Ammayi garu Serial Today June 11th: అమ్మాయి గారు సీరియల్: రూప బతికే ఉందని సూర్యకి చెప్పేసిన విరూపాక్షి.. నిజాలన్నీ తెలియడంతో సూర్య షాక్!
Ammayi garu Today Episode రూప బతికే ఉందని ఆనంద్ రాఘవ కొడుకని సూర్యప్రతాప్‌కి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కీర్తిని సూర్యప్రతాప్ ఇంట్లో ఉంచుతారు. కీర్తి తనకు రాజుని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమే అని రాజు, బంటీ ఇద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటానని కీర్తి చెప్తుంది. సూర్యప్రతాప్ కీర్తికి గది చూపించమని సుమకు చెప్తారు. సుమ, చంద్రలు కీర్తిని తీసుకొని వెళ్తారు. విజయాంబిక రాజు వాళ్లని చూసి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరో అని పాట పాడుతుంది.
సుమ వాళ్లు కీర్తిని గదికి తీసుకెళ్తారు. సూర్యప్రతాప్ వెళ్లి గది నచ్చిందా అంటే కీర్తి సూర్యప్రతాప్ కాళ్లకు మొక్కి మీరు లేకపోతే నా గతి ఏమైపోయేదో అని అంటుంది. నన్ను అర్థం చేసుకునే వాళ్లు నా వాళ్లు ఎవరూ లేక ఇంత కాలం భయపడ్డాను అందుకే సూసైడ్ చేసుకున్నానని అంటుంది. చంద్ర కీర్తితో ఇక నుంచి నీకు ఎవరూ లేని అనాథవి కాదు ఇక నుంచి నీకు మేం అంతా ఉన్నాం అని భరోసా ఇస్తారు. మేం అంతా నీ విషయంలో ఎలా ఉంటామో మా బంటీ విషయంలోనూ నువ్వు అలాగే ఉండాలి అని చెప్తాడు. రూప ఫొటో చూపించి తను నా కూతురు రూప అని చెప్తారు. మా రూపలా నువ్వు ఉండాలని చెప్తారు.
విరూపాక్షి మాటలు గుర్తు చేసుకున్న కీర్తి ఈ పెళ్లి చేసుకోనని రూప తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. కావాలి అంటే బంటీని చూసుకుంటా అని అంటుంది. దానికి సూర్యప్రతాప్ ఈ పెళ్లి రూప తల్లికి ఇష్టం ఉండటం కాదు.. నీకు ఇష్టమా లేదా అంటే కీర్తి ఇష్టమే అంటుంది. బంటీతో కీర్తిని ఇక నుంచి అమ్మ అని పిలవమంటే బంటీ తనకు ఎవరూ వద్దని అంటాడు. కీర్తి సూర్యప్రతాప్‌తో నన్ను అమ్మగా అంగీకరించాలి అంటే కష్టమే కానీ తనే మారుతాడు అని బంటీకి అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో నేను అలాగే చూసుకుంటా అని బంటీని తాను పరిచయం చేసుకుంటా అని చెప్తుంది.
కీర్తి బంటీతో నన్ను అమ్మా అని పిలువు బంటీ నీ కోసం అన్నీ తీసుకొస్తా అంటుంది. సూర్యప్రతాప్ రూప ఫొటోని చూసి ఎమోషనల్ అయిపోతాడు. విరూపాక్షి వాళ్లు మాట్లాడుకుంటారు. నేను అనుకున్నదే జరిగిపోయింది అని విరూపాక్షి కంగారు పడుతుంది. రూప పెళ్లి ఆనంద్ ఆపుతాడు కానీ కీర్తితో నీ పెళ్లి ఎవరు ఆపుతారు రాజు అని విరూపాక్షి అడుగుతుంది. నా కళ్ల ముందే నా బిడ్డ జీవితం నీ కళ్ల ముందే నీ బిడ్డ జీవితం నాశనం అయిపోతుందని విరూపాక్షి ఏడుస్తుంది. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే సూర్యకి నిజం చెప్పడమే మార్గం అని వెళ్లి సూర్యని పిలుస్తుంది. రూప, రాజు ఎంత ఆపినా వినదు.
