Ammayi garu Serial Today June 19th: అమ్మాయి గారు సీరియల్: సూర్య, రాజులకు ఫాదర్స్‌డే సర్ఫైజ్‌లు.. ఏఐ టెక్నాలజీని దీపక్ మిస్యూజ్ చేయనున్నాడా!
Ammayi garu Today Episode సూర్యప్రతాప్ రెండు పెళ్లిళ్లు ఒకే ముహూర్తానికి చేస్తానని చెప్పడంతో రుక్మిణి పెళ్లి ఎవరితో చేస్తారని ఇంటిళ్లపాది టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్, కీర్తిలు మాట్లాడుకుంటారు. రుక్మిణి పెళ్లి తప్పిపోయింది అదే ముహూర్తానికి మరో వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం వాడికి వెళ్లిపోతుందని కీర్తి అంటుంది. దాంతో దీపక్ మొత్తం రుక్మిణికి ఇవ్వరు నిన్ను కూడా రూప స్థానంలో చూస్తున్నారు కాబట్టి సగం ఆస్తి నీకు ఇస్తారని అంటాడు.
కీర్తి దీపక్‌తో నీకు అంటావ్ ఏంటి దీపక్ మనకి సగం ఆస్తి వస్తుంది అని అంటుంది. దీపక్ మనసులో మనకు అంటుంది అంటే కీర్తి నా మీద మనసు పడిందా ఏంటి అంటాడు. దాంతో విజయాంబిక కొడుకు దగ్గరకు వెళ్లి మాధవి విషయంలో జరిగింది మర్చిపోయావా ఏంటి అని అంటుంది. దాంతో దీపక్ కంగారు పడతాడు. సుమ, చందులో మాట్లాడుకుంటారు. బంటీ అడిగినట్లు రుక్మిణి, రాజులకు పెళ్లి చేస్తే బాగుంటుందని సుమ అంటే కీర్తికి మాట ఇచ్చేశారు కదా అని చంద్ర అంటాడు. ఇక సుమ ఒకే ముహూర్తానికి రెండు పెళ్లిళ్లు ఎలా చేస్తారు అని అంటుంది. మరోవైపు ఇదే విషయం గురించి విరూపాక్షి వాళ్లు మాట్లాడుకుంటారు.
రాజు వాళ్లతో ఆనంద్ మోసం చేశాడనే టెన్షన్‌లో అలా అనేశారు కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకు దొరకడం కష్టం అని అంటాడు. ఇక సూర్యప్రతాప్ ఇప్పటికిప్పుడు రెండు పెళ్లిళ్లు అంటే నేను అనుకున్న వ్యక్తిని పిలవడమే మంచిది అని ఎవరికో ఫోన్ చేస్తారు. ఉదయం బంటీ సూర్యప్రతాప్ కంటే ముందే లేచి డ్రాయింగ్ వేస్తుంటాడు. సూర్యప్రతాప్ చూసి అమ్మ గురించి అడిగి బాధ పడతాడు అనుకుంటే బాధ్యతగా హోం వర్క్ చేసుకుంటున్నాడని అనుకుంటారు సూర్యప్రతాప్.
విరూపాక్షి, రాజు, రుక్మిణి, మందారం ఉదయం కూడా రుక్మిణి పెళ్లి గురించే ఆలోచిస్తుంటారు. బంటీ డ్రాయింగ్ పూర్తి చేసి ఎవరూ చూడకుండా షర్ట్ వెనక పెట్టుకొని వాళ్ల దగ్గరకు వెళ్తాడు. బంటీ సడెన్‌గా అక్కడికి వచ్చేసరికి నలుగురు కంగారు పడతారు. బంటీ రాజుని పిలిచి గుడ్ మార్నింగ్ చెప్తాడు. తర్వాత నాన్న నీకోసం ఒక సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేశా అని పేపర్ డ్రాయింగ్ ఇచ్చి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటాడు. అందులో అమ్మా నాన్న కొడుకు చేతులు పట్టుకున్నట్లు డ్రాయింగ్ వేసుంటాడు. రాజు బంటీని ప్రేమగా ముద్దాడుతాడు. రుక్మిణి మనసులో కంగారులో ఈ రోజు ఫాదర్స్‌డే అని మర్చిపోయాను అనుకుంటుంది.
