Ammayi garu Serial Today August 6th: అమ్మాయి గారు సీరియల్: ఇది ఎవరూ ఊహించరేమో.. కోమలి గుట్టు రట్టైందా? DNA రిపోర్ట్స్‌లో ట్విస్ట్.. రూప ఎవరు?
Ammayi garu Serial Today Episode August 6th డీఎన్‌ఏ రిపోర్ట్స్ ఇంట్లో ఎవరూ ఊహించని విధంగా రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప దేవుడికి పూజ చేసి డీఎన్ఏ రిపోర్ట్స్ విషయంలో అంతా జరిగ్గా జరగాలి అని రిపోర్ట్స్‌లో ఏం పొరపాటు జరగకుండా ఉండాలని కోరుకుంటుంది. కోమలి బండారం బయట పడాలి అని మొక్కుకుంటుంది.
రాజు డాక్టర్‌ని తీసుకొని వస్తుంటాడు. మేడ మీద నుంచి కోమలి బయటకు చూసి కంగారు పడుతూ ఉంటుంది. డాక్టర్ వస్తే తన బండారం బయట పడిపోతుంది. ఇక నన్ను చంపేస్తారు. తప్పించుకోవాలి అనుకుంటుంది. విరూపాక్షి కోమలిని చూసి రిపోర్ట్స్ వస్తున్నాయని తెలిసి కూడా ఈ అమ్మాయి ఇక్కడే ఉంది అంటే ఏదో చేయబోతుందని అనుకుంటుంది. ఇక కోమలి బ్యాగ్ సర్దేసి ఇంటి నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. బయటకు చూసి తప్పించుకునే మార్గం లేదని కంగారు పడుతుంది.
దీపక్ తల్లికి కాల్ చేసి రిపోర్ట్స్ మార్చడం కుదరలేదని ఆ అమ్మాయిని పారిపోమని చెప్పు అంటాడు. విజయాంబిక కోమలికి కాల్ చేసి నువ్వు దొరికిపోయేలా ఉన్నావ్ అని కోమలికి ప్లాన్ చెప్తుంది. కోమలి తెగ టెన్షన్ పడుతుంది. అసలైన రూప కోమలి దగ్గరకు వెళ్తుంది. ఈ లోపు కోమలి పారిపోవాలని కిటికీ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో రాజు డాక్టర్‌ని తీసుకొని వస్తాడు. కోమలి పారిపోయే టైంకి రుక్మిణి వచ్చి అక్క నాయన పిలుస్తున్నాడని అంటుంది. ఇంతలో చంద్ర రిపోర్ట్స్ వచ్చాయని చెప్తాడు. నీ బండారం బయట పడుతుంది రా అని రుక్మిణి కోమలిని తీసుకొని వస్తుంది.
కోమలిని చూసి దీపక్, విజయాంబిక టెన్షన్ పడతారు. ఇది కిందికి వస్తుంది ఏంటి పారిపోమని చెప్పాం కదా అనుకుంటుంది. రిపోర్ట్స్ సూర్యప్రతాప్ చేతికి డాక్టర్ ఇస్తారు. కోమలి చెమటలు పట్టేస్తుంది. దీపక్, విజయాంబిక కూడా వణికిపోతారు. ఇక సూర్యప్రతాప్ రిపోర్ట్స్ చూసి లేచి నిల్చొనే ఎక్స్‌ప్రెషన్ చూసి కోమలి గుండె ఆగినంత పని అయిపోతుంది. దొరికిపోయా అని అనుకుంటుంది. రూప వాళ్లు కోమలి పని అయిపోయింది అనుకుంటారు. కానీ అందరి ఊహల్ని తారుమారు చేసేలా ఇంట్లో అందరికీ షాక్ ఇస్తారు. కోమలిని రూప అని పిలిచి సూర్యప్రతాప్ ఎమోషనల్ అయిపోతాడు. రూప, రాజు, విరూపాక్షి, మందారం బిత్తరపోతారు.
సూర్యప్రతాప్ కోమలిని హగ్ చేసుకుంటాడు. కోమలి, విజయాంబిక, దీపక్‌లకు కూడా ఇది పెద్ద షాకే. వాళ్లు కూడా ఇలా ఎలా జరిగిందా అని షాక్ లోనే ఉంటారు. సూర్యప్రతాప్ సంతోషంతో నువ్వు నా కూతురు రూపవమ్మా నా కూతురు రూపవే అమ్మా.. రిపోర్ట్స్ రూపవే అని చెప్పాయమ్మా అని అంటాడు. రుక్మిణి ఇలా జరగడానికి వీల్లేదని అరుస్తుంది. సూర్యప్రతాప్ రాజునే కదా దగ్గరకుండి చూసున్నాడు అని అంటుంది. రాజుని అడిగితే క్లియర్‌గా జరిగింది అంటాడు. విరూపాక్షి కూడా సూర్య ఇది మన బిడ్డ కాదు అని అంటుంది. రాజు మనసులో ఇలా ఎలా జరుగుతుంది. ఇలా కాకూడదు కదా అనుకుంటాడు. సుమ రూప అని పిలవగానే కోమలి పిన్ని బాబాయ్ అని హగ్ చేసుకొని ఏడుస్తుంది. నువ్వు మా రూప అని మాకు తెలుసమ్మా అని సుమ, చంద్ర అంటారు. రూప చాలా బాధ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















