Ammayi garu Serial Today June 13th: అమ్మాయి గారు సీరియల్: ఒకేసారి రెండు జంటల పెళ్లి.. దీప్తి కుట్ర బయట పడుతుందా.. రాఘవ దొరుకుతాడా!
Ammayi garu Today Episode ఆనంద్ తల్లీకొడుకుల మీద ఒత్తిడి తీసుకురావడంతో రాఘవని ఆనంద్‌కి చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode పంతులు ఇంటికి రావడంతో సూర్యప్రతాప్ రాజు, కీర్తిలను పిలిపించి బంటీతో పాటు ఇద్దరిని ఒక్క దగ్గర కూర్చొపెడతారు. పంతులు కీర్తి అనాథ కాబట్టి తన జాతకం లేదని అంటారు. విజయాంబిక పంతులుతో కీర్తి జాతకం రాయమని చెప్తారు. దాంతో పంతులు కీర్తికి పుట్టిన తేదీ, నక్షత్రం, గోత్రం ఏమీ లేవు కాబట్టి రాయడం కుదరదు అని అంటారు.
సూర్యప్రతాప్ పంతులుతో కీర్తిని నా కూతురిగా చూడాలి అనుకున్నా కాబట్టి కీర్తికి నా ఇంటి పేరు రాయండి అని చెప్తారు. రూప, విరూపాక్షి, రాజు, ఆనంద్ షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్ పంతులుతో కీర్తికి సంబంధించి అన్ని రూపవి వేసి రాయమని అంటారు. విరూపాక్షి అడ్డుకుంటుంది. ఇలా మీకు నచ్చినట్లు చేస్తే రేపు నష్టపోయేది నా అల్లుడు మనవడు అని విరూపాక్షి అంటాడు. దానికి సూర్యప్రతాప్ నేను ఈ జాతకాలు నమ్మను అవి నిజమే అయితే నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది నా కూతురు ఎందుకు చనిపోతుంది అని అంటాడు.
సూర్యప్రతాప్ పంతులుకి ముహూర్తం పెట్టమని అంటారు. దాంతో పంతులు ఈ వారంలోనే ముహూర్తం బాగుంది అని రుక్మిణి, ఆనంద్‌లకు పెట్టిన ముహూర్తమే కీర్తి, రాజులకు కూడా మంచిదని అంటారు. మళ్లీ రాజు వాళ్లు షాక్ అయిపోతారు. రెండు జంటల పెళ్లి ఓకే ముహూర్తంలో చేయమని పంతులు అంటారు. దాంతో సూర్యప్రతాప్ రెండు పెళ్లిళ్లు ఒకే సారి ఒకే మండపంలో జరిపిస్తా అని అంటారు. రాజు మనసులో రెండు ముహూర్తాలు ఒకే సారి కాబట్టి రాఘవ విషయంలో స్పీడ్ పెంచాలని అనుకుంటాడు.
సూర్యప్రతాప్ రెండు జంటలతో మీ రెండు జంట పెళ్లి ఒకే ముహూర్తానికి ఒకే మండపాన అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని అంటాడు. అన్నీ ఏర్పాట్లు చంద్రకి చూసుకోమని అంటాడు. రాజు ఆనంద్‌కి సైగ చేయడంతో ఆనంద్ దీపక్ వాళ్లకి సైగ చేసి రమ్మని పిలుస్తాడు. దీపక్ వాళ్లతో తన తండ్రిని చూపించమని లేదంటే వెళ్లిపోతా అని అంటాడు. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంది మా నాన్నకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి ఒప్పుకున్నా. అదే జరగదు అంటే నేను ఉండను అని అంటాడు. విజయాంబిక దీపక్‌లు ఆనంద్‌తో మీ నాయన్ని ఇప్పుడే చూపిస్తా అంటారు. దీపక్ జీవన్ చెప్పిన నెంబరుకు వీడియో కాల్ చేసి రాఘవని చూపిస్తాడు.
రాఘవ, ఆనంద్‌లు ఒకర్ని ఒకరు చూసుకొని ఎమోషనల్ అయిపోతారు. రాఘవ ఆనంద్‌తో విజయాంబిక దగ్గర ఎందుకు ఉన్నావ్ అంటే నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను. నిన్ను మెడ పట్టుకొని గెంటేసిన ఇంటికే అల్లుడిన కాబోతున్నా అని చెప్తాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావ్ నాయనా అని ఆనంద్ అడిగితే రౌడీలు ఫోన్ కట్ చేసేస్తారు. మీ నాన్న పక్కన ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని ఆనంద్ అంటే దానికి తల్లీకొడుకులు మీ నాన్నని మీకు చూపించాం కదా పెళ్లి చేసుకొని ఆస్తి పత్రాలు మాకు ఇస్తేనే మీ నాన్నని అప్పగిస్తాం అంటారు.
ఆనంద్ రాజు వాళ్ల దగ్గరకు వెళ్లి రాఘవని చూశానని సంతోషంగా చెప్తాడు. అందరూ సంతోషపడతారు. రుక్మిణితో పెళ్లి అయి ఆస్తి పత్రాలు వాళ్ల చేతిలో పెడితే నాకు మా నాన్నని ఇస్తామని అన్నారని అంటాడు. రాజు తన వాళ్లతో రాఘవ ఎక్కడున్నాడో విజయాంబిక వాళ్లతోనే చెపిస్తానని అంటాడు. అందుకు ఆనంద్‌తో వెంటనే వాళ్ల దగ్గరకు మీరు చూపించింది మా నాన్ననే అన్న గ్యారెంటీ ఏంటి? ఈ మధ్య ఏఐ బాగా వినియోగంలో ఉంది కదా దానితో లేని వాళ్లని కూడా ఉన్నట్లు చూపిస్తున్నారని నిలదీయమని రాజు చెప్తాడు.
ఆనంద్ విజయాంబిక వాళ్ల దగ్గరకు వెళ్లి తను మా నాన్న అని గ్యారెంటీ ఏంటి అదంతా ఏఐ టెక్నాలజీ అని అంటాడు. నీకు అంత అనుమానం ఉంటే మళ్లీ కాల్ చేస్తా చూడు అని దీపక్ అని ఆ నెంబరుకి కాల్ చేస్తే ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది. మా నాన్నని చూపిస్తే పెళ్లి చేసుకుంటే లేకుంటే ఇప్పుడే వెళ్లిపోతా అని ఆనంద్ అంటే తల్లీకొడుకులు ఆనంద్‌ని బతిమాలుతారు. కనీసం మీరు దగ్గరుండి మా నాన్నని చూపించండి అప్పుడు మీరేం చెప్తే అది చేస్తా అంటాడు. విజయాంబిక కాస్త టైం అడుగుతుంది. ఆనంద్ రాజు వాళ్లకి విషయం చెప్తాడు. విజయాంబిక వాళ్లు జీవన్‌ని కలుస్తారు.
ఆనంద్ పెట్టిన కండీషన్ చెప్తారు. వీడియో కాల్ చూపించినా నమ్మడం లేదని అంటారు. దాంతో జీవన్ అసలు వాడు రాఘవ కొడుకేనా రాజు ఆడుతున్న నాటకమా అని అంటే వాడు ఏఐ టెక్నాలజీలో చూపిస్తున్నామని అనుకుంటున్నాడని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!





















