Ammayi garu Serial Today April 16th: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్‌కి ఉరి శిక్ష పడుతుందా.. రూప, రాజులు సూర్యని కాపాడుకుంటారా!
Ammayi garu Today Episode సూర్య ప్రతాప్ రాధికను చంపాడని సూర్యకి ఉరిశిక్ష వేయాలని కోర్టులో కోరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప, రాజులు జీవన్ దగ్గరకు వెళ్తారు. జీవన్ మీ ఇంటిని నాశనం చేయాలి అని ఇదంతా చేశానని అంటాడు. నువ్వు మా సంగతి చూసేదేంటిరా నేనే మీ సంగతి చేస్తూ అని జీవన్‌ని లాక్కెళ్లాలని ప్రయత్నిస్తే జీవన్ రాజుని నెట్టి రాధిక నన్ను మోసం చేసింది అందుకే దాన్ని తగలబెట్టాను అని అంటాడు. చిన్న మోసానికే రాధికను చంపాను మీరు చేసిన మోసానికి మిమల్ని చంపేస్తా అంటాడు. జీవన్‌ని తీసుకెళ్దామని రూప అంటే సాక్ష్యాలు లేవు కదా నన్నేం చేయలేరు అని పోరా అని రాజుని తోసేస్తాడు.
రాజు, రూపలు వెళ్లిపోతారు. దీపక్, విజయాంబికలు తమకు ఆస్తి రాకుండా అయిపోయిందని జీవన్‌కి మోసం చేశాం కదా మనల్ని బతకనివ్వడు అని దీపక్ అంటాడు. ఎప్పుడేం చేయాలా అని మనం రిస్క్‌లో ఉన్నాం అని దీపక్ అంటాడు. ఆలోచిద్దాం అని విజయాంబిక అంటుంది. మనం జీవన్‌కి దొరకమని రాధిక చనిపోవడం మనకు లాభం అని జీవన్ చేసిన పనికి మీ మామయ్య బయటకు రాడు కాబట్టి మనమే ఆస్తి మొత్తం దక్కించుకోవాలని అంటుంది. ఏంటి మమ్మీ నీ ధైర్యం అంటే రాజు, రూపలు అని వాళ్లకి జీవన్ మీద అనుమానం ఉంది కాబట్టి జీవన్‌ని లోపల వేయిస్తారు. మీ మామయ్య బయటకు వచ్చేలోపు మనం ఆస్తి తీసుకోవాలని అంటుంది.
రాజు, రూపలు ఇంటికి వస్తారు. అందరూ రాధికను ఎవరు చంపారని అనుకుంటారు. జీవన్ నుంచి తప్పించుకోవాలని దీపక్, విజయాంబికలు చెప్తారు. వాడికి నాలుగు తగిలించడంతో నిజం ఒప్పుకున్నాడు కానీ సాక్ష్యాలు లేవు కాబట్టి ఏం చేయలేరని చెప్పాడని అంటారు. నాన్నని పోలీస్ స్టేషన్‌లో ముద్దాయిలా చూడలేకపోతున్నా అని రూప ఏడుస్తుంది. కోర్టుకి ఆధారాలు కావాలి వాటిని మనం సంపాదించాలని రూప అంటుంది. ఇక విరూపాక్షి దేవుడి ముందు కూర్చొని సూర్య నా విషయంలో చేసిన తప్పునకు ఈ శిక్ష వేస్తావా స్వామి ఇలాంటి నిందలు సూర్య మీద వేస్తుంటే భరించలేకపోతున్నా అని విరూపాక్షి ఏడుస్తుంది.
ఉదయం అందరూ కోర్టుకు వస్తారు. పీపీ జడ్జితో సూర్యప్రతాప్‌ని శిక్షించమని నిన్నే చెప్పామని అయినా మీరు మంచివాడని అన్నారు కానీ సూర్యప్రతాప్ నా క్లైంట్‌ని చంపేశాడని వీడియో జడ్జికి చూపిస్తాడు. అది జడ్జి చూస్తారు. నేనేం చేయలేదు అని సూర్యప్రతాప్ చెప్తే నీ ఫ్యామిలీ చేయించుకుంటారని పీపీ అంటారు. సూర్యప్రతాప్‌ని కఠినంగా శిక్షించాలని పీపీ కోరుతాడు. సూర్యప్రతాప్‌కి ఉరి శిక్ష వేయాలని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. విజయాంబిక కొడుకుతో మీ మామయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మళ్లీ జీవన్‌ని నమ్మించి జీవన్ దగ్గరకు చేరిపోవాలి అంటుంది. సూర్యప్రతాప్ తాను ఏ తప్పు చేయలేదని రాధిక చేసిన మోసానికి కోపంలో ఏదో అనేశానని కుటుంబ సాక్షిగా చెప్తున్నా రాధికను నేను చంపలేదు చంపించలేదు అని చెప్తాడు. కట్టుకున్న భార్య తప్పు చేసింది అన్న అనుమానంతో 25 ఏళ్లుగా భార్యని దూరం పెట్టి శిక్షించిన ఈ పెద్ద మనిషి రాధికని ఎంత కఠినంగా శిక్షిస్తాడో తెలీదా అంటాడు. దాంతో విరూపాక్షి వచ్చి సూర్యప్రతాప్ గతం ఎందుకు తవ్వుతున్నారు. ఇందులోకి అనవసరంగా సూర్యప్రతాప్ భార్య అంటే నన్ను ఎందుకు లాగుతున్నారు అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















