Ammayi garu Serial Today November 13th: అమ్మాయిగారు సీరియల్: కోమలి ప్రెగ్నెంట్! అసలు నిజమేంటి? దీపక్, రాజుల మీద అనుమానం!
Ammayi garu Serial Today Episode November 13th కోమలి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడం రాజు తప్పు చేశాడేమో అని విరూపాక్షి అనుమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode బంటీ కోమలిని తిట్టుకుంటూ పాలు తాగుతాడు. కోమలి మనసులో మీ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకొని మిమల్ని ఈ ఇంటి నుంచి గెంటేస్తా అని అనుకుంటుంది. ఇక కోమలి బంటీ దగ్గరకు వెళ్లి కూర్చొంటుంది. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు.. నువ్వు దెయ్యం, బూతం రాక్షసివి అని అంటాడు.
చంద్ర వచ్చి రూప మీ అమ్మే బంటీ.. రూపం మారిపోయినంత మాత్రాన తను మీ అమ్మ కాకుండా పోదు.. తనే మీ అమ్మ అని అంటాడు. బంటీ సారీ చెప్పి వెళ్లిపోతాడు. కోమలి కాఫీ తాగి వెళ్తూ కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ కోమలి దగ్గరకు వెళ్లి లేపడానికి ప్రయత్నిస్తారు. కోమలి మళ్లీ ఏదో ప్లాన్ చేసిందని విరూపాక్షి అనుమానిస్తుంది. డాక్టర్ వచ్చి కోమలిని చూస్తారు.
కోమలిని పరీక్షించిన డాక్టర్ కోమలి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. సుమ, చంద్ర, సూర్యప్రతాప్ సంతోషిస్తారు. రూప, విరూపాక్షి వాళ్లు షాక్ అయిపోతారు. విజయాంబిక మనసులో కోమలి ప్రెగ్నెంట్ అంటే కచ్చితంగా ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఇక ఆస్తి మొత్తం కొట్టేయొచ్చు అని అనుకుంటుంది. బంటీ స్కూల్‌కి వెళ్తాను అంటే చంద్ర వద్దు అని ఈరోజు మనకు చాలా స్పెషల్ అని చెప్తాడు. సూర్యప్రతాప్ బంటీని పిలిచి నువ్వు ఎప్పుడూ ఆడుకోవడానికి తోడు లేదు అని నీకు తమ్ముడో చెల్లో కావాలి అని అడిగావు కదా.. మీ అమ్మ నీకు తమ్ముడినో చెల్లినో ఇస్తుంది అంటాడు. బంటీ కోపంగా నేను ఈ అమ్మని అడగలేదు.. ఈ అమ్మని అడిగాను అని రూపని చూస్తాడు.
సూర్యప్రతాప్ కోమలిని లేపుతాడు. అందరినీ చూసిన కోమలి ఏమైంది అని అడిగితే డాక్టర్ కోమలితో మీరు ప్రెగ్నెంట్ అని చెప్పగానే కోమలి బిత్తరపోతుంది. చెమటలు పట్టేస్తుంది. మనసులో నేను ప్రెగ్నెంట్ ఏంటి అని అనుకుంటుంది. సూర్యప్రతాప్ తన సంతోషం వ్యక్తం చేస్తాడు. రూప మనసులో తను ప్రెగ్నెంట్ కాదు అని ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. డాక్టర్ కోమలికి జాగ్రత్తలు చెప్తుంది. తను ప్రెగ్నెంట్ అయినట్లు లేదని తన ముఖం చూస్తే అలా లేదు అని విరూపాక్షి అంటే నేను చెప్తున్నా కదా డౌటే లేదు అని డాక్టర్ చెప్తుంది. కోమలి మనసులో డాక్టర్ ఏంటి ఇలా చెప్తుంది.. నేను ప్రెగ్నెంట్ ఏంటి అని కోమలి బిత్తరపోతుంది. నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు.. నేను ఏ తప్పు చేయలేదు.. కానీ వీళ్లకి ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు అని అనుకుంటుంది.
కోమలి అప్పుడే దీపక్‌ని చూస్తుంది. తనని చూసి దీపక్ సిగ్గు పడటం చూసిన కోమలి దీపక్ తాయొత్తు కట్టిన రోజు దీపక్ మత్తు మందు ఇచ్చి ఏదైనా అఘాయిత్యం చేశాడా అని అనుకుంటుంది. లేదు లేదు అని అనుకుంటుంది. తను ప్రెగ్నెంట్ కాదు అని విరూపాక్షి అంటే విజయాంబిక విరూపాక్షిని అడ్డుకొని డాక్టర్ అంతగా చెప్తే నీ అనుమానం ఏంటి.. రాజు, రూప కలిసి ఉండటంలేదు కదా మరి ఇది ఎలా అనుకుంటున్నావా.. ఈ మధ్య అంతా రాజు రూప చుట్టే తిరిగాడు మర్చిపోయావా అని అంటుంది.
కోమలి మనసులో రాజు మీద నాకు నమ్మకం ఉంది రాజు అలాంటి వాడు కాదు అని అనుకుంటుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత విరూపాక్షి కోమలితో మళ్లీ ఏం ప్లాన్ చేశావే.. నువ్వే చేసిన దానికి అమ్మతనం కూడా అడ్డు పెట్టుకుంటున్నావా ఏం మనిషివే అని విరూపాక్షి తిడుతుంది. రూప కూడా అనవసరంగా రాజుని బ్యాడ్ చేస్తున్నావ్ ఇప్పటికైనా తప్పు ఒప్పుకోకపోతే చంపేస్తా అని అంటుంది. ఇంతలో సుమ వచ్చి రూప రూప అని కోమలికి మర్యాదలు చేయడం చూసి రూప, విరూపాక్షి వెళ్లిపోతారు.
విరూపాక్షి, రూపలు ఇదంతా ప్లానే అనుకుంటారు. నాకు అలా అనిపించడం లేదు అని కోమలి కూడా షాక్ అయింది అని విరూపాక్షి అంటుంది. రాజు ఏమైనా తప్పు చేశాడా అని విరూపాక్షి అంటే నువ్వు రాజుని అనుమానిస్తున్నావా అమ్మా అని రూప అంటుంది. నేను రాజుని అనుమానించడంలేదు పరిస్థితుల్ని అనుమానిస్తున్నా.. రాజుతో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని చెప్పు అంటుంది. రూప రాజుకి కాల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















