Ammayi garu Serial Today December 19th: రాజు అశోక్‌ను కోర్టుకు తీసుకొచ్చాడా..?కోర్టులో అశోక్ న్యాయమూర్తికి ఏం చెప్పాడు..?
Ammayi garu Serial Today Episode December 19th:రౌడీల చెరలో ఉన్న అశోక్‌ను రాజు విడిపించి కోర్టుకు తీసుకొస్తాడు. కోర్టులో అశోక్ అసలు నిజం న్యాయమూర్తికి చెబుతాడు.

Ammayi garu Serial Today Episode: రూప, రుక్మిణిని పెళ్లిచేసుకున్న రాజు ఎక్కడని న్యాయమూర్తి ప్రశ్నిస్తాడు. ఈకేసుకు సంబంధించిన ఓ ముఖ్యమైన సాక్షిని తీసుకురావడానికి వెళ్లాడని రుక్మిణి చెబుతుంది. ఆ మాటలకు కోమలి, విజయాంబిక కొంచెం భయపడతారు. మీరు కొంచెం సమయం ఇస్తే..ఆ సాక్షిని కోర్టులో ప్రవేశపెడతామని రుక్మిణి న్యాయమూర్తిని కోరుతుంది. దీంతో న్యాయమూర్తి అరగంట టైం ఇస్తాడు.
ఇంతలో రాజు అశోక్ కోసం వెతుకుతూ వెళ్తాడు. ఇంతలో రుక్మిణీ రాజుకు ఫోన్ చేస్తుంది. దీంతో నాకు అశోక్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందని...మీరు ఎదోవిధంగా మేనేజ్ చేయండని చెబుతాడు. ఇప్పటికే 30 నిమిషాలు సమయం ఇచ్చారని ఆలోగా నువ్వు అశోక్‌ను తీసుకుని రావాలని చెబుతుంది. ఇంతలో సూర్యవద్దకు విరూపాక్షి వెళ్లగా...అతను ఆమెపై మండిపడతాడు. నీవల్లే ఈరోజు నేను కోర్టు మెట్లు ఎక్కాల్సివచ్చిందని అంటాడు. ఇన్నాళ్లు నాపై గౌరవం ఉన్నట్లు నటించావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నా మాటలెక్కచేయకుండా నాపై గెలవడానికి కోర్టు మెట్లు ఎక్కించావ్ అని అంటాడు. నువ్వు నాపై గెలవడానికి కన్నకూతురుని కూడా కాదనకున్నావని తిడతాడు. నువ్వు ఎన్ని చేసినా నాబిడ్డ నుంచి రాజును నువ్వు వేరు చేయలేవని అంటాడు. నేను కూడా అదే చెబుతున్నానని...నా బిడ్డ నుంచి కూడా రాజును ఎవరూ వేరుచేయలేరని అంటుంది. నిజం తెలిసిన రోజు నేనేంటో నీకు తెలుస్తుందని అంటుంది.
రాజు కనిపించకపోవడంతో కోమలి కీడు శంకిస్తుంది. మనం కాసేపట్లో కోర్టులో గెలవబోతున్నామని...నువ్వు హ్యాపీగా ఉండమని విజయాంబిక ఆమెకు భరోసా ఇస్తుంది. రూప ఏదో సాక్ష్యం వస్తుందని చెప్పింది కదా అని అంటుంది. ఒకవేళ సాక్ష్యం వస్తే మన పరిస్థితి ఏంటని నిలదీస్తుంది. ఇంతలో రాజు అశోక్ ఉన్న చోటు కనిపెడతాడు. రౌడీలను ఇరదీసి అశోక్‌ను అక్కడి నుంచి తప్పిస్తాడు.ఇంతలో విజయాంబిక రౌడీలకు ఫోన్ చేస్తుంది. అశోక్‌ను వెంటనే వేరే చోటకి షిప్ట్ చేయాలని సూచిస్తుంది. వాడు ఆల్రెడీ వచ్చి అశోక్‌ను విడిపించుకుని వెళ్లిపోయాడని చెబుతారు. ఈ మాట వినగానే విజయాంబిక హడలిపోతుంది. వెంటనే వెళ్లి వాడిని పట్టుకుని అశోక్‌ను తీసుకుని రావాలని ఆదేశిస్తుంది. ఆ రాజు అశోక్‌ను తీసుకొస్తున్నాడని చెప్పగానే కోమలికి భయం వేస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో వాడు కోర్టులోకి అడుగుపెట్టడానికి వీల్లేదని అంటుంది.
కోర్టు తిరిగి ప్రారంభమైనప్పటికీ రాజు రాకపోవడంతో రుక్మిణీ మరికొంత సమయం అడుగుతుంది. దీంతో కోమలి తరఫు న్యాయవాది అభ్యంతరం చెబుతాడు. వీళ్లంతా ఏదో కట్టుకథం అల్లుతున్నారని చెప్పడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతాడు. విజయాంబిక పెట్టిన రౌడీలు మార్గమధ్యలో రాజును అడ్డగిస్తారు. అశోక్‌ను విడిపించుకుని మళ్లీ పరారవుతారు.రాజు కళ్లగప్పి అశోక్‌ను మళ్లీ కిడ్నాప్ చేసినట్లు రౌడీలు విజయాంబికకు ఫోన్ చేసిచెప్పడంతో ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఇక కేసు గెలవబోతున్నామని ఆనందపడిపోతుంది. వాడిని చాలా జాగ్రత్తగా ఎక్కడైనా దాచిపెట్టండని చెబుతుంది.
ఇంతలో న్యాయమూర్తి రాజు ఎక్కడని మళ్లీ ప్రశ్నిస్తాడు.అతని నిర్ణయం చెప్పకుండా ఈకేసులో తీర్పు చెప్పడం సాధ్యం కాదని అంటాడు.అలా అని అతనికోసం కోర్టు సమయం వృథా చేయడం కూడా కరెక్ట్ కాదని న్యాయమూర్తి అంటాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత రూప న్యాయపోరాటంలోఅర్థం ఉందని కోర్టు నమ్ముతోందని అంటాడు. నూకరాజు రెండో భార్యకు విడాకులు ఇవ్వడం జరుగుతోందని తీర్పు వెలువరిస్తాడు. తీర్పుపై అతను సంతకం పెడుతుండగానే...రాజు అశోక్‌ను తీసుకుని కోర్టు హాల్‌లో అడుగుపెడతాడు. దీంతో కోమలితోపాటు విజయాంబిక గుండె జారిపోతుంది. ఈ కేసులో ముఖ్యమైన సాక్షిని తీసుకొచ్చానని న్యాయమూర్తికి చెబుతాడు. దీంతో అశోక్ న్యాయమూర్తికి అన్ని విషయాలు వివరిస్తాడు. ఈ కోమలి నేను చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పగా ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.





















