అన్వేషించండి

Ammayi garu Serial Today October 31st: అమ్మాయి గారు సీరియల్: రూపకి క్యారెక్టర్ లేదు.. నువ్వు ఇంట్లోకి రావొద్దు.. రాజు మీద తిరగబడ్డ ఫ్యామిలీ!

Ammayi garu Today Episode రూప రాజుని పెళ్లి చేసుకుంది కానీ పట్టించుకోవడం లేదని విలువ ఇవ్వడం లేదని రాజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాజుతో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజుకి ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్తారు. సూర్యప్రతాప్‌తో రూప రాజు దగ్గర ఉంటానని అత్తయ్య వాళ్లు వచ్చే వరకు ఉంటాను అంటుంది. దానికి సూర్యప్రతాప్ జరుగుతున్న 
సంఘటనలు చూసి నిన్ను వదల్లేను అని చంద్ర ఉంటాడని చెప్తాడు. రాజు కూడా రూపని వెళ్లమని నాకు ఏం కాదు అని అంటాడు.

విజయాంబిక: మనసులో నా ప్లాన్ అంతా పోగొట్టేశాడు దొంగ సచ్చినోడు. ఆ బులెట్ ఏదో గుండెకు తగిలినా బాగున్ను చచ్చి ఊరుకునే వాడు.
గౌతమ్: ఛా ఆ సూర్యప్రతాప్‌ దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు దొరికిన వాడిని కాల్చేయకుండా మాట్లాడుతూ కూర్చొన్నారు. 
రేణుక: రూప ఉందని మీరే కాల్చలేదు.
గౌతమ్: రాజు గాడు ఉన్నాడనే కదా మీరు కాల్చలేదు.
జీవన్: ముగ్గురున్నారు మీ ముగ్గురుకు మరో తొమ్మిది మంది ఉన్నారు అయినా ముగ్గురిని వేయలేకపోయారు.
విజయాంబిక: మా తమ్ముడిని ఎంతో ఒప్పించి రప్పించాను సెక్యూరిటీ కూడా తగ్గించాను అయినా మీరు చంపలేకపోయారు.
దీపక్: ఇప్పుడు మనం బుక్ అయ్యేలా ఉన్నాం. ఇప్పుడు రాజు ఎంట్రీ ఇచ్చాడు. వాడు దీన్ని వదలడు. మన మీద ఏమాత్రం అనుమానం వచ్చినా మన పని అయిపోతుంది.
గౌతమ్: దీపక్ నువ్వు ఆ రైస్ పీస్ గాడికి మాస్టర్ పీస్ లా ఎలివేషన్ ఇవ్వకు.
జీవన్: మీరు ఇక ఆ ముగ్గురి మీద ఎలాంటి ప్లాన్స్ చేయొద్దు నేను చెప్పే వరకు ఏం చేయొద్దు.
రేణుక: జీవన్ నీకు రాజు గురించి తెలియదు. వాళ్ల విషయంలో రాజు ఎంత దూరం అయినా వెళ్తాడు.
జీవన్: అయితే వాళ్లని డైవర్ట్ చేయాలి.
విజయాంబిక: జీవన్ ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక మార్గం పింకి. ఇప్పుడు నీతో పింకీకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే అందరూ అయిపోతారు.
జీవన్: సూపర్ ఐడియా ఇది వెంటనే అమలు చేయాలి.

రూప రాజుతో తాను కలిసి ఉన్న ఫొటోలు చూస్తూ నువ్వు మా కోసం ఎంతో చేస్తున్నావ్ నేను నాన్న మాత్రం నీ కోసం ఏం చేయలేకపోతున్నాం. నువ్వు మా ఆర్మీ రాజు అని అంటుంది ఆ మాటలు సూర్యప్రతాప్‌ వింటాడు. నాన్న నీ ప్రేమని అర్థం చేసుకుంటారని ఎప్పటికైనా నాన్నే మనల్ని కలుపుతారని నేను నమ్ముతున్నానని రూప అంటుంది. అది విని సూర్యప్రతాప్‌ వెళ్లిపోతాడు. ఉదయం రాజు ఇంటికి వస్తాడు. అప్పలనాయుడు, ముత్యాలు అందరూ రాజుని గుమ్మం దగ్గరే ఆపేస్తారు. ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతారు. ఏమైందని రాజు అడిగితే అందరూ మూసుకుపోయిన కళ్లు తెరుచుకున్నాయని అంటారు. పెద్దయ్యగారిని, రూపని కాపాడాను అని రాజు చెప్తాడు. దానికి రాజు తల్లిదండ్రలు నీ ప్రాణాలు పణంగా పెట్టి కాపాడాల్సిన అవసరం లేదని నీ గురించి నిన్నటి నుంచి మాకు ఏం తెలియలేదని నీ కోసం ఇంటిళ్లపాది తిండి తిప్పలు మానేసి ఉంటే నీకు మాత్రం వాళ్లే ఎక్కువైపోయారని అంటారు. 

