Ammayi garu Serial Today july 22nd: అమ్మాయి గారు సీరియల్: రుక్మిణితో ఈజీ కాదు.. అత్తని చిత్తు చేసే మాస్టర్ ప్లాన్.. మంట తప్పదుగా!
Ammayi garu Today Episode విరూపాక్షి, రూప వాళ్లంతా బోనం ఎత్తడం అందర్నీ కాల్చేయాలని విజయాంబిక ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ రుక్మిణితో బోనం ఎత్తించడానికి ఒప్పుకుంటాడు. అందరూ బోనం సమర్పించడానికి రెడీ అవుతారు. సూర్యప్రతాప్, విరూపాక్షి రెడీ అయి మేడ మీద నుంచి చెరోవైపు నుంచి వస్తారు. బంటీ మధ్యలో నిల్చొని తాతయ్య, అమ్మమ్మల చేతులు పట్టుకొని కిందకి తీసుకొని వస్తాడు. చంద్ర, సుమ, మందారం ఆ సీన్ చూసి మురిసిపోతారు. విజయాంబిక రగిలిపోతుంది.
సుమ భర్తతో బావగారిని అక్కని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అంటుంది. విజయాంబిక మనసులో విరూపాక్షి, నా తమ్ముడిని రాజు రూపల కంటే ముందు ఈ పిల్లాడు కలిపేలా ఉన్నాడు ముందు ఈ పిల్లడి సంగతి చూడాలి అనుకుంటుంది. బంటీ అమ్మనాన్నల గురించి అడిగితే బోనాలు రెడీ చేస్తున్నారని మందారం చెప్తుంది. దాంతో బంటీ వెళ్దాం పదండి అని తాతయ్య అమ్మమ్మ చేతులు పట్టుకొని తీసుకెళ్తాడు. విజయాంబిక మనసులో సంతోషంగా వెళ్తున్నారు ఇంటికి వచ్చేటప్పుడు విషాదంగా వస్తారు అనుకుంటుంది. అందరూ గుడికి చేరుకుంటారు.
రుక్మిణిలా ఉన్న రూప, విరూపాక్షి, సుమ, మందారం అందరూ బోనాలు ఎత్తుతారు. రుక్మిణి రాజుతో పోయిన సారి అమ్మా నాన్న విడిగా వచ్చారు. ఈసారి ఒక్క చోట ఉన్నారు వచ్చే ఏడాది ఇద్దరూ కలిసి పోయేలా చూడాలని దేవుడిని కోరుకుంటా అని అంటుంది. అందరూ సంతోషంగా ఉండటం చూసిన విజయాంబిక ఈ నవ్వులన్నీ కొద్దిసేపే అనుకుంటుంది. ఆడవాళ్లు అంతా బోనాలు ఎత్తు కొని ఉంటే సూర్యప్రతాప్ అమ్మవారికి కొబ్బరి కాయ కొడతారు. విజయాంబిక దీపక్‌తో అంతా నేను చెప్పినట్లే చేశావా అని అడుగుతుంది. దీపక్ చేశానని చెప్తాడు.
సూర్యప్రతాప్, విరూపాక్షి ఇద్దరూ రుక్మిణి గురించి దండం పెట్టుకుంటారు. విరూపాక్షి మనసులో నా సమస్య 25 ఏళ్లగా చెప్తూనే ఉన్నా నా సమస్య పరిష్కారం కావడం ఏమో కానీ నా కూతురు బాగుండాలని అనుకుంటుంది. రూప తల్లిదండ్రులు ఇద్దరూ తన గురించే దండం పెట్టుకుంటారు కానీ నేను మాత్రం వాళ్లు కలవాలి అని కోరుకుంటున్నా రాఘవ దొరికేలా చూడు తల్లీ అని కోరుకుంటుంది. మరోవైపు రాఘవని కిడ్నాప్ చేసిన రౌడీల్లో ఒకడు టిఫెన్ కోసం బయట రావడం ఆనంద్ చూసి అతన్ని ఫాలో అయితే తన తండ్రి ఆచూకి తెలుస్తుందని అనుకుంటాడు.
విరూపాక్షి వాళ్లంతా బోనాలు తీసుకొని ప్రదక్షిణలు చేసి ప్రసాదం వండటానికి బయల్దేరుతారు. విజయాంబిక, దీపక్‌లు బోనాలు వండే పొయ్యిల మీద మంట వచ్చే పొడి వేస్తాడు. నాలుగు పొయ్యిల మీద ఎందుకురా అని విజయాంబిక అడిగితే ఎవరు ఏ పొయ్యి దగ్గర కూర్చొంటారో ఎలా తెలుస్తుంది అందుకే నాలుగింటి మీద చల్లితే నలుగురు ఒక్క సారి పోతారని అంటాడు. విజయాంబిక కొడుకుని మెచ్చుకొని పొడి వేయమని చెప్తుంది. ప్రదక్షిణలు చేసి అందరూ పొయ్యిల దగ్గరకు చేరుకుంటారు. మందారం, సుమ, రుక్మిణి, విరూపాక్షిలు నాలుగు పొయ్యిల మీద బోనం కుండలు పెడుతుంది. విజయాంబిక మంచిగా మాట్లాడుతూ హడావుడి చేస్తే రూపకి అనుమానం వస్తుంది. ఏదో తేడా కొడుతుందని అనుకుంటుంది. నలుగురు పొయ్యిలు వెలిగించడానికి రెడీ అవుతారు.
విరూపాక్షి ముందుగా పొయ్యి వెలిగించడానికి రెడీ అవుతుంది. విజయాంబిక సంతోషంగా చూడటం చూసిన రూప అనుమానం వచ్చి విరూపాక్షిని ఆపుతుంది. విజయాంబిక దగ్గరకు వెళ్లి అత్త ఇంటి పెద్ద మనిషి పొయ్యి వెలిగిస్తే మంచి జరుగుతుంది నువ్వు వెలిగించు అత్త అంటుంది. విజయాంబిక నీళ్లు నములుతుంది. వద్దూ అని తల్లీకొడుకులు రకరకాలుగా చెప్తారు. కానీ రుక్మిణి తండ్రి దగ్గరకు వెళ్లి అత్తకి చెప్పు నాయనా అంటుంది. సూర్యప్రతాప్ కూడా వెలిగించమని అంటాడు. చంద్ర, సుమ అందరూ విజయాంబికకు చెప్తారు. విజయాంబిక బిత్తర చూపులు చూస్తుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించకపోతే అనుమానం వస్తుందని ఏది జరిగితే అది జరిగింది పొయ్యి వెలిగిస్తానని విజయాంబిక వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!





















