Prema Entha Madhuram September 20th: ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన అంజలి - పెళ్లిరోజు ఆలోచనల్లో అను ఆర్య !
అంజలి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆర్య చూడడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema entha madhuram september 20th: ఛాయాదేవి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో అను నిద్ర నుంచి ఉలిక్కిపడి లేస్తుంది. అప్పుడు అక్కీ అనుకి నీళ్లు ఇస్తుంది.
అభయ్: కలలోకి గోస్ట్ వచ్చిందా అమ్మ. నేను సూపర్ హీరోలా వచ్చి ఆ గోస్ట్ ని చంపేస్తాను,నువ్వు భయపడకు.
అక్కి: నేను నీకు ఒక కథ చెప్పనా అని దెయ్యం కదా చెప్పడం మొదలు పెడుతుంది అక్కి.
అభయ్: ఇప్పటికే అమ్మ భయపడుతోంది నువ్వు మళ్ళీ దెయ్యం కథలు చెప్పొద్దు. ఈసారి అమ్మకు నేను ఒక పాట పాడి పడుకోబెట్టిస్తాను అని అభయ్ పాట పాడుతుండగా అను అభయ్ ఒడిలో పడుకుంటుంది. పక్కనే అక్కికి కూడా పడుకుంటుంది.
ఆ తర్వాత సీన్లో నీరజ్ అంజలీలు వాళ్ల గదిలో ఉంటారు. నిరజ్ పడుకుని ఉండగా అంజలి మాత్రం మాన్సి చెప్పిన విషయాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.
అంజలి: అను,పిల్లలు ఇంట్లో అందరి మధ్య ఆనందంగా ఉండాలి అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. నేను వెళ్ళిపోతే ఆనుకి ఆనందం వస్తుంది. ఐ యాం సారీ నీరజ్ అని మనసులో అనుకొని లగేజ్ పట్టుకొని గదిలో నుంచి హాల్లోకి వస్తుంది.ఇంటి బయటికి వెళ్దాం అనగా వెనక నుంచి ఆర్య చూసి అంజలి నీ ఆపుతాడు.
Also Read: ఛాయాదేవికి ఆర్య వార్నింగ్ అదిరింది, అంజలిని ఇంట్లోంచి వెళ్లిపోమన్న మాన్సీ!
ఆర్య: ఏం జరుగుతుంది అంజలి? చేతిలో లగేజ్ ఏంటి? అని అడగగా ఆ మాటలకి నీరజ్ కూడా లేచి ఏం జరుగుతుందో అని బయటకు వచ్చి చూస్తాడు.
నీరజ్: ఏంటి అంజలి ఈ టైంలో లగేజ్ పట్టుకొని ఉన్నావు? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు
ఆర్య: తప్పు చేస్తున్నావ్ అంజలి. అసలు ఏం జరిగింది? మాన్సి వచ్చిన తర్వాత నుంచి ఏదో తప్పు జరుగుతుందని నాకు తెలుస్తుంది నిజం చెప్పు
అంజలి: నేను ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అప్పుడే అను ఇంటికి వస్తుంది. అను ఆనందం కోసం నేను వెళ్ళిపోవాలి.
ఆర్య: తప్పు చేస్తున్నావ్ అంజలి. మాన్సి ఎలాంటిదో తన బుద్ధి ఏంటో నీకు తెలుసు. ఒకవేళ అను ఎక్కడున్నాదో మాన్సికి తెలిసినా సరే అను ఇక్కడికి రావడానికి ఒప్పుకోదు. ఒక పని చేసే ముందు ఎవరికి లాభాలు వస్తున్నాయో నష్టపోతున్నారు అని లెక్క వేసుకొని చేయు ఇంకెప్పుడు ఇలా చేయకు. నీరజ్ తనని లోపలికి తీసుకొని వెళ్ళు అని అనగానే లోపలికి తీసుకొని వెళ్తాడు నీరజ్.
