Ammayi garu Serial Today November 10th: అమ్మాయిగారు సీరియల్: సీఎం ఇంట్లో అశోక్ తల్లిదండ్రులు! కోమలి నాటకం గురించి తెలిసిపోతుందా!
Ammayi garu Serial Today Episode November 10th కోమలి అత్తామామలు విరూపాక్షి కోసం సీఎం ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపావళి వేడుకల్లో కోమలి రాజు రూపల మీద చేసిన ప్లాన్ రివర్స్ అయి కోమలి ముఖం కాలిపోతుంది. రాజు, రూపలు కోమలితో నీ ప్లాన్ నీకే తిప్పి కొట్టాం.. నువ్వు వేసిన చిచ్చు బుడ్డీల ప్లాన్ మాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా.. అని ఫ్లాష్ బ్యాక్‌లో కోమలి, విజయాంబిక సైగలు గురించి చెప్తారు. కోమలి షాక్ అయిపోతుంది.
చిన్న చీమ తన పుట్టలో వేలిపెడితే కుడితే మరి నువ్వు మా ఇంటికి వచ్చి నా స్థానంలో నటించి.. నా ఆస్తి కొట్టేయాలి అని మా మధ్య చిచ్చులు పెట్టాయాలి అనుకుంటే ఊరుకుంటాం అనుకున్నావా అని అంటుంది. రాజు కోమలితో ఇప్పటి వరకు జరిగినవి వదిలేసి నువ్వు వెళ్లిపో కోమలి.. అశోక్‌తో హ్యాపీగా ఉండు అని అంటాడు. రూప రాజుతో కోమలిని అశోక్ ఇలా చూస్తే గుర్తు పడతాడా అని నవ్వుతుంది. నువ్వు మాతో పెట్టుకుంటా అంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అందుకే నువ్వు వెళ్లిపోయి అశోక్‌తో సంతోషంగా ఉండు లేదు ఇక్కడే ఉంటా ఇలా కడుపు మాడ్చుకుంటా ఒళ్లు కాల్చుకుంటా అంటే నీ ఇష్టం అని రాజు స్వీట్ వార్నింగ్ ఇస్తాడు.
కోమలి దగ్గరకు విజయాంబిక, దీపక్‌లు వచ్చి పరామర్శిస్తారు. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు. మా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావ్,, మా కోసం నీ జీవితం రిస్క్‌లో పెట్టుకోకు నువ్వు వెళ్లిపో అశోక్‌తో హ్యాపీగా ఉండు అని విజయాంబిక అంటుంది. దాంతో కోమలి వాళ్లు నన్ను ఇంత గాయపరిచిన తర్వాత ఎలా వదిలేస్తా వాళ్లని నేనే నాశనం చేయాలి,, వాళ్ల నాశనం నా కళ్లారా చూడాలి అంటుంది. శభాష్ కోమలి అని విజయాంబిక అంటుంది.
రాజుకి ఓ ఫోన్ వస్తుంది. రాజు రూపతో కోమలిని బయటకు గెంటేసే అవకాశం వచ్చింది.. అశోక్ తల్లిదండ్రుల అచూకీ తెలిసింది..వాళ్లు ఇప్పుడు వాళ్ల బంధువుల ఇంట్లో ఉన్నారు వెళ్లి తీసుకొస్తా అని అంటాడు. నేను వస్తా అని రూప కూడా బయల్దేరుతుంది. ఇద్దరూ అడ్రస్‌కి వెళ్తారు. ఏరియాలో అందర్ని అశోక్ వాళ్ల ఇంటి గురించి అడుగుతారు. రూప రాజులు చెరో వైపు వెతుకుతూ ఉంటారు.
అశోక్ తల్లిదండ్రులు పెళ్లి పిలుపులకు బయల్దేరుతారు. రాజుకి అశోక్ వాళ్ల ఇళ్లు తెలుస్తుంది. దాంతో రూపకి కాల్ చేసి రమ్మని పిలుస్తాడు. ఇద్దరూ ఇంటికి వెళ్తారు. తీరా చూస్తే రాజు రూపలు వేరే అశోక్ వాళ్ల ఇంటికి వెళ్తారు. ఇక అశోక్ తల్లిదండ్రులు శుభలేఖలు పట్టుకొని వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లగానే రాజు, రూపలు అక్కడికి వస్తారు. పక్కనే ఉన్న అబ్బాయిని అడిగితే ఇప్పుడే బయటకు వెళ్లారని చెప్తాడు. ఇద్దరూ ఇంటికి బయల్దేరిపోతారు.
కోమలి అద్దం ముందు నిల్చొని తన ముఖం చూసుకొని రాజు, రూపల మీద కోపంతో రగిలిపోతుంది. నా ముఖం చూస్తే నాకే అసహ్యంగా ఉంది,, అశోక్ నన్ను చూస్తే గుర్తు పడతాడా.. నాకు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన రాజు, రూపలకు ఇంత కంటే దారుణమైన పరిస్థితికి తీసుకురావాలి అని అనుకుంటుంది. ఇంతలో కోమలి దగ్గరకు సుమ, చంద్ర వస్తారు. ఇద్దరూ కోమలిని రూప అనుకొని చాలా బాధ పడతారు. కోమలికి ధైర్యం చెప్తారు. ఇలా అయినప్పటి నుంచి ఎవరినీ కలవలేకపోతున్నా బయటకు రాలేకపోతున్నా అని కోమలి అనడంతో సుమ ఏడుస్తుంది.
విజయాంబిక, దీపక్‌లు బాల్కానీలో తిరుగుతూ రాజు, రూప కనిపించడం లేదు ఏంటా అని అనుకుంటారు. ఇంతలో ఇంటికి కోమలి అత్తామామలు రావడం చూసి షాక్ అయిపోతారు. వెంటనే దీపక్ అశోక్‌కి కాల్ చేస్తాడు. మీ అమ్మానాన్న మా ఇంటికి వస్తున్నారేంటి.. కోమలి ఇక్కడ ఉందని వాళ్లకి తెలుసా అని అడుగుతాడు. తెలీదు అనుకుంటా ఒకసారి నేను విషయం కనుక్కుంటా అని అంటాడు. కోమలి అత్తామామలు విరూపాక్షి గారిని కలవాలి అని అంటారు. సెక్యూరిటీ వాళ్లని ఆపేస్తారు. అశోక్ కాలేచేస్తే అతని తండ్రి లిఫ్ట్ చేయడు.
విజయాంబిక కోమలి దగ్గరకు వెళ్లి మీ అత్తామామలు వస్తున్నారు అని చెప్తుంది. కోమలి షాక్ అయిపోతుంది. ఇక విరూపాక్షి వాళ్లని చూసి గుర్తు పట్టి బయటకు వెళ్లి వాళ్లని లోపలికి పంపించమని చెప్తుంది. విజయాంబిక, కోమలి చాలా టెన్షన్ పడతారు. విరూపాక్షి వాళ్లని తీసుకొని లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