మీరు చెప్తే కదా వెళ్లాను అని రాజు అంటే రాజు చెల్లి అమ్మానాన్నలు వెళ్లొద్దని చెప్తే మానేసేవాడివా అని అంటే ఆ దేవుడు చెప్పినా ఆగను అంటాడు. నీకు ఏదైనా అయ్యే వరకు ఆ పెద్దయ్య గారు వదిలే లేరు అని ముత్యాలు అంటుంది. ఇంట్లో అందరూ పెద్దయ్య గారు నీ మంచి కోరుకోలేదని నీ నాశనం కోరుకున్నారని అంటారు. రాజు బిత్తర పోతాడు అందరికీ ఏమైంది ఇలా  మాట్లాడుతున్నారని  అంటాడు. విరూపాక్షి కూడా వాళ్ల ఆవేదనలో అర్థముంది కదా నా కూతురి కోసం నేను కోరుకున్నట్లే వీళ్లు వాళ్ల కొడుకు కోసం ఆరాట పడుతున్నారని అంటుంది. శ్వేత అమ్మాయి గారిలా నిన్ను వదిలేయలేదని అమ్మాయి గారు దరిద్రం శ్వేత దేవత అని శ్వేతని పెళ్లి చేసుకుంటానని చెప్పు అని అంటే రాజు బావని కొట్టి కాలర్ పట్టుకొని అమ్మాయి గారి గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను అంటాడు.

రూప తాళి కట్టిన నిన్ను వదిలేసి తండ్రి వెనక వెళ్లిపోయిందని శ్వేత మాత్రం నీకు శ్వేతకు మధ్య ఎవరూ అడ్డు వచ్చినా తాను అడ్డుతొలగించుకుందని శ్వేత మంచిదని రూప క్యారెక్టర్ మంచిది కాదని అంటే రాజు వరాలును కూడా కొట్టడానికి చేయి ఎత్తుతాడు. నా భార్య మీద చేయి ఎత్తితే నేను ఊరుకోను అని మల్లేశ్ అంటాడు. ఇంటి నుంచి వెళ్లిపోదాం అంటాడు. దానికి రాజు నా మెంటల్ కండీషన్ బాలేదు కాసేపు వదిలేయండి అని అంటాడు. అందరినీ బతిమాలుతాడు. కానీ ఎవరూ రాజుని లోపలికి రానివ్వరు. విరూపాక్షి కూడా నువ్వు ఇంట్లోకి రావడం నాకు ఇష్టం లేదు వాళ్ల కోసం నువ్వు ఇంత చేస్తే నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తారు అని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: Diwali 2024 : దీపావళి రోజు నువ్వులతో దీపం వెలిగిస్తే చాలు.. ఇదీ విధానం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
Diwali Wishes: దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
Google News: గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
Diwali Wishes: దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
Google News: గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
Revanth Chit Chat Politics : చిట్‌చాట్‌లతో బీఆర్ఎస్ నేతల్ని రెచ్చగొడుతన్న రేవంత్ రెడ్డి - ట్రాప్‌లోకి లాగుతున్నారా ?
చిట్‌చాట్‌లతో బీఆర్ఎస్ నేతల్ని రెచ్చగొడుతన్న రేవంత్ రెడ్డి - ట్రాప్‌లోకి లాగుతున్నారా ?
AP Deputy CM Pawan Kalyan: పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల భద్రత కోసం ప్రార్థించండి- ఆసక్తికరమైన ట్వీట్ చేసిన పవన్
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల భద్రత కోసం ప్రార్థించండి- ఆసక్తికరమైన ట్వీట్ చేసిన పవన్
Tamil Nadu News: టీ షర్ట్ వేసుకున్నారని డిప్యూటీ సీఎంపై పిటిషన్- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
టీ షర్ట్ వేసుకున్నారని డిప్యూటీ సీఎంపై పిటిషన్- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Embed widget