ఆ తర్వాత సీన్లో అను దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది.
అను: స్వామి ఈరోజు మా పెళ్ళి రోజు. ప్రతి సంవత్సరం మేమిద్దరం కలిసి పూజ చేస్తాము కానీ ఆ అదృష్టం నాకు లేకుండా మా ఇద్దరినీ విడదీసేసావు. ఇప్పటికైనా నేను నిన్ను అడిగేది ఒకటే. నా సౌభాగ్యం చల్లగా ఉంటే చాలు ఇంకేమీ వద్దు అని దండం పెడుతుంది. ఇంతలో పిల్లలు ఇద్దరు అనుని హాల్లోకి పిలుస్తారు. అక్కడ పువ్వులతో హ్యాపీ యానివర్సరీ అని రాస్తారు.
Also Read: చిన్నారిగా మారిన పాముపిల్ల - షాక్ లో సుమన !
అను: ఈ విషయం మీకు ఎలా తెలుసు?
అక్కి: ఇందాక మేము బయటికి వెళ్తే పంతులుగారు కనిపించారు. ఈ రోజు నీ పెళ్లి రోజు కదా అర్చన చేయిస్తాను అన్నావట కదా దానికోసం సామాన్లు ఏమీ తేవద్దు, ఆయనే తెచ్చుకుంటారట కరెక్ట్ టైం కి రమ్మన్నారు.
అభయ్: హ్యాపీ యానివర్సరీ అమ్మ అని చెప్పి ఒక చాక్లెట్ ని అనుకి ఇస్తాడు.
అక్కి: ఈ టైంలో నాన్న కూడా మనతో ఉంటే బాగుంటుంది కదా
అభయ్: ఈ విషయం గురించి మాట్లాడొద్దు అని నీకు చెప్పాను కదా అక్కి
అక్కి: వెడ్డింగ్ యానివర్సరీ అంటే అమ్మానాన్న ఇద్దరికీ స్పెషల్ కదా అందుకే అలా అన్నాను రా అన్నయ్య. అయినా పర్లేదు అమ్మ ఈరోజు నీకు స్పెషల్ కదా నాకు చైనీస్ నూడిల్స్, రసగుల్లా అన్ని చేయవా
అభయ్: ఈరోజు అమ్మకి నచ్చిన వంటకాలు చేయాలి నీకు నచ్చినవి కాదు.
అక్కి: మనకు ఏది ఇష్టమో అమ్మకి అదే ఇష్టం కదా. అయినా నాకు నచ్చినవన్నీ తింటాను అని నీకు కుళ్ళు రా కోతి
అభయ్: నన్ను కోతి అంటావా నువ్వే పంది అని వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడు అను ఆర్య అక్కడికి వచ్చినట్టు ఆర్య పిల్లలతో ఆడుకుంటున్నట్టు ఊహించుకుంటుంది. అక్కి ఆర్యవైపు ఉండగా అభయ్ అనువైపు ఉంటుంది.
అభయ్ అక్కిలు కొట్టుకుంటూ ఉండగా వాళ్ళని చూసి అభయ్ ని సపోర్ట్ చేస్తూ అను, అక్కిని సపోర్ట్ చేస్తూ ఆర్య ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పిల్లలు ఇద్దరూ పక్కకు వెళ్లి స్వీట్లు తింటారు. మన ఇద్దరినీ గొడవలో దింపి వాళ్ళిద్దరూ ఎలా పక్కకి వెళ్లిపోయారని ఆర్య అనులు అనుకుంటారు. ఈ దృశ్యాన్ని అంతటినీ ఊహించుకొని అను బాధపడుతుంది.
ఆ తర్వాత సీన్లో తన పెళ్లి పుస్తకాన్ని చూసి ఆర్య అను తో తన జీవితంలో జరిగిన విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది..
Join Us On Telegram: https://t.me/abpdesamofficial