Ammayi garu Serial Today November 5th: అమ్మాయిగారు సీరియల్: కోమలి ఛాలెంజ్‌కి రూప భయపడిందా! విరూపాక్షి తెచ్చిన డ్రస్ సూర్య వేసుకుంటాడా!
Ammayi garu Serial Today Episode November 5th కోమలి రాజు రూపలతో ఛాలెంజ్ చేయడం, విరూపాక్షి సూర్యకి డ్రస్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ మందారాన్ని కొట్టి నీ తాయొత్తు పని చేస్తుందా లేదా అని ఆలోచిస్తున్నావా.. ఎంత కుట్ర చేశావే.. తాయొత్తు కట్టి నన్ను వశం చేసుకోవాలి అనుకుంటావా,, నా చేత నీ కాలు పట్టించుకుంటావా.. నీ దిగజారుడు ఆలోచనలతో ఇంకా దిగజారిపోయావే అని అంటాడు.
మందారం దీపక్తో నేను నా భర్త కోసమే ఇలా చేశాను నీలా వేరే వ్యక్తికి కాబోయే భార్య కోసం ఆశపడలేదు అంటుంది. దీపక్ మళ్లీ మందారాన్ని కొట్టి వార్నింగ్ ఇస్తాడు. రూప, రాజులు మొత్తం చూస్తారు. రాజు రూపతో మందారం తాయొత్తు కట్టిన సంగతి దీపక్‌కి ఎలా తెలిసింది అని అంటే నేనే కోపంలో అత్తకి చెప్పేశా అని అంటుంది. విరుగుడు కనుక్కున్నారు అంటే మనం ఆడుతున్నా నాటకం గురించి కూడా తెలిసిపోయింటుంది కదా రాజు అని రూప అంటే తెలీకుండా ఎలా ఉంటుంది రూప అని కోమలి ఎంట్రీ ఇస్తుంది. నీ అద్భుతమైన నటనతో అందరినీ నమ్మించావ్ నువ్వు సూపర్ రాజు అని అంటుంది.
రూప నీ భర్త వేరే అమ్మాయి వెనక తిరుగుతూ నీ భర్త వేరే అమ్మాయి గదిలో పడుకున్నా నీకు కోపం రాలేదా.. నువ్వు నిజంగా నీ భర్తని ప్రేమిస్తున్నావా.. నువ్వు అనుకున్నది జరగాలి అని నీ భర్తని కూడా మరో అమ్మాయి దగ్గర వదిలేస్తావా అని అంటే రూప లాగిపెట్టి కోమల్ని కొడుతుంది. నన్ను నా అశోక్‌ని విడదీయాలి అని చూశారు మీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా అని అడుగుతుంది. నీ నాటకాలు ముందు మావి నాటకాలా.. నన్ను నా తండ్రి నుంచి బిడ్డనుంచి చివరకు నా రాజు నుంచి దూరం చేయాలి అనుకున్నావ్ నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు అంటుంది.
కోమలి రూప, రాజులతో మీరు నాతో ఆడాలి అని చూశారు.. అసలైన ఆట నేను ఆడుతా ఇప్పుడు చూడండి.. ఈ ఆటలో మలుపులు చూసి మీరు తట్టుకోలేరు.. ఈ కోమలితో ఎందుకు పెట్టుకున్నాం అనేలా చేస్తా అని ఛాలెంజ్ చేస్తుంది. కోమలి ఇలా ఛాలెంజ్ చేసింది మనం తనకు ఏం అన్యాయం చేశాం రాజు నాకు ఏదో భయంగా ఉంది అని అంటుంది. అదో మేక దాన్ని మీరు సీరియస్‌గా తీసుకోవద్దు అని రాజు రూపకి ధైర్యం చెప్తాడు.
ఉదయం ఇంట్లో దీపావళి లక్ష్మీ పూజకి ఏర్పాటు చేస్తారు. దీపక్, విజయాంబికల్ని పిలవడానికి వెళ్లిన మందారం ఇద్దరూ ఇంట్లో ఏదో చేయాలి అనుకోవడం వింటుంది. మీరు చేసిన పాపాలకు ఎక్కడికి వెళ్లిన ప్రాయశ్చిత్తం ఉండదు అని అంటుంది. రూప కలశం తీసుకొచ్చి పెడుతుంది. రూప రాజుతో నాన్నని ప్రతీసారి నువ్వో నేనో పిలిచి కూర్చొపెట్టేవాళ్లం ఈ సారి నాన్నే వస్తే బాగున్ను అనుకుంటారు. రాజు, రూప ఇద్దరూ సూర్యప్రతాప్‌ని పిలవడానికి వెళ్తారు.
కోమలి రూప, రాజుల సంతోషం చూసి కుళ్లుకుంటుంది. ఈ దీపావళికి మీకు చిమ్మి చీకటి వస్తుందని అనుకుంటుంది. విరూపాక్షి సూర్యప్రతాప్ కోసం డ్రస్ తీసుకొని వస్తుంది. రూప, రాజులకు సంతోషంగా చూపిస్తుంది. మీ నాన్న కోసం తీసుకున్నా నేను ఇస్తే తీసుకోరు మీరే ఇవ్వండి అని కూతురు అల్లుడికి చెప్తుంది. ఏం కాదు నువ్వే వెళ్లు అని రూప పంపుతుంది. ఆ డ్రస్ సూర్యప్రతాప్ తీసుకుంటాడేమో అని తల్లీకొడుకులు చాలా టెన్షన్ పడి చూడటానికి వెళ్తారు.
విరూపాక్షి సూర్యప్రతాప్ గదికి వెళ్తుంది. సూర్యప్రతాప్‌కి పండగకి డ్రస్ తీసుకోమని చెప్పి ఇది వేసుకొని వస్తే పూజ చేయొచ్చని అంటుంది. నా కోసం నువ్వు బట్టలు తీసుకురావడం ఏంటి అని సూర్యప్రతాప్ అంటే నువ్వు ఇచ్చినప్పుడు నేను చీర తీసుకున్నా కదా అంటుంది. నేను తీసుకోను అని సూర్యప్రతాప్ అంటాడు. నువ్వు తెచ్చిన చీర నేను కట్టుకున్నా కాబట్టి నువ్వు వేసుకోవాలి.. లేదంటే నువ్వు ఇచ్చిన చీర నీకు ఇచ్చేస్తా అంటుంది. విరూపాక్షి ఎంత బతిమాలినా సూర్యప్రతాప్ వద్దు అనేస్తాడు. విజయాంబిక చాలా హ్యాపీ అయిపోతుంది. చేయని తప్పునకు పాతికేళ్లకి పైగా శిక్ష అనుభవిస్తున్నాను.. అందర్లానే నువ్వు కూడా గది బయట చూసిన దాని బట్టి గదిలో ఏం జరిగిందో అని ఆలోచిస్తున్నావే కానీ బయట చూసిన దానికి లోపల జరిగిన దానికి సంబంధం ఉండదు అని ఆలోచించలేకపోయావా,, నిన్ను ప్రాణంగా ప్రేమించిన విరూపాక్షి తప్పు చేయదు అని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా అని ఏడుస్తుంది. ఓ కట్టు కథ నీ చుట్టూ అల్లి పాతికేళ్లగా నన్ను అనుమానించేలా చూస్తున్నావ్.. నీ కోసం తెచ్చిన డ్రస్ ఇక్కడ పెట్టి వెళ్లున్నా.. వేసుకొని వస్తావ్ అనే నమ్మకంతో వెళ్తున్నా అని విరూపాక్షి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