బంటీ డల్‌గా ఉంటే ఏమైందని రాజు అడిగితే అమ్మ ఉంటే తాతయ్యకి కూడా సర్‌ఫ్రైజ్ చేసేది కదా పాపం నాన్న తాతయ్య అని ఫీలవుతాడు. రుక్మిణిగా ఉన్న రూప బంటీతో అమ్మ లేకపోతే ఏంటి బంటీ నేను ఇంకో కూతుర్ని ఉన్నా కదా నేను సర్‌ఫ్రైజ్ చేస్తా అంటుంది. చేస్తావా అమ్మ అనబోయి బంటీ అమ్మ అనకుండా ఆగిపోతాడు. విరూపాక్షి వద్దని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే డల్ అయిపోతాడు. రాజు కూడా రుక్మిణితో ప్రతీసారి అమ్మాయిగారు సర్ఫ్రైజ్ చేసేవాళ్లు తనని తలచుకొని బాధపడతారు వద్దు అంటాడు.
రుక్మిణి మా అక్క వచ్చి విష్ చేసినట్లు చేస్తాను అందుకు ఏఐ టెక్నాలజీ వాడుకుంటానని అంటుంది. రాజుని తీసుకెళ్లి ఏఐ వీడియో చేద్దామని తీసుకెళ్తుంది. ఆ మాటలు దీపక్ విని విజయాంబిక వాళ్లతో చెప్తుంది. పెళ్లి గురించి టెన్షన్ లేకుండా సర్‌ఫ్రైజ్‌లు ఏంటి అనుకుంటారు. కీర్తి అలియాస్ దీప్తి ఏదో తేడా కొడుతుందని అంటుంది. అందరూ అదే అనుకుంటారు. రూపని ఏఐ ద్వారా చూపించి మామయ్య మనసు మార్చాలని అనుకుంటున్నారని దీపక్ అంటే ఆ సర్ఫైజ్ షాకింగ్‌గా ఉండాలని అంటుంది. దాంతో దీపక్ రూప స్థానంలో విరూపాక్షి మాట్లాడినట్లు మామయ్యని కుంగదీసే విషయాలు జోడించి బాధ పెడదామని అంటాడు. రాజు రుక్మిణిలను డైవర్ట్ చేసి పని పూర్తి చేద్దామని అనుకుంటారు.
సూర్యప్రతాప్ కిందకి రాగానే రాజు, రుక్మిణి వాళ్లు భర్త్‌డే ప్రొజోన్స్ పేల్చి సంతోషంగా ఉంటారు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని రుక్మిణి చెప్పగానే సూర్యప్రతాప్ థ్యాంక్యూ రూప అంటాడు. అందరూ చూస్తూ ఉండిపోతే సూర్యప్రతాప్ రూపని గుర్తు చేసుకొని బాధ పడతాడు. కన్నీరు పెట్టుకుంటాడు. రూపని ఎంత మిస్ అవుతున్నాడో చెప్పి ఏడుస్తాడు. రూపని చూడాల్సిన ఇంట్లో తన ఫోటో చూస్తే గుండె ముక్కలైపోతుందని ఏడుస్తారు. కీర్తి వెళ్లి నేను అనాథని ఇకపై నాకు మీరు ఉన్నారు అని విష్ చేసి మీ కూతురి స్థానం భర్తీ చేస్తాను అంటే ఎవరు ఎన్ని చేసినా నా కూతురి లేని లోటు తీర్చలేరు మీరు మీలాగే ఉండండి అంటారు.
మందారం కేక్ కట్ చేయించాలని తీసుకొస్తుంది. రెండు కేకులు తీసుకొస్తారు. ఒక దాని మీద సూర్యప్రతాప్, రూపల ఫొటో మరో కేక్ మీద రాజు బంటీల ఫొటో పెడతారు. కేక్ మీద రూప ఫొటో చూసి సూర్యప్రతాప్ రూపని తలచుకుంటాడు. మామ అల్లుడు ఇద్దరూ కేక్‌లు కట్ చేస్తారు. ఇద్దరూ కేక్‌లు వాళ్ల పిల్లలకు తినిపిస్తారు. చంద్ర పింకీని గుర్తు చేసుకొని ఏడుస్తాడు. రుక్మిణి చంద్రకి విష్ చేసి కేక్ తినిపిస్తుంది. సూర్యప్రతాప్‌తో రాజు మీ కోసం ఓ సర్‌ఫ్రైజ్ అని చెప్తాడు. రాజు టీవీకి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాడు. బంటీ కూడా ఓ సర్‌ఫ్రైజ్ ఉంది అని వెళ్లి అచ్చం సూర్యప్రతాప్‌లా రెడీ అయి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?





















