అన్వేషించండి

Trinayani September 20th Episode: చిన్నారిగా మారిన పాముపిల్ల - షాక్ లో సుమన !

తెల్లవారగానే పాము మనిషిలా మారడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Trinayani September 20th Written Update: ఇప్పటికీ కూడా పాము మళ్లీ మనిషిలా మారితే ఆస్తి వస్తుందని ఆనందమే చిట్టి కళ్ళల్లో కనిపిస్తుంది అని హాసిని అంటుంది.

విక్రాంత్: పాము నిజంగా పాప లాగా మారుతుందా గురువుగారు?

స్వామీజీ: కచ్చితంగా మారుతుంది. ఇది విధి. తన రాత ఇంతే అనుకుని సుమన ఎంత త్వరగా నిజాన్ని తెలుసుకుంటే అంత మంచిది.

ఆ తర్వాత రోజు ఉదయం పవనమూర్తి ధురంధర ఇద్దరూ హాల్లోకి వస్తారు.

పవనమూర్తి: నేను ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేసినా నాకు చెమట ఎందుకు రావడం లేదు. ఎందుకో చెప్పు అల్లుడు అని విశాల్ నీ అడుగుతాడు.

విశాల్: మంచినీళ్లు తాగితే అప్పుడే చెమట వస్తుంది మావయ్య.

పవనమూర్తి: అయితే ఈరోజు రాత్రి నుంచి నీళ్లు కలపాలి.

హాసిని: వెనకటికి నీలాంటి ఒక్కడే పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది అని పళ్ళు కుళ్ళిపోయిన తర్వాత మందు తయారు చేస్తున్నప్పుడు తాగి ఇది కూడా మంచిదే కదా అని అడిగాడట బాబాయ్ అని అంటుంది. ఇంతలో అక్కడికి కుటుంబ సభ్యులందరూ వస్తారు. అందరికన్నా చివరన సుమన వస్తుంది.

Also Read: బిడ్డ పుట్టుకవెనుక గుట్టువిప్పిన పెద్దబొట్టమ్మ - పాముని గదిలో పెట్టి తాళం వేసిన సుమన!

తిలోత్తమ: సుమనా, తెల్లవారింది కదా వెళ్లి నీ గది తాళం తీసి అక్కడ ఉన్నది పామో పిల్లో చూసి రా

సుమన: అందులో చూడడానికి ఏముంది అత్తయ్య. రాత్రి నేను పెట్టింది పామును అయితే ఇప్పటికి పామే ఉంటుంది. ఒకవేళ పాపే ఉండుంటే ఇప్పటి ఏడుపు శబ్దాలుగాని ఏదో ఒక శబ్దం వస్తుంది కదా అక్కడ పాప లేదు చూసినా అనవసరం.

తిలోత్తమ: మరి పాప లేకపోతే నువ్వేం చేస్తావు?

సుమన: వెళ్లిన మా అక్క మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా పాప తిరిగి వచ్చేవరకు వదిలిపెట్టను ఇప్పుడే వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్తుండగా పాప ఏడుపు శబ్దం వినిపిస్తుంది.

స్వామీజీ: చూడు సుమనా పాప ఏడుపు శబ్దం వినిపిస్తుంది. ఇప్పుడు గదిలో పాప ఉందో లేదో చూసుకో అని అనగా వెంటనే సుమన డాబా మీదకి పరిగెడుతుంది.

హాసిని: రా పిన్ని మనం కూడా వెళ్లి సాక్ష్యంగా చూద్దాము లేకపోతే మా అత్త లాగ మాట మార్చేసే రకమై చిట్టి. అని చెప్పగా దురంధరతో పాటు హాసిని కూడా సుమన వెనుక పరిగెడుతుంది. పైకి వెళ్లి చూసేసరికి అదే ఉయ్యాలలో పాము స్థానంలో పాప ఉంటుంది. వెంటనే సుమన పాపని ఎత్తుకుంటుంది. అప్పుడు హాసిని, సుమన, దురంధర తిరిగి కిందకి వస్తారు. సుమన చేతిలో ఉన్న పాపని చూసి కుటుంబం సభ్యులందరూ ఆశ్చర్యపోతారు.

Also Read: కృష్ణ-మురారి దొంగ పోలీస్ ఆట, తింగరిపిల్ల అల్లరి చూసి రగిలిపోతున్న ముకుంద!

విక్రాంత్: చూసావా పాప తిరిగి వచ్చింది అనవసరంగా నయని వదిన మీద నిందలు మోపావు

సుమన: కంటే అప్పుడు తెలుస్తుంది. అయినా నా పాప పాము అంటే నేను నమ్మను

నయని: నువ్వే కదా చెల్లి తలుపుకి గెడ వేసి మరీ లోపల బంధించావు నమ్మను అంటే ఎలాగా?

