Ammayi Garu Serial Today December 5th Episode: అమ్మాయి గారు సీరియల్: అశోక్ పని అయిపాయే! కోమలి ఆట కట్టించేందుకు రూప, రాజుల మాస్టార్ ప్లాన్!
Ammayi Garu Serial Today Episode December 5th అశోక్‌కి జీవితఖైదు పడటంతో కోమలి ఇంటి నుంచి వెళ్లిపోతా అని హడావుడి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi Garu Serial Today Episode రాజు చివరి నిమిషంలో మేనేజర్‌ని చంపిన అశోక్‌కి కోర్టుకి తీసుకురావడంతో విరూపాక్షిని కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తుంది. అశోక్‌కి జీవితఖైదు విధిస్తుంది. అశోక్ జీవితాంతం జైలు పాలు కావడంతో కోమలి బిత్తరపోతుంది. అశోక్‌ని పోలీసులు తీసుకెళ్లిపోతారు.
విరూపాక్షి రూపని హగ్ చేసుకొని ఏడుస్తుంది. రాజుకి థ్యాంక్స్ చెప్తుంది. సూర్యప్రతాప్‌ని ప్రేమగా చూస్తుంది. అశోక్‌తో ఇదంతా దీపక్, విజయాంబికలు చేయించినందుకు కోమలి వాళ్లని కోపంగా చూస్తుంది. దాంతో ఇద్దరూ జారుకుంటారు. సూర్యప్రతాప్, విరూపాక్షి వాళ్లు ఇంటికి వస్తారు. రూప తల్లిని గుమ్మం బయట ఉంచుతుంది. అమ్మ ప్రతీ సారి నువ్వు ఏ తప్పు చేయకున్నా దాదాపు దోషిగా మారి నిర్దోషిగా నిరూపించుకొని వస్తున్నావు.. నీకు దిష్టి తీస్తా ఆగు అని తల్లిదండ్రులిద్దరికీ రూప దిష్టి తీస్తుంది. సూర్యప్రతాప్‌కి కూడా బొట్టు పెడుతుంది. నాకు ఎందుకమ్మా అని సూర్యప్రతాప్ అడిగితే మీ ఇద్దరినీ ఇలా చూస్తే నా దిష్టే తగిలేలా ఉంది నాయనా అందుకే ఇద్దరికీ దిష్టి తీస్తున్నా అని చెప్పి ఇద్దరినీ లోపలికి తీసుకెళ్తుంది.
సూర్యప్రతాప్ రూపతో అమ్మా రుక్మిణి మీ అమ్మ ఎప్పుడు భోజనం చేసిందో ఏంటో ఏమైనా తినిపించు అని అంటాడు. సూర్యప్రతాప్ అలా అనగానే రూప, రాజు, విరూపాక్షి వాళ్లంతా సంతోషిస్తారు. విజయాంబిక వాళ్లు మాత్రం షాక్ అయిపోతారు. కోమలి గదికి వెళ్లి అశోక్‌ని తలచుకొని ఏడుస్తుంది. విజయాంబిక వాళ్లని నమ్మి నా అశోక్‌ని దూరం చేసుకున్నాను... ఇప్పుడు అశోక్‌ని ఎలా బయటకు తీసుకురావాలి అంతా నావల్లే అని ఏడుస్తుంది. ఇంతలో రూప, రాజులు వచ్చి నువ్వు ఎంత గింజుకున్నా నీ అశోక్ ఇప్పట్లో బయటకు రాడు కోమలి.. నువ్వు నా రాజుని నాకు దూరం చేయాలి అనుకున్నావ్.. నీకు నీ అశోక్ దూరం అయ్యాడు అని రూప అంటుంది.
రాజు కోమలితో నిన్ను మర్యాదగా వెళ్లిపోమంటే మా తోనే ఛాలెంజ్‌లు చేశావ్.. ఇప్పుడు ఛాలెంజ్ చేయ్ అని అంటాడు. ఇప్పుడు నిజం ఒప్పుకుంటే కనీసం నీ బతుకు అయినా నువ్వు బతుకుతావ్.. లేదంటే అశోక్‌కి పట్టిన గతే నీకు పడుతుందని రాజు అంటాడు. దానికి రూప పోనీలే రాజు అక్కడైనా ఇద్దరూ కలిసే ఉంటారు అని అంటుంది.