విరూపాక్షి సూర్యని పిలవడంతో అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. విరూపాక్షి సూర్యప్రతాప్‌తో నీతో ఓ నిజం చెప్పాలి అంటుంది. ఏంటి అని సూర్యప్రతాప్ అడిగితే నేను రాజు, రుక్మిణి నీ దగ్గర ఓ నిజం దాచామని అంటుంది. ఏంటా నిజం అని సూర్యప్రతాప్ అరుస్తాడు. రూప చనిపోయింది అనేది అబద్ధం అని విరూపాక్షి చెప్పేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. రూప బతికే ఉంది అని విరూపాక్షి చెప్తుంది. సూర్యప్రతాప్ కన్నీరు పెట్టుకుంటాడు. రూప శవానికి దహనకార్యక్రమాలు చేశాం కదా అక్క రూప బతకడం ఏంటి అని సుమ అడుగుతుంది.
రుక్మిణినే రూప అని విరూపాక్షి చెప్తుంది. అమ్మో అమ్మో అని దీపక్ గుండె మీద చేయి వేసుకొని షాక్ అయిపోతాడు. సూర్యప్రతాప్ రుక్మిణిని పట్టుకొని నువ్వు నిజంగా రూపవేనా అని రూపని పట్టుకొని ఏడుస్తాడు. బంటీ కూడా అమ్మా అని హగ్ చేసుకొని ఏడుస్తాడు. సూర్యప్రతాప్ రూపతో ఈ వేషం ఏంటి ఆ యాస ఏంటి అని అడుగుతాడు. నిన్ను అమ్మని కలపడానికి ఇంత కంటే మార్గం దొరకలేదు అని రూప చెప్తుంది. రాఘవ ఎక్కడున్నాడో విజయాంబికకు తెలుసు అని ఈ నాటకం ఆడామని రాజు చెప్తాడు. సూర్యప్రతాప్ కుప్పకూలిపోతాడు. అందుకే నిజం చెప్పలేదని రూప అంటుంది.
చంద్ర ఆనంద్ కూడా అబద్ధమేనా అని అడుగుతాడు. అవును అని రూప చెప్తుంది. ఆనంద్ రాఘవ కొడుకు అని చెప్తుంది. అందరూ బిత్తర పోతారు. రాఘవ గురించి తెలుసుకోవాలనే ఇలా చేశామని తన ప్లాన్ ప్రకారమే అత్తయ్య వాళ్లు ఆనంద్‌ని ఇంటికి తీసుకొచ్చారని చెప్తుంది. ఇదంతా మిమల్ని మోసం చేయాలి అని కాదు అని సూర్యప్రతాప్ అంటారు. రాఘవ కొడుకుని ఇంటికి తీసుకొస్తారా అని విజయాంబిక సూర్యప్రతాప్‌ని రెచ్చగొడుతుంది. మీకు సిగ్గులేదా అని విజయాంబిక అంటే దానికి రూప అత్తయ్య ఇది మా ఫ్యామిలీ మేటర్ నువ్వు తలదూర్చొద్దు అంటుంది. దాంతో సూర్యప్రతాప్ లాగి పెట్టి రూపని కొడతాడు. ఏంటి నీ ఫ్యామిలీ మేటర్ మీ నాన్న నీ మీద ఎంత ప్రాణం పెట్టుకొని బతికాడో తెలుసా నువ్వు నాన్నని మోసం చేశావ్ అని సూర్యప్రతాప్ అంటాడు.
నువ్వు చనిపోయావు అన్నప్పుడే నేను చనిపోయాను.. నా మనవడు నీ శవానికి నిప్పు పెడుతున్నప్పుడే నాకు నేను నిప్పు పెట్టుకున్నా అని సూర్యప్రతాప్ ఏడుస్తాడు. అమ్మ లేదని ఆ పసి వాడు ఏడుపునకు కూడా మీ మనసు కరగలేదు అంటే మీరు ఎంత కఠినాత్ములో నాకు అర్థమవుతుంది. నా దృష్టిలో నువ్వు ఈ రోజు చచ్చిపోయావ్ నన్ను నాన్న అని పిలవకు అని సూర్యప్రతాప్ రూపతో చెప్తాడు. ఆవేశంగా గదిలోకి వెళ్లి గన్ తీసుకొని వస్తాడు. అమ్మని చంపొద్దు తాతయ్య అని బంటీ ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!





















