దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గ్రీక్ జానపద కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన సాధారణంగా ఫ్యూచరిస్టిక్ సినిమాలు తీసినా, ఇది గ్రీక్ చరిత్రకు సంబంధించిన కథ. సినిమా మొత్తాన్ని ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారు.
The Odyssey Review - 'ది ఒడిస్సీ' రివ్యూ: క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఎలా ఉందంటే?
The Odyssey Review Telugu: క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో మెట్ డామన్ హీరోగా నటించిన సినిమా 'ది ఒడిస్సీ'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

- క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' గ్రీకు రాజు ఒడిస్సియస్ ఇంటి ప్రయాణం.
- సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, కొన్ని చోట్ల నిడివి ఎక్కువైంది.
- మాట్ డామన్ అద్భుత నటన, నోలన్ అభిమానులు తప్పకుండా చూడాలి.
Christopher Nolan The Odyssey Movie Review In Telugu: హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌కు ప్రపంచవ్యాప్తంగా బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అటువంటి దర్శకుడు గ్రీక్ జానపద కథ ఆధారంగా సినిమా తీశారు. మాట్ డామన్ ప్రధాన పాత్రలో 'ది ఒడిస్సీ' తెరకెక్కించారు. ఈ రోజు (జూలై 16న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముంబై జరిగిన స్పెషల్ ప్రీమియర్ షోను ఏబీపీ ప్రతినిధి అమిత్ భాటియా చూశారు. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ చదవండి.
కథ (The Odyssey Story Explained In Telugu): ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఇథాకాకు చెందిన గ్రీకు రాజు ఒడిస్సియస్‌కు ఇంటికి తిరిగి వెళ్ళడానికి పది సంవత్సరాలు పట్టింది. ఆ సుదీర్ఘ ప్రయాణ సమయంలో అతను ఎవరెవరిని కలిశారు? దారిలో ఏమైంది? అతని కుటుంబానికి ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ (The Odyssey Telugu Review): సాధారణంగా క్రిస్టోఫర్ నోలన్ ఫ్యూచరిస్టిక్ సినిమాలు తీస్తారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఆయన గ్రీక్ చరిత్రలో అంతర్భాగమైన, ప్రసిద్ధి చెందిన కథతో సినిమా చేశారు. అంతే కాదు... సినిమా మొత్తాన్ని ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారు. సినిమా ఎలా ఉంది? అనే విషయానికి వస్తే...
ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందీ 'ది ఒడిస్సీ'. ఫస్ట్ థింగ్ ఫస్ట్... టెక్నికల్ పరంగా 'హై స్టాండర్డ్స్'లో ఉంది. ముఖ్యంగా సౌండ్ డిజైన్ అద్భుతమని చెప్పాలి. సన్నివేశాలను నోలన్ చిత్రీకరించిన తీరు, ఆ సౌండ్ డిజైన్ కలిసి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్ళాయి. కొన్ని సన్నివేశాలను నోలన్ తీసిన తీరు సినిమా మేకింగ్ స్థాయిని పెంచాయి. కెమెరా వర్క్, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ - ప్రతిదీ బెస్ట్ అని చెప్పాలి.
గ్రీక్ జానపద చరిత్ర తెలిసిన ప్రేక్షకులకు కథలో కొత్తదనం ఏమీ ఉండదు. మన చందమామ కథలను చదివినట్టే ఉంటాయి. ఓ విధంగా మెజారిటీ ప్రేక్షకులకు ఈ కథ తెలుసు. అందువల్ల, కథనంతో - సన్నివేశాలతో మేజిక్ చేయాల్సిన పరిస్థితి. మేకింగ్ పరంగా నోలన్ రాజీ పడలేదు. కానీ, సినిమా నిడివి కొంచెం ఎక్కువ అయ్యిందని అనిపిస్తుంది. కొన్ని చోట్ల కథ చాలా నెమ్మదిగా ముందుకు సాగుతున్నట్లు, సన్నివేశాలను సాగదీసినట్లు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే... ఒడిస్సియస్ పాత్రకు మాట్ డామన్ జీవం పోశాడు. ఓ రాజును, ఓ భర్తను, ఓ తండ్రిని, తన కుటుంబంతో తిరిగి కలవాలని తపించే ఓ వ్యక్తిని ఆయన రూపంలో తెరపై చూస్తాం. పాత్రలో ప్రతి కోణాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. ఒడిస్సియస్ రాజు అంటే ఆయనే మనకు గుర్తుకు వస్తారు. టామ్ హాలండ్ కూడా అద్భుతంగా నటించారు. 'స్పైడర్ మ్యాన్'ను మర్చిపోయేలా, తెరపై కేవలం పాత్ర మాత్రమే కనిపించేలా చేశారు. ఒడిస్సియస్ రాజు భార్యగా అన్నా హాత్‌వే అందంగా కనిపించారు. అలాగే, నటించారు. ఆంటినస్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ సైతం అద్భుతమైన నటనను కనబరిచాడు. ద్విపాత్రాభినయం చేసిన లుపిటా న్యోంగో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.
The Odyssey Verdict: నోలన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'ది ఒడిస్సీ' ఓ మాస్టర్ పీస్. సినిమా నిడివి ఎక్కువ కావడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ప్రేక్షకులు అందరూ థియేటర్లలో తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.
రేటింగ్: 4/5
Before You Go
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Frequently Asked Questions
'ది ఒడిస్సీ' సినిమాను క్రిస్టోఫర్ నోలన్ ఎలా తీశారు?
'ది ఒడిస్సీ' సినిమా కథాంశం ఏమిటి?
ట్రోజన్ యుద్ధం తర్వాత గ్రీకు రాజు ఒడిస్సియస్ ఇంటికి తిరిగి రావడానికి పది సంవత్సరాలు పట్టిన ప్రయాణమే ఈ కథ. ఆ సుదీర్ఘ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సంఘటనలు, అతని కుటుంబానికి ఏం జరిగిందనేది సినిమా.
'ది ఒడిస్సీ' సినిమా సాంకేతికంగా ఎలా ఉంది?
ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా సౌండ్ డిజైన్, కెమెరా వర్క్, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ చాలా ఉన్నత ప్రమాణాల్లో ఉన్నాయి. నోలన్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ప్రత్యేక ఆకర్షణ.
'ది ఒడిస్సీ' సినిమాకు రేటింగ్ ఎంత? ఇది చూడదగ్గ చిత్రమా?
ఈ సినిమాకు 4/5 రేటింగ్ ఇచ్చారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది మాస్టర్ పీస్. నిడివి ఎక్కువైనా, ప్రేక్షకులు థియేటర్లలో తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.
ట్రెండింగ్ వార్తలు





















