Trivikram- Allu Arjun New Movie: ఇట్స్ అఫీషియల్ - బన్నీతో త్రివిక్రమ్ నాలుగో మూవీ, హీరోయిన్ ఆమేనా?
అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు రాగా, ఇది నాలుగో చిత్రం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆ ఊహాగానాలు నిజమేనని తేలిపోయాయి. బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ(సోమవారం) ఉదయం 10:08 గంటలకు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే, గతంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘అలా వైకుంఠపురములో‘ చిత్రాన్ని కూడా ఈ రెండు నిర్మాణ సంస్థలు నిర్మించాయి. ‘జులాయి‘, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి‘, ‘అలా వైకుంఠపురములో‘ తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న నాలుగో చిత్రం ఇది. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఒకదానికి మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు నెలకొల్పాయి.
చివరగా వీరిద్దరు కలిసి చేసిన ‘అలవైకుంఠపురంలో‘ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే ఈ కాంబో అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. ఈ కొత్త సినిమా పాన్ ఇండియన్ లెవల్లో రూపొందనుందని టాక్. ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత మూడు సినిమాలతో పోల్చితే ఈ చిత్రం మరింత అద్భుతమైన సక్సెస్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. అయితే, ఈ మూవీలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’లో పూజా ఛాన్స్ మిస్సయిన నేపథ్యంలో బన్నీతో జతకట్టే అవకాశాలున్నాయని టాక్.
మహేష్ తో ‘గుంటూరు కారం‘ సినిమా చేస్తున్న త్రివిక్రమ్
త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు. 'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ నగర శివారులోని శంకరపల్లి ఏరియాలో చిత్రీకరణ జరుగుతోంది. ఇది చిన్న షెడ్యూల్ అని తెలుస్తోంది. ఇది ముగిసిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని భారీ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట. ఆగస్టు 9న హీరో మహేష్ బాబు పుట్టినరోజు. అప్పుడు మేజర్ బ్రేక్ ఉంటుందని తెలుస్తోంది. అది మినహా అక్టోబర్ నెలాఖరు వరకు షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు.
‘పుష్ప: ది రూల్‘ షూటింగ్‌లో బన్నీ బిజీ
మరోవైపు, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్‘ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ ఏ స్థాయిలో హిట్ కొట్టిందో తెలిసిందే. అందులో బన్నీ నటనకు యావత్ దేశం ఫిదా అయ్యింది. ‘తగ్గేదేలే’ అంటూ ఊహించని విజయం అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు, దర్శకుడు సుకుమార్‌కు కూడా ఇది పెద్ద ఛాలెంజ్ గా చెప్పుకోవచ్చు.
Read Also: Bigg Boss OTT 2: ‘బిగ్ బాస్’ హౌస్ లో ‘ముద్దు‘ దుమారం, క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial