అన్వేషించండి

Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?

Drama Juniors Season 9: దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన సాయం, మంచి మనసు 'సుడిగాలి' సుధీర్ చెప్పడం వల్ల బయటకు తెలిసింది. 'డ్రామా జూనియర్స్ 9'లో చిన్నారి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అనిల్ రావిపూడి 'డ్రామా జూనియర్స్' చిన్నారి తల్లికి సాయం.
  • యాక్సిడెంట్ చికిత్స ఖర్చులు చెల్లించి, సుధీర్ బహిర్గతం చేశాడు.
  • చిన్నారి కంటతడి, 'తమ్ముడిని' అంటూ అనిల్ ఓదార్చారు.

అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లలోకి వెళితే కాసేపు హాయిగా నవ్వుకుని బయటకు రావచ్చు. నవ్వించడంలోనే కాదు... తనకు తెలిసిన వాళ్ళు బాధలో ఉన్నా సరే సాయం చేయడంలో ముందుంటారు అనిల్ రావిపూడి. బుల్లితెర సాక్షిగా మరోసారి ఆయన మంచి మనసు బయట పడింది. 'సుడిగాలి' సుధీర్ చెప్పడం వల్ల అందరికీ తెలిసింది.

'డ్రామా జూనియర్స్ 9'లో చిన్నారికి సాయం!
దర్శకుడిగా అనిల్ రావిపూడి వెరీ బిజీ. ఓ వైపు సినిమా షూటింగ్స్ చేస్తూ... మరో వైపు టీవీ షోలలో సందడి చేస్తున్నారు. 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'డ్రామా జూనియర్స్' సీజన్ 9 (Drama Juniors Season 9) షోలో అనిల్ రావిపూడి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read: Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

'డ్రామా జూనియర్స్' సీజన్ 9లో చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తున్న ఓ చిన్నారి తల్లికి యాక్సిడెంట్ అయ్యింది. అది అనిల్ రావిపూడికి తెలిసింది. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులను ఆయన చెల్లించారు. హాస్పిటల్‌లో ఉన్న ఆ చిన్నారి తల్లి ఫోటోలతో పాటు, ఇంటికి డిశ్చార్జ్ అయ్యాక బ్యాండేజ్ కాలితో అనిల్ రావిపూడికి ఆ తల్లి థాంక్స్ చెబుతున్న ఫోటో, వీడియోలను షోలో చూపించారు.

చిన్నారి కంటతడి... తమ్ముడిని ఉన్నానంటూ!
అనిల్ రావిపూడి సాయం గురించి సుధీర్ రివీల్ చేయడానికి ముందు స్టేజిపై ఆ చిన్నారి ఓ స్కిట్ చేసింది. అందులో అనిల్ రావిపూడిని 'తమ్ముడూ' అంటూ ఎంతో ప్రేమగా పిలిచింది. అది చూసి సుధీర్ ఫ్రస్ట్రేట్ కావడం వంటివి ప్రోమోలో హైలైట్ అయ్యాయి. ఆయన సాయం గురించి సుధీర్ వెల్లడించిన తర్వాత... ఆ చిన్నారి కంటతడి పెట్టుకుంది. చిత్రీకరణకు తన తల్లి రాలేదని ఎమోషనల్ అయ్యింది. అప్పుడు అనిల్ రావిపూడి ''తమ్ముడూ...' అని పిల్చావ్ కదా. అమ్మ లేకపోతే నేను ఉన్నాను కదా'' అని చెప్పారు. 

Also Read: Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?

'డ్రామా జూనియర్స్ 9'లో అఖిల్, భాగ్యశ్రీ సందడి!
ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు 'డ్రామా జూనియర్స్ 9' ప్రసారం అవుతోంది. ఈ వారం ఎపిసోడ్‌లో 'లెనిన్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో హీరోయిన్లు అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే సందడి చేయనున్నారు. వాళ్ళిద్దరినీ ప్రోమోలో చూపించారు. 

అనిల్ రావిపూడితో పాటు సీనియర్ హీరోయిన్, పొలిటీషియన్ రోజా, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ జడ్జీలుగా సందడి చేస్తున్నారు. ధన్యా బాలకృష్ణ సైతం ఈ షోలో సందడి చేస్తున్నారు. బుల్లితెరపై ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.

Also Read: The Odyssey Review - 'ది ఒడిస్సీ' రివ్యూ: క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

అనిల్ రావిపూడి ఎవరికి సాయం చేశారు?

'డ్రామా జూనియర్స్ 9'లో ఒక చిన్నారి తల్లికి యాక్సిడెంట్ అవ్వగా, ఆమె చికిత్స ఖర్చులను అనిల్ రావిపూడి భరించారు. ఆమె త్వరగా కోలుకోవడానికి సహాయం చేశారు.

అనిల్ రావిపూడి మంచి మనసు ఎలా బయటపడింది?

'డ్రామా జూనియర్స్ 9' షోలో ఒక చిన్నారి తల్లి చికిత్సకు సాయం చేయడం ద్వారా ఆయన మంచి మనసు బయటపడింది. 'సుడిగాలి' సుధీర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అనిల్ రావిపూడి ఏ టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు?

అనిల్ రావిపూడి 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'డ్రామా జూనియర్స్' సీజన్ 9 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన సినిమా షూటింగ్స్‌తో పాటు టీవీ షోలలో కూడా సందడి చేస్తున్నారు.

'డ్రామా జూనియర్స్ 9' ఎప్పుడు ప్రసారం అవుతుంది?

'డ్రామా జూనియర్స్ 9' ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు 'జీ తెలుగు'లో ప్రసారం అవుతుంది. ఈ షో బుల్లితెరపై ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget