Amardeep Chaudhary tejaswini gowda: స్టేజ్ పైనే తేజస్వినితో కంటతడి పెట్టించిన అమర్ దీప్ (జానకి కలగనలేదు రామ)
అందాల కోయిలమ్మ, మంచి మనసున్న రామ. సైలెంట్ గా ప్రేమ ప్రయాణం సాగించిన వీళ్లిద్దరూ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. వినాయకచవితి ఈవెంట్ లో సందడి చేసిన వీళ్లిద్దరూ బుల్లితెర ప్రేక్షకులను ఏడిపించేశారు..
Amardeep Chaudhary tejaswini gowda: తేజస్విని గౌడ ( కోయిలమ్మ సీరియల్ లో లీడ్ రోల్, ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటిస్తోంది), అమర్ దీప్ చౌదరి ( జానకి కలగనలేదు రామ). సడెన్ గా నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు బయటకు రావడంతో అంతా అవాక్కయ్యారు. భలే సీక్రెట్ మెంటైన్ చేశారే అనుకున్నారు. ఎందుకంటే వీళ్లప్రేమ గురించి ఎక్కడా చిన్న వార్తకూడా రాలేదు..ఇద్దరూ కలసి కనిపించిన ఫొటోలు బయటకు రాలేదు. అందుకే వీళ్లు పెళ్లిచేసుకుంటున్నారగానే ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు బుల్లితెర నటులు, అభిమానులు. వీళ్ల నిశ్చితార్థం బెంగళూరులో జరిగింది.
Also Read: పరధ్యానంలో రిషి - రిషి ధ్యానంలో వసు, ప్రేమ పిచ్చి ముదిరింది!
ఇంతకీ తేజస్విని ఎందుకు కన్నీళ్లు పెట్టిందంటే..వినాయకచవితి సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో అమర్ దీప్, తేజస్విని హైలెట్ అయ్యారు. స్టేజ్ పై అమర్ దీప్ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ చూసి కోయిలమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అమర్ దీప్ తాను మొదటగా ఎలా ప్రపోజ్ చేశాడో చెప్పిన తర్వాత..నీకోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేశానన్నాడు. తేజస్విని తల్లిని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. తేజస్విని కళ్లు మూసిన అమర్ దీప్..చనిపోయిన ఆమె తండ్రి మైనపు విగ్రహాన్ని తీసుకొచ్చి స్టేజ్ పై కుర్చీలో కూర్చోబెట్టి సర్ ప్రైజ్ చేశాడు. అది చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది తేజూ. భర్త ప్రేమతో పాటూ తండ్రిప్రేమను కూడా అందిస్తావనే నమ్మకం నాకొచ్చిందంటూ అమర్ దీప్ పై ప్రశంసలు కురిపించింది తేజస్విని తల్లి. ఇదంతా చూసి తోటి నటులు, ప్రోమో చూసిన ఆడియన్స్ గుండెలు కూడా బరువెక్కేసాయి..
తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న తేజస్విని గౌడ కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.2016 లో షార్ట్ ఫిలింతో కెరీర్ స్టార్ట్ చేసిన అమర్ ఆతర్వాత సూపర్ మచ్చి, రాజధాని లవ్ స్టోరీ సహా పలు వెబ్ సిరీస్ లో నటించాడు. 'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో తెలుగు టీవీ ఆడియన్స్ కి పరిచయమైన అమర్ సెకండ్ హీరోగా మెరిసి.. 'సిరిసిరి మువ్వలు' సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, శైలజరెడ్డి అల్లుడు, సారధి, ఎవరు సినిమాల్లో నటించాడు. అమర్ దీప్ ప్రస్తుతం 'జానకి కలనగలేదు'లో హీరోగా నటిస్తున్నాడు.
Also Read: కార్తీక్ కి దీప గతం గుర్తొచ్చేలా చేయగలదా, మోనితపై సౌందర్యలో మొదలైన అనుమానం!
22 నవంబర్ 1995లో జన్మించిన తేజస్విని బెంగళూరులో పెరిగింది. రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో B.Eలో కళాశాల డిగ్రీ పూర్తి చేసింది. అనంతపురంలో జన్మించిన అమర్ దీప్ చౌదరికి చిన్నప్పటి నుంచీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బీటెక్ అయ్యాక, యూకేలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఓ ఏడాది సాఫ్ట్ వేర్ ఎడ్వైజర్ గా పనిచేసిన అమర్ చాలా డాన్స్ షోస్ లో పాల్గొన్నాడు.