కోమలి దగ్గరకు విజయాంబిక, దీపక్‌లు వస్తారు. కోమలి విజయాంబిక వాళ్లని నిలదీస్తుంది. అశోక్‌ని దగ్గరుండి కాపాడుతా అని ఇలా చేశారు ఏంటి అని అంటుంది. ఏదో జరిగిపోయింది ఇప్పుడు అశోక్‌కి ఎలా బయటకు తీసుకువస్తామని అంటారు. దానికి కోమలి అశోక్‌ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు.. జరిగింది సూర్యప్రతాప్ గారికి చెప్తే ఆయనే అశోక్‌ని బయటకు తీసుకొస్తారని చెప్పి నేను ఈ నాటకం ఆడను అని కోమలి అంటుంది. ఇష్టం వచ్చినట్లు చేయకు అని విజయాంబిక కోమలిని అంటుంది. ఇప్పుడు నీకు అనాథాశ్రమం లేదు.. అశోక్ లేడు.. బయటకు వెళ్లి ఏం చేస్తావ్ అని అంటుంది. కోమలి ఏం వినకుండా నిజం చెప్తా అని అంటే విజయాంబిక కోమలిని లాగేసి ఏం చెప్తావే అసలు నీ దగ్గర ఏం ఆధారం ఉందని నిజం చెప్తావ్,, ఓవర్ చేస్తే నీకు అదే గతి పడుతుంది.. అర్థం చేసుకో కాదు కూడదు అంటే ఏం చేస్తామో మాకే తెలీదు.. నీ పెళ్లి టైంకి అశోక్‌ని తీసుకొస్తా అని వార్నింగ్ ఇస్తారు.
సూర్యప్రతాప్ రుక్మిణితో మీ అమ్మ తిన్నాదా అని అంటే లేదే నాయనా ఆకలి లేదు అని అంది అని రూప అంటుంది. తినమని చెప్పు అని సూర్యప్రతాప్ అంటాడు. మీ నాన్న తినకుండా నేను తినను అని చెప్పిందని రుక్మిణి అంటుంది. అలా రూల్ ఏం లేదు కదా అని సూర్యప్రతాప్ అంటే రూల్ లేదు కానీ నాకు అలవాటు అని విరూపాక్షి అంటుంది. వెళ్లి భోజనం చేయ్ అని సూర్యప్రతాప్ అంటాడు. నేను చేయను అని అంటుంది. ఎందుకు అని సూర్యప్రతాప్ అంటే రేపు నా కూతురి పుట్టిన రోజు ఎలా సెలబ్రేట్ చేయాలా అని ఆలోచిస్తున్నా అని విరూపాక్షి అంటుంది. అవును కదా రేపు రూప, రుక్మిణిల పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు.
పుట్టినరోజు సెలబ్రేషన్స్ అదిరిపోవాలని సూర్యప్రతాప్ అంటాడు. దానికి రాజు కోమలిని చూసి అమ్మాయిగారు జీవితంలో మర్చిపోలేని భర్త్డే చేస్తానని దీని ముందు ఇలాంటి పుట్టినరోజు చూసుండరు.. తర్వాత కూడా జరుపుకోలేరు అని అంటాడు. ఇక రూప అమ్మానాన్నలు ఇద్దరినీ భోజనానికి తీసుకెళ్తుంది. కోమలి ఆరు బయట అశోక్ గురించి తలచుకొని బాధ పడుతుంది.. ఇంతలో రూప, రాజు కోమలి దగ్గరకు వచ్చి రేపు నీకు మేం ఇచ్చే గిఫ్ట్ నువ్వు కలలో కూడా ఊహించలేవు అని అంటుంది. రేపు నీ అబద్ధపు పుట్టిన రోజుకి నిజం గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాం.. అనాథాశ్రమం నుంచి అందరూ రేపు వస్తారు. నీ ఫ్రెండ్తో సహా.. తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాం.. ఏయ్ డూప్లికేట్ ఈ రోజే నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజు ఎంజాయ్ చేయ్ అని రూప చెప్పి వెళ్లిపోతుంది. కోమలి విషయం విజయాంబికకు చెప్పి వెళ్లిపోతా అంటే అది అస్సలు జరగదు ఆస్తి సొంతం చేసుకున్న తర్వాతే నువ్వు వెళ్లాలి అని విజయాంబిక అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



