స్వామీజీ: నాకు తెలుసు. రాత్రి తిరిగి పాప పాము అయ్యేంతవరకు సుమన నమ్మదని.

దురంధర: మరి ఎన్నాళ్ళు ఇలాగ అవుతుంది స్వామి?

స్వామీజీ: తల్లి బిడ్డల్లో ఏ ఒకరి రుణం తీరిపోయినా బిడ్డ పూర్తిగా పామయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. 

సుమన: ఇది నా బిడ్డ నేను ఎలా వదులుకుంటాను

విక్రాంత్: ఇప్పటికీ అయినా నీ బిడ్డ అని ఒప్పుకున్నావు సంతోషం.

సుమన: నేను పాప గురించి మాత్రమే చెప్తున్నాను, పాము గురించి కాదు.

స్వామీజీ: ఒకరోజులో రెండు రూపాయలు మారే ఈ చిరంజీవిని జాగ్రత్తగా చూసుకోవాలి.

దురంధర: ఇన్ని రోజులూ నయనీ పిలిస్తేనే పాము వచ్చేది ఇప్పుడు రాత్రి అయితే చాలు ఇంట్లోనే ఒక పాము ఉంటుంది.

డమ్మక్క: సుమన నువ్వు ఈరోజు నుంచి సర్పాన్ని పెంచే బాధ్యతలు కూడా మోయాలి

సుమన: నేను మోసేది ఏమైనా ఉంటే అది ఈ ఆస్తి, ఐశ్వర్యాలు మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత గురువుగారు నువ్వేం కోల్పోకుండా ఉంటే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి నయనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

ఆ తర్వాత సీన్లో సుమన బిడ్డకి పాలు తయారు చేస్తూ ఉండగా విక్రాంత్ అక్కడికి వస్తాడు.

విక్రాంత్: ఆ పాలు ఎవరికీ?

సుమన: ఇంకెవరికి పాపకే అని పాపకి పాలు పడుతూ ఉండగా వెంటనే ఆ పాల గ్లాసును నేలకేసి కొడతాడు విక్రాంత్.

సుమన: ఎందుకు పాలని పాడు చేశారు?

విక్రాంత్: లేకపోతే మరేం చేయమంటావు? తల్లిపాలు ఉండగా ఇవన్నీ ఎందుకు ఒకవేళ తల్లిపాలు లేకపోతే ఆవుపాలైనా పెట్టాలి. అవి కూడా పట్టకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రికాషన్ తీసుకొని పాలు పెట్టాలి అంతేగాని డబ్బా పాలు పెట్టకూడదు.

సుమన: గోపాల్ అయితే మాత్రం చులకన ఏంటి 800 రూపాయలు పైగా ఉంటుంది దీని ధర.

విక్రాంత్: ఆపు నీ మాటలు మర్యాదగా పాపకి పాలు పట్టు.

సుమన: అలాగే ఒకరోజు పట్టాను అది కక్కిందో మింగిందో తెలియదు గానీ మా అక్క మాత్రం బాగా వాడుకున్నది ఆ పాలని.

విక్రాంత్: అందుకే ఎప్పుడూ వదిన మీద ఏడుస్తావు. ఇప్పుడు పాలు పడతావా పట్టవా?

సుమన: సరే అంతలా అరవద్దు బయటికి వెళ్ళండి నేను పడతాను అని బలవంతంగా విక్రాంత్ ని బయటికి పంపిన తర్వాత నేనెందుకు నా పాలు పడతాను అని చెప్పి పాలను పట్టకుండా ఉండిపోతుంది సుమన.

ఆ తర్వాత సీన్లో పెద్ద గరిటని ప్లేట్ ని తీసుకొని వచ్చి హాసిని గట్టిగా శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి అందరూ హాల్లోకి వచ్చి చేరుతారు. ఎందుకలాగా శబ్దం చేస్తున్నావు అని అందరూ హాసినిని అడుగుతారు.

హాసిని: రేపు మన చిట్టిల పుట్టినరోజు ఘనంగా జరుపుకుందాము అని అనగా దానికి అందరూ ఆనందిస్తారు.

సుమన: నాకు ఇదేమి నచ్చడం లేదు. మీకు డబ్బులు ఉన్నాయి కనుక మీరు ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు నాకు ఆస్తిని ఎప్పుడు ఇస్తారు? అని అడుగుతుంది.  ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది

Also Read: ఒకే షో, రెండు ‘బిగ్ బాస్’ హౌస్‌లు - అదిరిందిగా ట్విస్ట్

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Embed widget