేజీల బరువుని కూడా అవలీలగా ఎత్తేస్తుంది. కానీ ఇంతలో తిలోత్తమకి చేతిలో ఉన్న పాప బరువుగా అనిపించి కొంచెం సేపటికి ఎంత ప్రయత్నించినా ఎత్తుకోలేక ఉలూచీని కింద పడేయబోతుంటే విశాల్ వచ్చి పట్టుకుంటాడు.
తిలోత్తమ: ఈ విశాలాక్షి ఎదో కుట్ర పన్నింది
విశాలాక్షి: అందుకే చెప్పిన మాట వినాలి. ఈ కుంకుమ పెట్టుకుని పాపని తీసుకుని వెళ్తే మంచే జరుగుతుంది సుమన అని చేతిలో ఉన్న కుంకుమని సుమనకి ఇస్తుంది విశాలాక్షి. అప్పుడు సుమను కోపంతో విశాలాక్షి చేతిలో ఉన్న కుంకుమని నేలపాలు చేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడు విశాలాక్షి మాయ చేయగా పైన ఉన్న ఒక వస్తువు సుమన నెత్తి మీద వచ్చి పడుతుంది. దానికి సుమన నుదుటిపై నుంచి రక్తం వస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. నయని వెంటనే నుదుటిన మందు రాసి బ్యాండేజ్ కడుతుంది.
నయని: విశాలాక్షి చెప్పిన మాట ముందే వినుంటే ఇదంతా వచ్చేదే కాదు
దురంధర: నీటిగా కుంకుమ పెట్టుకుని ఉంటే ఈపాటికి చెక్కును వెళ్లి డిపాజిట్ కూడా చేసే దానివి
తిలోత్తమ: ఏం పర్వాలేదు డిపాజిట్ చేయడానికి మూడు నెలలు గడువు ఉంటుంది. నొప్పిగా ఉన్నట్టున్నది రెస్ట్ తీసుకో
సుమన: అయినా ఇదంతా మా అక్క వాళ్ళే వచ్చింది. నాకు ప్రమాదం వస్తున్నప్పుడు ముందే చూసి చెప్పాలి కదా కావాలనే చెప్పలేదు
నయని: నాకు నిజంగా ఏమీ కనిపించలేదు చెల్లి కనిపిస్తే నేను చెప్తాను కదా
విశాలాక్షి: ఏమీ తెలియని నయనమ్మని ఎందుకు అనడం? నా కుంకుమని నేలపాలు చేసినందుకు తగిన శాస్తి జరిగిందనుకోవచ్చు కదా! కుంకుమ జల్లిన నీళ్లను నుదుట మీద వేస్తే నొప్పి తగ్గుతుంది అని అంటుంది విశాలాక్షి. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సీన్లో విశాల్ బాల్కనీలో ఉండగా గాయత్రిని పట్టుకొని నయనీ అక్కడికి వస్తుంది.
Also Read: ముకుందకి చుక్కలు చూపిస్తున్న కృష్ణ- కొడుకు మీద చెయ్యెత్తిన రేవతి!
విశాల్: విశాలాక్షి కుంకుమ గురించి అలా చెప్పినప్పుడు నాకు కూడా నీ నుదుట మీద కుంకుమ పెట్టాలనిపిస్తుంది నయని
నయని: అవును బాబు గారు నుదుటిన మూడవ కన్ను ఉంటుంది అంటారు. అది కుంకుమ పెడితేనే దేవుడినీ మనతో కలుపుతుంది. శివ భక్తులు వైష్ణ భక్తులు అందరూ నుదుట మీద నామాలు పెట్టి కుంకుమ పెడతారు. ఎందుకంటే విష్ణుభక్తులు రెండు నామాలను విష్ణువు రెండు పాదాలుగా భావించి మధ్యలో ఉన్న కుంకుమని లక్ష్మీదేవిగా భావిస్తారు. అని అనగా అప్పుడు విశాల్ నయనీ కి కుంకుమ పెడతాడు.
విశాల్: పాపం సుమన తలనొప్పిగా ఉన్నట్టుంది బాధపడుతుంది
నయని: మీరు దాని గురించి ఏం బాధపడొద్దు బాబు గారు. బాలవాక్కు దైవవాక్కు అంటారు. అందులోని విశాలాక్షి శివ భక్తురాలు ఏం చెప్తే అది జరుగుతుంది. అంత హెచ్చరించినా కూడా మాట వినకుండా ఏరికోరి సమస్యను తెచ్చుకుంది ఇంక వదిలేయండి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది
ఆ తర్వాత సీన్లో సుమను అద్దంలో తన ముఖం చూసుకుంటూ ఉంటుంది. పక్కనే ఉలూచి ఏడుస్తుంది. ఇంతలో విక్రాంత్ అక్కడికి వస్తాడు.
విక్రాంత్: ఏంటి పాప ఏడుస్తుందనీ నువ్వు కూడా ఏడుస్తున్నావా?
సుమన: అందుకు కాదు అందమైన నా నుదుటి మీద అందవికారంగా ఈ ప్లాస్టర్ ఉంటే ఏ మొఖం పెట్టుకుని నేను బ్యాంకుకు వెళ్తాను. నా అందమంతా పాడైపోయింది
విక్రాంత్: ఇదంతా నువ్వు ఏరికోరి చేసుకున్నదే. ఆ విశాలాక్షి చెప్పిన మాటేదో ముందే విని కుంకుమ పెట్టుకొని పాపం తీసుకొని వెళ్తే ఈపాటికి పని కూడా అయిపోయేది నువ్వే కోరిండి సమస్యను తెచ్చుకున్నావు
సుమన: నేను నొప్పితో ఉంటే నన్ను పరామర్శించకుండా తిడతారేంటి? నా అందమైన మొఖాన్ని చూస్తే కనీసం చలనం కూడా రావడం లేదా
విక్రాంత్: అసలు నువ్వు అందంగా ఉంటావని ఎవరు చెప్పారు?
సుమన: మీరు తప్ప అందరూ చెప్తారు
విక్రాంత్: ముందు నేను చెప్పేది వింటావా?
Join Us On Telegram: https://t.me/abpdesamofficial